ఇవ్వాళ ఎందుకో యాదృశ్చికంగా ఒసామా బిన్ లాడేన్ చివ్వరి సారిగా నివసించిన ఇంటి చిత్రాలకు సంబందించిన లంకె కనబడింది. మీరు చూసారా?
మదిలో ఎన్నో, ఎన్నేన్నో!! ఆలోచనలు.. ఉబుసు పోక ఇలా.. ఇక్కడ..
ఇవ్వాళ ఎందుకో యాదృశ్చికంగా ఒసామా బిన్ లాడేన్ చివ్వరి సారిగా నివసించిన ఇంటి చిత్రాలకు సంబందించిన లంకె కనబడింది. మీరు చూసారా?
ఈ నెలలో ఇప్పటికి ఇది మూడవ సారి నేను వర్షాల గురించి వినడం. మొన్నా మధ్య భాగ్యనగరంలో చిరుజల్లుతో మొదలై కుండపోతగా ఓ రోజు పుల్లుగా కురిసేసింది. దానికి తోడుగా నిన్న జరగాల్సిన IPL మాచ్ వర్షం కారణంగా కొంతసేపు పోస్ట్ పోన్ అయ్యింది. ఇరవై ఓవర్లు జరగాల్సిన మాచ్‌ని పదిహేడు ఓవర్లకు కుదించినందువల్ల చెన్నై సూపర్ కింగ్స్ వారు నూటముప్పై ఒక్క పరుగులే చేయడం కోచీ టస్కర్స్ వారికి అనుకూలించింది. చక్కగా కోచీ వారు పదిహేడు ఓవర్లలో కొట్టాల్సిన దానిని పదిహేను ఓవర్లలోనే సాధించి గెలిచేసారు. ఇదంతా వరుణుడి వల్లనే అని నా అభిప్రాయం.
వీటికి తోడుగా ఈ రోజు బెంగళూరులో జరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్ మరియు రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కూడా ఆలస్యంగా మొదలౌబోతోంది. దీనికి కారణం కూడా వర్షమే. ఈ మ్యాచ్ మొదలౌతుందో లేదో అనేది అనుమానమే. వాతావరణ శాఖ వారి వివరం ప్రకారం, IPL మ్యాచ్ లలో చాలా వాటికి వర్ష బెడద ఉండేటట్టు ఉంది. దీనికి తోడుగా రేపు కొలకత్తాలో జరగనున్న మ్యాచ్, కోచీ టస్కర్స్ మరియు కోలకత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న ఆటకూ వర్షం ఆటంకం కానుంది. ఇంతే అనుకుంటే, వచ్చే ఆదివారం భాగ్యనగరంలో జరగనున్న మ్యాచ్, డక్కన్ చార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగే ఆటకు కూడా వర్షం ఆటంకం కానుంది.
ఇవన్నీ ప్రక్కన పెడితే, ఎండా కాలంలో వర్షాలు అనే ఆలోచన వింతగా ఉంది. ఇదేమైనా క్లైమేట్ షిఫ్ట్ (వాతావరణ / ఋతువుల కదలిక) అని మనం అనుకోవచ్చా? కొంత కాలం అయితే ఏప్రియల్ నెల నుంచి వర్షాకాలం మొదలై ఎండాకాలం జనవరి నుంచి ఉంటుంది అని అనుకోవచ్చా!! ఏమో ఇలాంటి ఆలోచనే క్రొత్తగా ఉంది. ఇలా ఆలోచించాలంటేనే భయంగా ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్లు? ఏమో ఈ పీత బుర్రకి అంతు పట్టటం లేదు.
“నా గురించి” అంటూ ఒక ఉచిత సౌలభ్యాన్ని about.me అనే వెబ్ సైట్ వారు అందుబాటులోకి తీసుకు వచ్చారు. నేను ఒక సైట్ తయారు చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇది బాగుంది. వీలైతే చదివే వారు ఉపయోగించుకోండి. ఈ సౌలభ్యంలో నాకు నచ్చిన మరియు నా సలహాలు ఈ క్రింది విధంగా..
నచ్చిన విషయాలు:
1) చక్కగా మనకు నచ్చిన చిత్రాన్ని మన సైట్ నందు ఉంచుకోవచ్చు
2) మనకు ఉన్న వివిధ బ్లాగులను ఒక చోట చేర్చి చూపించ వచ్చు
3) ట్వీటర్ ట్వీట్స్ మరియు మరికొన్ని ఇతర ఉపకరణాలలో నా క్రియలు ఇక్కడ నుంచే చూడవచ్చు
నా సలహాలు
1) ప్రస్తుతానికి వీరు ఒక బ్లాగర్ ఎక్కౌంట్ మాత్రమే కలుపుకోవడానికి అనుమతినిస్తున్నారు. నాకు తెలుగు బ్లాగులు రెండు ఉన్నందున, ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు కలుపుకునే విధానం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం
2) మనం అప్‍లోడ్ చేసుకున్న చిత్రాన్ని మన సైట్ నందు అయితే మధ్యస్తమంగా (center) ఉంచుకోవచ్చు లేదా అంతటా పరచేవిధంగా (tile) చేసుకునే వీలు ఉంది. అంతే కానీ కుడి చేతి వైపునకో లేదా ఎడమ చేతి వైపునకు ఎడ్జెస్ట్ చేసుకునే అవకాశం లేదు.
ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుతూ మిగిలిన విషయాలను మీరు తెలుసుకోండి
ఈ మధ్య బాలయ్య తీస్తున్న కొత్త సినిమాకి నాకు డైలాగ్స్ వ్రాసే అవకాసం వచ్చింది. పనిలో పనిగా ఓ పది డైలాగ్స్ బాలయ్యకు వినిపించడం జరిగింది. వాటిలో ఈ క్రింద చెప్పినది బాలయ్యకు బాగా నచ్చింది. కాబట్టి ముందుగా మీకు లీక్ చేస్తున్నా, ష్.. ఎవ్వరికీ చెప్పొద్దు. సినిమా కధ ఇంకా చర్చల్లో ఉంది, కధ ఏదైతేనేం, ఆఖర్లో డైలాగ్స్ వ్రాసేది నేనేగా.
నువ్వు ఒక్కడివే రా, ఒక్కొక్కడ్ని పెంచుకుంటురా, ఒక్కొక్క సారిగా రా, వచ్చిన ఒక్కొసారి ఒక్కోదెబ్బతో నేనొక్కడ్నే ఒక్కటిస్తా ఒక్కొక్కడూ వందౌతాడు