పేజీ తిప్పితే ..
ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది.
ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ మించి కధాగమనంలోని మాటల విషయంలో ఆ రచయితని మెచ్చుకోకుండా ఉండలేను. దీనినే క్రియాత్మకత అని అంటారు.
ఎవ్వరైనా ఏదైనా ఫొటో మోడల్ గా చేద్దాం అని అనుకునేవారు ఈ చిత్రాన్ని చూస్తే చాలా ఆనందిస్తారు అని వ్రాయటం కన్నా ఆస్వాదిస్తారు అని వ్రాయటం భేషుగా ఉంటుందేమో. ఒక్క సారి ఆలోచిస్తే పుస్తకంలో ఉండే ప్రకటనలలోని పాత్రలు నిజంగా ఇలాగే ఆలోచిస్తాయా అనేటటువంటి ఊహ ఎంత విచిత్రంగా ఉందో కదా. ప్రకటనలలోని పాత్రలు కనుక నిజంగా ప్రాణం వస్తే ఇలాగే ఆలోచిస్తాయేమో!!
10 తరువాతి సంఖ్యలపై చెత్త కోణం
అంకెల గురించి తెలియని వారు ఉండరు. తొమ్మిది తరువాత వచ్చే సంఖ్యని పది అని ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. కాకపోతే, ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ తరువాత వచ్చే సంఖ్య గురించే.. 11 మఱియు 12 వదిలేసి తరువాత వచ్చే అంకెలను తలచుకుంటే, అవి చక్కగా
పది + మూడు = పదమూడు
పది + నాలుగు = పద్నాలుగు
వగైరా వగరా అంటూ సాగి పోకుండా సదరు పదుల వరస అంతా చెత్త చెత్తగా పొంతన లేకుండా సాగుతుంది. అదే ఇరవైల వరసలో అంకెలు చక్కగా పొందికగా ఒద్దికగా ఓ పద్దతి ప్రకారంగా సాగుతాయి..
ఇరవై + ఒకటి = ఇరవైఒకటి
ఇరవై + రెండు = ఇరవైరెండు
డెభై + మూడు = డెభై మూడు
అరవై + నాలుగు = అరవైనాలుగు
తొంభై + ఐదు = తొంభై ఐదు
ముప్పై + ఆరు = ముప్పైఆరు
నలభై + ఏడు = నలభైఏడు
తొంభై + ఎనిమిది = తొంభైఎనిమిది
యాభై + తొమ్మిది = యాభైతొమ్మిది
అంటూ చక్కగా ఓ లెక్కా పత్రంగా సాగుతాయి. ఎటొచ్చీ ఈ పదుల వరసే తలతిక్కగా సాగుతుంది. ఈ విషయం ఒక్క తెలుగులోనే అనుకుంటే పొరపాటే, గ్రహపాటు పరంగా ఇది అటు ఆంగ్లంలోను ఇటు హిందీలో కూడా వంకరటింకరగా చెత్త చెత్తగా గజిబిజిగా ఉన్నాయి. ఇవి కనిపెట్టినవాడు కనుక నాకు కనబడితేనా.. నా సావిరంగ చింత బరిక పట్టుకుని.. దింతాక్ చితా చితా జింతాక్ థా.. చేసేస్తా.
నాకు అర్దం కాని విషయం ఏమిటంటే, ఒక్క తెలుగుకే తెగులు పట్టిందనుకుంటే, అటు ఆంగ్లానికి ఇటు హిందీకి కూడా పోయ్యే కాలం దాపురించింది. నాకు ఈ మూడు భాషలలోనే ఈ అంకెలను ఏమంటారో తెలుసు, మిగిలిన భాషలలో కూడా ఇలాగే ఉందే లేదో ఆయా భాషలు వచ్చిన వారు చెప్పాలి.
| ఎలా ఉంటే పద్దతిగా ఉంటుంది | ||||||
| తెలుగులో | ఆంగ్లంలో | హిందీలో | తెలుగులో | ఆంగ్లంలో | హిందీలో | |
| పది+ఒకటి = | పదకొండు | ఎలవెన్ | గ్యారాహ్ | పదొకటి | వన్టీవన్ | ఇక్ దస్ |
| పది + రెండు = | పన్నెండు | ట్వల్వ్ | బారాహ్ | పద్రెండు | వన్టీటూ | బా దస్ |
ఈ విధంగా సాగితే, రాబోయే రోజులకి కాబోయే లెక్కల మాస్టారిని నేనే..
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త
ఓ పెద్ద ఫ్లాప్, కొమరం పులి నుంచి బయట పడి, కొత్తగా రిలీజ్ అవుతున్న తీన్‍మార్ సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక శుభవార్త. కొమరం పులి పాటల గురించి ఓ రివ్యు ఇంతకు ముందు వ్రాసాను. అది నేను వ్రాసిన మొదటి పాటల రివ్యు. స్వతహగా నేను సినిమాలు చూడాలనుకోను, కానీ ఏదైనా సినిమా నేను చూడాలనుకుంటే.. అంతే సంగతులు.. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందే.
అలా నేను చూడాలనుకున్నానంటే అది ఖచ్చితంగా ఫ్లాపే అని చాలా సార్లు ఋజువైంది. కొమరం పులి సినిమా విషయంలో కూడా ఇది నిజమైంది. కాకపోతే కొత్తగా వచ్చే తీన్‍మార్ సినిమా విషయంలో నేను చూడాలనుకోవటం లేదు. అన్నంత మాత్రాన ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేను కానీ, ఫ్లాప్ మాత్రం కాదు. అంటే, నిర్మాతకు నష్టం లేదు అన్నమాట.
ఆ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక శుభవార్తే అని నా అభిప్రాయం. ఈ పుట చదివిన వారిలో పవన్ అభిమానులెవ్వరైనా ఉంటే, స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేయ మనవి.
బాలయ్య సినిమాకి నేను వ్రాసే పంచ్ డైలాగ్
ఈ మధ్య బాలయ్య తీస్తున్న కొత్త సినిమాకి నాకు డైలాగ్స్ వ్రాసే అవకాసం వచ్చింది. పనిలో పనిగా ఓ పది డైలాగ్స్ బాలయ్యకు వినిపించడం జరిగింది. వాటిలో ఈ క్రింద చెప్పినది బాలయ్యకు బాగా నచ్చింది. కాబట్టి ముందుగా మీకు లీక్ చేస్తున్నా, ష్.. ఎవ్వరికీ చెప్పొద్దు. సినిమా కధ ఇంకా చర్చల్లో ఉంది, కధ ఏదైతేనేం, ఆఖర్లో డైలాగ్స్ వ్రాసేది నేనేగా.
నువ్వు ఒక్కడివే రా, ఒక్కొక్కడ్ని పెంచుకుంటురా, ఒక్కొక్క సారిగా రా, వచ్చిన ఒక్కొసారి ఒక్కోదెబ్బతో నేనొక్కడ్నే ఒక్కటిస్తా ఒక్కొక్కడూ వందౌతాడు
యువతరం డైలాగ్
ఆరు నూరు ఎలా అయ్యింది
ఆరు నూరైనా సరే .. అంటూ ఏదైనా పనిని, నేనాపని చెయ్యను అంటే చెయ్యను అనే ఉద్దేశ్యం వచ్చేటప్పుడు లేదా అలాంటి భావనతో నేను చెయ్యను అనే భావం వచ్చే విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చాలా సార్లు వాడి ఉంటాం. కానీ మీకు ఆరుని నూరుతో సమానం చెయ్యడం ఎలాగో తెలుసా. ఇదిగో ఇలా..
Let a = b
Multiply with 94 on both sides then
94 a = 94 b
We can rewrite this as
(100 – 6) a = (100 – 6) b
Now let’s remove the brackets
100 a – 6 a = 100 b – 6 b
Let’s move the 100s to one side and 6s one side then
100 a – 100 b = 6a – 6 b
Now let’s take the common constants out
100 (a–b) = 6 (a–b)
When (a-b) = (a-b) then 100 = 6
ఇన్‍సెప్షన్ - రివ్యూ
మరో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సినిమా. ఇది నా నోటి నుంచి వెలువడిన మొదటి అభిప్రాయం. ఈ సినిమా మొత్తం కలలు మరియు కలలలోని కలల గురించి. బాగుంది. విజ్యువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కధలోని కొన్ని అంశాలు ఆలోచింప జేసివిగా ఉన్నాయి.
ఈ సినిమా కనుక అవతార్ నిర్మించిన జేమ్స్ కేమరూన్ అయితే కనుక ఇంకా బాగా తీసేవాడు. అన్నింటికన్నా మించి కధని రక్తి కట్టించే విధంగా సన్నివేశాలను సృష్టించడమే కాకుండా వాటిని వ్రాసిన కధకుడి ఆలోచనలో ఉన్నట్టు తీసిన స్క్రీన్ ప్లే హెడ్ టీమ్‍ని మెచ్చుకోకుండా ఉండలేము.
ఇందులోని కొన్ని కొన్ని సన్నివేశాలలో నాకు చాలా నవ్వు వచ్చింది. ఒక సారి విలన్ కలలో ఉన్నాననుకుంటే, కాదు నువ్వు నా కలలో ఉన్నావు అని సన్నివేశాన్ని మార్చడం భలే పసందుగా ఉంది.
మరోశారి ఏనుగుల గురించి ఆలోచించద్దు అని ఓ పాత్ర మరో పాత్రతో చెపి, ఇప్పుడు నువ్వేమి ఆలోచిస్తున్నావు అని అంటే.. ఏనుగుల గురించి.. అని సమాధానం ఇచ్చినప్పుడు.. ఆ ఆలోచన స్వతహాగా నీది కాదు. కానీ నువ్వు ఆలోచించాలని నేను అలా ఆలోచించోద్దు అని అనగానే నువ్వు ఆలోచించడం మొదలుపెడతావు.. ఇదిగో ఇలా నీకు తెలియకుండా నీలో చాలా ఆలోచనలను ఎదుటివారు నీ మసిష్కంలో నాటి పోతే నువ్వు వాటిని పెంచి పోషించి పెద్దవి చేస్తున్నావు. ఆ విధంగా నీలోని భావాలకు అలాగే ఆలోచనలకు వేరేవ్వరో ఇన్సెప్షన్ అని చెబుతాడు.
ఇదిగో ఇలా కొన్ని కొన్ని సీన్లు మిమ్మల్ని వద్దనకుండానే ఆలోచింప చేస్తాయి. కానీ ఈ సినిమా నాకు బోర్ కొట్టింది కాబట్టి రెండు ఇంటర్వెల్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఈ సినిమా ఆడే ధియేటర్లలో రెండు ఇంటర్వెల్స్ ఉంటే ఈ సినిమా ఆడుతుంది. లేక పోతే ఐ యామ్ నాట్ ష్యూర్ ఎబౌట్ ద ఫ్యూఛర్ ఆఫ్ ద మూవి. ఆఖరిగా అందిన సమాచారమేమిటంటే, నూట అరవై మిలియన్ డాలర్లు పెట్టి సినిమా తీస్తే, చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధానంగా మొదటి వారాంతపు కలక్షన్లు దాదాపు డెభై మిలియన్లు మాత్రమే వచ్చాయి, కాకపోతే ఆడ్స్ ద్వారా ఓ వంద మిలియన్లు సంపాదించుకున్నారు. అలా మొత్తం మీద చేతులు కాల్చుకోకుండానే బయట పడ్డారు మన వార్నర్ బ్రదర్స్
నా రెకమెండేషన్ అయితే ఇంటలిజెంట్ అయిన అమ్మాయితో ఈ సినిమా చూడండి లేదా ఇంటలిజెంట్ అయిన అబ్బాయితో చూడండి అదీ ఇదీ కాకపోతే మీరే ఇంటలిజెంట్‍గా ఆలోచించేటట్టైతే చూడండి, నాకు బోరు కొట్టింది అంటే నేను అంత ఇంటలిజెంట్ కాదన్న విషయం ఎప్పుడో అర్దం అయ్యింది కాబట్టి నన్ను “.. ఇంటలిజెన్స్ ని సినిమాని కలిపావు మరి తమరెట్లా చూశారో!!” అని ప్రశ్నించక ముందే నాకు బోర్ కొట్తిందని చెప్పానన్న మాట. నా ఈ ఇంటలిజెంట్ రివ్యూ ఎలా ఉంది?
సెక్స్ నిర్వచనం
భార్యతో చేసినప్పుడు అది ఒక .. భాద్యత
ప్రియురాలితో చేసినప్పుడు అది ఒక .. కళ
భర్మచారి(ణి)తో చేసినప్పుడు అది ఒక .. పాఠం (ఎలా చేయ్యాలో నేర్పించే విధానం)
వ్యభిచారితో చేసినప్పుడు అది ఒక .. వ్యాపారం
విధవరాలితో చేసినప్పుడు అది ఒక .. దాతృత్వం
-- తో చేసినప్పుడు అది ఒక .. త్యాగం
(Fill in the blanks)
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
సోమవారం .. ఎందుకొద్దు?
జైల్ సూపరింటెండ్ : ఇదిగో 486 .. నిన్ను వచ్చే సోమవారమే ఉరి తీసేది.. సిద్దంగా ఉండు..
ఖైదీ : ఓ.. Please not on a monday!!
జైల్ సూపరింటెండ్ : .. ఏం.. ఏమైంది?
.
.
.
.
.
ఖైదీ : It is such a bad way to start a week
కొన్ని ప్రకటనలు
ఏదో పరాచకంగా ఉన్న నాకు ఔషదంలా పని చేసిన ఓ వీడియో.. ఇందులోని కొన్ని ప్రకటనలు చాలా క్రియేటివ్ గా ఉన్నాయి..
నాకు నచ్చిన వాటిల్లో ఒకటి చివ్వర్లో ఉంది.. కానీ దురదృష్టం ఏమిటంటే, నాకు జీన్స్ పాంట్లు లేవు. అదేదో ఇంగ్లీష్ సామెత చెప్పినట్లు, మెన్ ఆర్ లైక్ మెన్.. యెస్ వి ఆర్ ఆల్ వేస్..
మీకు ఎలా అనిపించాయి? మొహమాటం పడకుండా చెప్పెయ్యండి..
Joke
Teacher : what is the difference between IGNORANCE and APATHY
.
.
.
.
.
.
.
Student : the same as, “I do not know” and “I do not care”
Life అంటే..
మొన్నామధ్య ఓ పెద్దాయనతో మాట్లాడుతూ ఉంటే, ఎదో ఆశువుగా ఇలా దొర్లించారు..
Birth is the start of life..
Beauty is the art of life..
Duty is the part of life..
Death is the last of life..
Responsibility is the source of life..
But, Love is
heart and hope of life
మరి మీరేమంటారు.. ఆ పెద్దాయన లెక్క బాగుందే..
self డబ్బా
Most of the important things are incomplete with out
ME..
Things like ..
_ _ mory..
Co _ _ dy,
Precious Ti _ _,
Valuable Ga _ _,
So _ _ thing,
_ _ eting..
Even this lovely _ _ ssage is incomplete with ME
What do you say?
మంగ తాయారు పై నా అభిప్రాయం మరియు స్టాటిస్టిక్స్

మొన్నామధ్య ఎఱక్కపోయి ఇరుక్కుపోయ్యాను. ఏంటీ .. అదేదో పాట గుర్తుకు వస్తోందా.. హు.. అచ్చం అలాగే ఎఱక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయ్యాను. ఆ రోజు కొంచం వీలు చూసుకుని శ్రీమతితో కూర్చుని ముచ్చట్లాడుతూ అడ్డంగా దొరికి పోయ్యాను. దేని గురించి అనుకుంటున్నారా.. అదేనండి శీర్షికలో చెప్పిన, మంగ తాయారు (కాప్షన్ : my name is maggi) సీరియల్ గురించి.
ఈ సీరియల్ అచ్చంగా అరగంట సేపు వస్తుంది, ఈ విషయం అందరికీ తెలిసిందే, ఒక్క నాకు తప్ప. శ్రీమతితో కలసి ఆ రోజు బయటికి వెళ్ళి సరదాగా తిరిగి ఏదైనా రెస్టారెంట్లో భోజనం చేద్దాం కదా అని మనసులొ అనుకుంటూ, TV చూస్తున్న శ్రీమతి ప్రక్కన చేరి పిచ్చాపాటి మొదలపెట్ట బోయ్యాను. తెలుగు TV ఛానల్స్ లోని ఏ సీరియల్ చూడకూడదు అనేది మా ఇంట్లో ఒక సాశనం (నాది). కారణం ఎమిటంటే, ప్రతీ సీరియల్‍లో ఏదో ఒక చెత్త. ఒక దాంట్లో ఒక అత్తా కోడళ్ళ పోట్లాటలైతె మరోదాంట్లొ అక్రమ సంబందాలు. నీతి మాలిన కార్యక్రమాలే అన్నీ. ఆనందానికో సంతోషానికో మనం ఆటవిడుపుగా TVని ఆశ్రయిస్తాం అంతే కాని కుళ్ళు కధలు కోసమో, అక్రమ సంబందాల కధలు కోసం కాదు కదా. మంచి కధలు లెక పోగా మానవతా విలువలు లోపించిన కధలే ఈ సీరియల్స్. వీటి గురించి నేను చెప్పేకన్నా ఇది వరలో చాలా మంది తెలుగు బ్లాగర్లు చాలా వివరంగా వ్రాసారు. వారి వివరణల ముందు నెను ఎంత? మచ్చుకు ఒకటి, రెండు, మూడు, ఎన్నో మరెన్నో..
ఈ సీరియల్ మొదలైన కొత్తల్లో అనుకుంటా.. నా సాశనాన్ని ధిక్కరించె విధంగా ఉంది అంటూ నా శ్రీమతీ అనే సరికి ఈ ఒక్క సీరియల్ కు సడలింపు ఇవ్వడం జరిగింది. అలాగే.. మొదట్లో.. ఈ సీరియల్ మొత్తం హాస్యాస్పదం గానే ఉండేది అని ఒకరిద్దరు చెప్పపట్టి నేను అంతగా పట్టీంచు కోలేదు. అందువల్ల ఈ సీరియల్ వచ్చే వేళ్ళల్లో నన్ను పట్టించు కోదు అన్న విషయం నాకు ఈ సంఘటన ద్వారా అర్దం అయ్యింది. సరే అడ్డంగా దొరికి పోయాకదా అని చూస్తూండగా ఓ ఆలోచన నా మదిలో తళ్ళుక్కున మెరిశింది. అది ఏమిటంటే, ఎంత సేపు సీరియల్ వేస్తాడు? ఎంత సేపు ప్రకటనలు వేస్తాడు? వాటిల్ని పక్కా లెక్కల ప్రకారం నోట్ చేద్దాం అనిపించింది. అన్నదే తడవుగా ఆ ప్రయత్నం మొదలు పెట్టాను.
౧) ఈ సీరియల్ మొదలైయ్యే ముందు అచ్చంగా మూడు నిమిషాల సేపు ప్రకటనలు (3 Min) = Total 3 Mins
౨) తరువాత పాత ఎపిసోడ్ నుంచి ఒక నిమిషం పాత పాట
౩) రెండున్నర నిమిషాల పాటు ప్రస్తుత కధ
౪) వెంటనే ప్రకటనలు. అంటే మూడున్నర నిమిషాల నిడివికి అంతరాయం (1 + 2.5 = 3.5 Min) = Total 6.5 Mins
౫) ముప్పై సెకల్న నిడివిలో రాబోయ్యే సీన్ల గురించి (30 Sec Coming) = Total 7 Mins
౬) నిమిషం నిడివితో నాలుగు ప్రకటనలు. అంటే నాలుగున్నర నిమిషాల విరామం ( 1Min X 4 = 4 Mins) = Total 11 Mins
౭) మళ్ళీ ఓ ఐదు నిమిషాలసేపు కధ సాగ దీయ్యడం (5 Mins) = Total 16 Mins
౮) ముప్పై సెకల్న నిడివిలో రాబోయ్యే సీన్ల గురించి (30 Sec Coming) = Total 16.5 Mins
౯) ఒక నిమిషం నిడివిలో ఒక వ్యాపార ప్రకటన (1 Min)= Total 17.5 Mins
౧౦) మూడు సెకల్న నిదివిలో రాజకీయ ప్రకటన (3 Min)= Total 20.5 Mins
౧౧) మళ్ళీ ఓ నాలుగు నిమిషాలసేపు కధ సాగ దీయ్యడం (4 Mins) = Total 24.5 Mins
౧౨) ముప్పై సెకల్న నిడివిలో రాబోయ్యే సీన్ల గురించి (30 Sec Coming)= Total 25 Mins
౧౩) నిమిషం నిడివితో మూడు ప్రకటనలు. అంటే నాలుగున్నర నిమిషాల విరామం ( 1Min X 3 = 3 Mins) = Total 28 Mins
౧౪) మళ్ళీ ఓ నిమిషం సేపు కధ సాగ దీయ్యడం (1 Min) = Total 29 Mins
౧౫) ముగింపు .. పేర్లు .. ఓ నిమిషం (1 Min) = Total 30 Mins
ఆఖరుగా తేలినది ఏమిటంటే, అస్సలు కధేమో పన్నేండు నిమిషాల ముప్పై సెకల్ను (12 Min 30 Sec) నడిస్తే, ప్రకటనలు అచ్చంగా పద్నాలుగు నిమిషాలపాటు(14 Min) అత్యధికంగా పాలు పంచుకుంటే అనవసరంగా మూడున్నర నిమిషాలు(3 Min 30 Sec) వృధా చేసారు. ఈ గణాంకాలను ఒక గ్రాఫ్ గా చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది.
కానీ ముగించే ముందు ఒక్క మాట, ఈ సీరియల్ మొదట్లో హాస్యాస్పదంగా సాగినా, ప్రస్తుతం మాత్రం మరే ఇతర పనికిరాని సెంటిమెంటు సీరియల్స్ లాగానే ఇది కూడా రూపాంతరం చెందుతోందని నా అభిప్రాయం.కధ అంటూ ఏమీ లేక పోవడం వల్ల, ఎలా సాగదీయ్యాలా అని తాపత్రయ పడుతున్నట్లు నాకు అనిపిస్తోంది.ఎందుకైనా మంచిది మీరు మాత్రం దీని నుంచి దూరంగా ఉండగలరు.
Some touchy SMSs
ఈ మధ్య ఎందుకో SMSల గురించి వ్రాయాలనిపిస్తోంది. అలాగే కొన్నింటిని తీసేయ్య లేక ఇలా మీముందు.
**********************************
Under they SKY it is so Blue..
We met some people so True..
Now the world seems very New..
Some people are very special, among a few
You are one in those Few..
**********************************
Friendship is like a relation between hand and eyes…
When hand gets hurt.. eyes cries..
When eyes cries the hand wipes..
**********************************
The best and most of the beautiful things in this world are always can’t be seen nor touched .. but .. they are ..
.
.
.
.
felt in heart
**********************************
To Love with out condition..
To talk with out hesitation..
To give with out expectation..
To care with out intention..
is the heart of true relation
**********************************
The world doesn’t need more starts to shine..
More seas to cross..
More mountains to climb..
But, what it need is more of you and your smile..
Keep living, loving and smiling ..
**********************************
S_nrise
B_tterfly
Pict_re
L_nch
B_sstand
M_sic
Do _ find some thing is missing..
i think i’m missing U
**********************************
We make them cry, who care for us..
We cry for those who never care for us..
And we care for those who will never cry for us..
And the truth of Devdas is the same
**********************************
సూర్యుడు ఉదయించనిదే, రోజు మారదు..
కానీ సూరీడు దరి చేరగలమా..
చంద్రుని చల్లదనం లేనిదే, మనసుకి విస్రాంతి లేదు,
కానీ చంద్రుని అందుకోగలమా..
అలాగే, ఈ ప్రకృతిలో అందని అందాలెన్నో..
అందులో నీ ప్రేమ ఒకటి.
ప్రకృతిలో ఉన్న అందాలన్నీ సొంతం కావు,
కానీ వాటి ఉనికి మాత్రం అందరికీ అవసరం
**********************************
వసంతంలో కోయిలవై..
గ్రీష్మంలో ఉషోదయ కిరణానివై..
వర్షంలో అందమైన చినుకువై..
హేమంతంలో చలివై..
మేలుకో మేలుకో.. మిత్రమా.. ఉదయమైంది.. శుభోదయం
**********************************
(~_~) smiling,
(!.!) Crying,
(‘;’)Angry,
(‘:’) Bored,
(‘-‘) Proud,
(‘o’) Hungry,
(‘=’) Happy,
(‘?’) Confused,
(-.-) Sleepy,
What ever be your feeling, my message will always be coming.. Happy day ahead
**********************************
This friend..
Never likes to miss you ..
Always needs you..
Worries about you..
Lonely without you..
Always there for you..
SMSs most of the time as Good morning
**********************************
A lovely thought:”Being happy doesn’t mean Everything is perfect.. it just mean that you have decided to see every thing beyond the imperfections..” as you are seeing this SMS
**********************************
You may not miss me..
You may ignore me..
You may even forget me..
But one day when you want to see me,
Don’t search .. just see your shadow..
I’ll be there .. Trust ME..
**********************************
I don’t expect to be the most important person in your life..
But i would be happy whenever you hear my name and at least you would smile and say .. ‘Hey, that’s my friend..’
**********************************
నీ కళ్ళల్లో కాంతికి..
నీ పెదాల్లో చిరునవ్వుకి..
నీ చూపులో తేజస్సుకి..
నీ మాటలో మాధుర్యానికి..
నీ ఫోన్లో నుంచి వచ్చే SMSకై..
నా మనసు ఆరాట పడుతోంది..
**********************************
పద్దతీ పాడు లేని జీవనం
మరో ఉదాహరణ. ఇది కొంచం పచ్చిగా ఉండవచ్చు. కానీ చదువరుల విచక్షణా ఙానానికి వదిలేస్తాను. వారు ఏది చెప్పినా తప్పులేదు. ఎందుకంటే వారి వారి అభిప్రాయాలు వారి వారి స్తితి గతుల నుంచి ఉద్వవించినవి కనుక.
ఆరోజు కొంచం తొందరగానే నిద్ర లేచాను.. అందువల్ల రోజూ జరిగే పనులన్నీ అనుకున్న సమయాని కన్నా కొంచం ముందుగానే జరిగి పోయాయి. అలాగే బస్ స్టాప్ కి కూడా ఓ పావు గంట తొందరగా చేరుకున్నాను. మా కార్యాలయానికి వెళ్ళే బస్సు ఎనిమిది గంటల ముప్పై అయిదు నిమిషాలకి వస్తుంది. ఓ పావు గంట ముందుగానే వచ్చాం కదా .. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా.. మైలున్నర దూరంలో ఉన్న కార్యాలయానికి నడిచి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. సరిలే.. నడిస్తే ఆరోగ్యానికి మంచిదే కదా అనుకుంటూ.. చెవులకు హెడ్ సెట్ తగిలించుకుని.. సంగీతాన్ని మంద్ర స్తాయిలో ఉంచి నడక మొదలు పెట్టాను. మామూలుగా బస్సులో వెళితే, ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ మూలంగా ప్రతి రోజూ పదిహేడు నిమిషాలు అవుతుంది. ఆరోజు నడుచుకుంటూ వస్తే, ఇరవై ఏడు నిమిషాలైంది. అలాగే ఒళ్ళు కూడా కాస్త అలిసింది. దాని వల్ల ఉదయం త్రాగిన బోర్నవీటా పాలు కాస్తా కరిగి చమట రూపంలో విసర్జించ బడినది.
కార్యాలయానికి చేరుకునేటప్పటికి దాదాపుగా తొమ్మిది కావచ్చింది. అలసి ఉన్నానేమో లేక ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల కాసిని నీళ్ళు పట్టించేసాను. రోజూ మామూలుగా త్రాగే రెండు లీటర్ల నీటికి తోడు మరో ముప్పావు లీటరు నీరు శరీరం లోకి అదనంగా చేరుకుంది. అంతే.. పది గంటలకు అటూ ఇటూగా మూత్ర విసర్జన చేయ్యవలసి వచ్చింది. సరే .. దానిదేముంది.. ఆఫీసే కదా, ఎన్ని సార్లు పోతే ఎవ్వడైనా లెక్క పెడతాడా ఎవ్వడేమంటాడులే అని మెల్లగా మూత్రసాల వైపు అడుగులేసా. జనరల్ గా అన్ని ప్రదేశాలు క్లోజ్‍డ్ గా ఉంటాయి.
మా మూత్రసాల దాదాపుగా వెయ్యిగజాల వైశాల్యంలో కట్టి ఉంటారు. కాబట్టి మనకు మూత్రసాల నుంచి ఎటువంటి దుర్ఘందం రాదు అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిన నాకు ఒక్క సారిగా అపాన వాయువు ముక్కు పుటాల్ని తాకింది. అనుకోని ఆ వాసన నన్ను ఒక్కసారిగా మతి పోగొట్టేంత పని చేసింది. అదేదో సినిమాలో హీరోగారు రౌడీని గట్టిగా పీకి, "ఎవ్వడు కొడితే {మధ్యలో మిస్సయింది}, వాడే పండుగాడు.." అంటాడు. అప్పుడు ఆ రౌడీకి ఎదో అయిన్నట్లు అయింది నా పరిస్తితి. ఒక్క సారి బుర్ర పని చెయ్యడం మానేసింది. దిమ్మ తిరిగి ఒక్క సారిగా తూలి పడబోయి ప్రక్కనే ఉన్న గోడని ఆనుకుని నిలదొక్కుకున్నా. ఇంత గందర గోళంలో ఎలాగోలా వచ్చిన పని కానిచ్చి, హమ్మయ్య .. అనుకుంటూ బయట పడ్డాను. మరో అరగంటలో మరొసారి మూత్రసాలను దర్సించ వలసిన అవసరం వచ్చింది.
ఈ సారి ముందు జరిగిన అనుభవాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ, ముక్కుకి గుడ్డ కట్టుకుని మెల్లగా అందులోకి ప్రవేశించాను. ముక్కుకి ఉన్న గుడ్డ మూలంగానో .. ఏమో.. ఈసారి అంత ఘాటుగా అపాన వాయువు తగల లేదు. నేను ఉన్నానని మాత్రం తెలుస్తూనే ఉంది. కాకపోతే ఈసారి అనుభవం ఈ పుటకు మూలం. వెయ్యిగజాల స్థలంలో నిర్మించిన మూత్రసాల ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అందులో దాదాపుగా ఓ ఇరవైఐదు మల విసర్జన ప్రదేశాలు నిర్మించి ఉంటారు. వాటన్నింటికీ ప్రక్కగా మూత్ర విసర్జన చేసే అవకాశం కలిపించారు. అదిగో అప్పుడు మరో అనుభవం. ఒక్కొక్క మల విసర్జనా చోటునుంచి, అపాన వాయువు వదిలేటప్పుడు వచ్చే శబ్ధాలు, ఈసారు చెవులకు ఉన్న తుప్పు వదిలించాయి. ఒక్కొక్కడూ మరొకడిని మించి పిత్తుతున్నారు. నేను గట్టిగా శబ్దం చేసానంటే, నేను చేసానంటూ పోటీ పడి మరీ చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే.. క్షమించాలి .. వింటూంటే.. పిత్తుల పోటీ కనుక పెడితే, వీళ్ళని మించిన వాడు ఎవ్వడూ లేడనిపిస్తుంది. ఇక లాభం లేదని పరుగు పరుగున బయటకు చేరుకున్నా.
మూత్రసాలలో కొంచం రూమ్ ఫ్రష్‍నర్ కొడతారేమో అని అడగడానికి తలచి, భవన సముదాయం మైన్‍టైన్ చేసే వారి వద్దకు వెళ్ళి అసలు విషయం చెప్పకుండా, ’ మూత్రసాలలో కొంచం రూమ్ ఫ్రష్‍నర్ కొట్టండి ..’ అన్నా. పదకొండున్నరకు ఎగ్జాస్ట్ వేస్తాము అంతవరకూ ఇంతే, తరువాత పన్నెండు గంటలకు, మొదటిసారి రూమ్ ఫ్రష్‍నర్ కొడతాం, రెండవ విడతగా నాలుగు గంటలకు, మలి విడతగా రాత్రి తొమ్మిది గంటలకు కొడతాం, తప్పితే, మధ్యలో కొట్టం అని కరా ఖండీగా చెప్పెసారు. ఇదంతా మాకు మామూలే. ఇది ప్రతి రోజూ ఉండే ప్రవసనమే అని వాళంటూటే, "ఏడిసారు, చచ్చినోళ్ళు..", అనుకుంటూ మెల్లిగా నా సీటుకు చేరుకున్నాను. అదే మేమైతేనా... అంటే నా ఉద్దేశ్యంలో మా ఇంట్లో పెరిగిన వాళైతేనా అని. ఉదయానే నిద్ర లేవంగానే, పళ్ళుతోమావా.. దొడ్డికెళ్ళావా.. స్నానం చేసావా.. అంటూ కాలకృత్యాలు అన్నీ ఆయేంత వరకూ వదిలేవారు కాదు. మల విసర్జన రోజులో ఉదయం వేళ్ళల్లో తప్పితే మరి ఇంకొక సారి చేసే వాళ్ళం కాదు. అంటే అంతగా తినే వాళ్ళం కాదు, అలాగే అన్ని సార్లు వెళ్ళవలసిన అవసరం వచ్చేదీ కాదు అని అర్దం. ఒక వేళ్ళ వెళ్ళవలసి వచ్చినా, ఎదో శరీరంలో సుశ్తి చేసో లేక ఆరోగ్య పరిస్థితి మారో లెక జీర్ణావస్థ సరిగా పని చెయ్యక విరోచనాలు ఆయ్యెవే కానీ ఇలా వేళకాని వేళ్ళల్లో చోటు కాని చోట్లలో వెళ్ళే అలవాటు కాలేదు. వీళ్ళకేమో ఎక్కడ పడితే అక్కడ .. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా.. ఏమి పద్దతో!! ఏమిటో!! మాయాలోకం..
ఇది జరిగిన తరువాత కొంత కాలానికి, సహోద్యోగులతో కలసి మందు కొట్టడానికి బారు కెళ్ళాం. అప్పుడు ఈ ప్రస్థావన వచ్చింది. నా అభిప్రాయం తెలియ జేసాను. వాళ్ళలో తెలియని స్పందన కొట్టొచ్చి నట్లుగా కనబడింది. మెల్లగా ఒక్కడొక్కడూ బయట పడడం మొదలు పెటాడు.
ఒకడంటాడు, సింహాలు పులులు ఉదయానే బహిర్బూమికి వెళతాయా!!
మరొకడు, ఏం.. ఇంట్లోనే వెళ్ళాలా.. బయట వెళ్ళకూడదా!!
ఇంకొడు.. అదేం లెక్క.. ఎప్పుడూ ఉదయానే వెళ్ళాలా.. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదా!!
వీళ్ళతో వాదించడం కాలాయాపన అలాగే సుద్ద వేస్టు అనుకుని, మా సంభాషణని మెల్లిగా మరో అంశంలోకి మార్చేసాను. కానీ నా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
పులులు సింహాలు ఎక్కడ పడితే అక్కడ బహిర్బూమికి వెళతాయి, మరి తమరెందుకు మూత్రసాలకే వచ్చి వెళుతున్నారు అని మొదటి వాడిని ప్రశ్నించాననుకోండి వాడేమి చెబుతాడో..
ఇంట్లోనూ.. బయట .. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు. తప్పులేదు, కానీ కార్యాలయంలో మూత్ర సాల కట్టింది అనుకోని సమయంలో ఎప్పుడైనా యాదృశ్చికంగా వెళ్ళవలసి వస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా అనేది యాజమాన్యం అభిప్రాయం. అంతే కానీ ఉద్యోగులంతా ఇళ్ళలో వెళ్ళకుండా ఇక్కడే వెళతారనేది కాదు కదా.
ఇక ఆఖరివాడి విషయానికి వస్తే.. జీవితం అన్న తరువాత ఒక పద్దతీ పాడూ అనేవి ఉంటాయి. ఎక్కడ చెయ్యాల్సిన పనులు అక్కడే చెయ్యాలి. సరసాన్ని నాలుగు గోడల మధ్యే చెయ్యాలి అనేది సమంజసం. కానీ కుక్కల్లాగా మనుషులు కూడా రోడ్డు మీదే శృంగారం సాగించి, తప్పు లేదు అని సమర్ధించుకునే సమాజంలో బ్రతుకుతున్న వీళ్ళకి ఏది ఎక్కడ చెయ్యాలో ఎవ్వరు చెబుతారో.
ఏమిటీ ఈ తరహా వర్క్ సంస్కృతి
నేను ఈ మధ్య వృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను కదా.. కొన్ని కొన్ని విషయాలు అసహ్యాన్ని కంపరాన్ని కలిగిస్తున్నాయి. వాటిల్లో ఇవిగో కొన్ని.
శుచి సుబ్రం - భారత దేశంలో మాకు నేరిన అలవాటు
ఉదయానే లేవంగానే పళ్ళు తోముకోవడం అలవాటు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే.. దాదాపుగా చిన్నప్పటి నుంచి పళ్ళు తోము కోందే మాట్లాడ వద్దేనేవారు. ఉదయానే పళ్ళు తోము కోవడం .. కళ్ళల్లో పుసులు తీసు కోవడం .. నాలుక గీకడం వంటివి .. ఎప్పుడైనా మర్చి పోయ్యాము అనుకోండి, పోలీస్ కుక్క వాసన పసిగట్టినట్లు ఎవరో ఒకరు పసిగట్టేశే వారు. అంతే, ఓ పది నిమిషాలు ఏక బీకిన తిట్లు చీవాట్ల దండకం. వాళ్ళ దండకం పడలేక చట్టుక్కున బాత్ రూమ్ లోకి దూరేశి ఓ పది నిమిషాలు బ్రష్ తో కుస్తీ పడి, అంతా అయ్యింన తరువాత తిట్టిన వాళ్ళ దగ్గర కెళ్ళి .. ఈ.. అంటూ పళ్ళన్నీ కనబడేటట్టు చూపించేత వరకూ వదిలే వారు కాదు.
ఇలా అలవాటై .. ఇక్కడికి వచ్చాక.. ఇక్కడ నాతో పని చేసే వాళ్ళ ప్రవర్తన చూసాక. మన సాంప్రదాయమే వీరి కన్నా కోటి రెట్లు మెరుగు అనిపిస్తోంది.
శుచి సుబ్రం - అమెరికాలో నేను గమనించిన అలవాటు
పనిలో తీవ్రంగా మునిగి ఉండగా ఏదో దుర్గంధం ముక్కు పుటాలకు తాకింది. ఏమిటా అని ఒక తల పక్కకు త్రిప్పితే, నాతో పనిచేసే సహ ఉద్యోగి. ఏదో పని పడింది. అడగడానికి వచ్చాడు. వాడు నోరు తెరిచినప్పుడల్లా దుర్ఘంధం ముక్కు పుటాల్ని చీల్చి చెండాడుతోంది. చికాకుగానే సమాధానమిచ్చి, వాడితో వేగే ఓపిక లేక, ఏవైనా సంధేహాలుంటే మెయిల్ చెయ్యమన్నాను. అదికాదూ .. అంటూ ఏదో చెప్పబోయాడు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో చూడలేదు, మరో అమెరికన్. వీడు వాడు కలిసి మెల్లిగా జారుకున్నారు. కడుపులో దేవుతూ ఉన్నట్లు ఉన్నందు వల్ల మెల్లిగా రెస్టు రూమ్.. అదేనండీ .. టాయిలెట్.. వైపు వడి వడిగా .. (ఇందులో మొహమాట పడవలసినది ఏమీ లేదు..) పరిగెత్తా.. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది. ఇందాకటి ఇద్దరూ అక్కడ తీరికగా నించొని పళ్ళు తోముకుంటున్నారు.
ఇంతకీ విషయమేమిటంటే.. వీళ్ళు రాత్రి పీకలదాకా బాగా తాగి తెల్లారిదాకా చిందులేసి.. ఉదయాన ఇంటికెళ్ళి ఓ రెండు గంటలు నిద్రపోయి.. పక్క మంచం మీదనుంచి నేరుగా ఆఫీస్ చేరుకున్నారన్న మాట. ఇదిగో ఇక్కడి కొచ్చి దంత ధావనం చేస్తున్నారన్న మాట
పెద్దలే ఇలా ఉంటే, ఇక పిల్లల్లు ఏ విధంగా తయారవుతారు?
మరో చికాకు విషయంతో మరలా మీ ముందుంటా..
కృతఙ్ఞత తెలియ జేసే విధానం
ఈ పుట వ్రాసేముందుగా, ఒక విషయం. నేను ప్రస్తుతం, అంటే ఈ పుట ప్రచురించే సమయానికి అమెరికాలో ఉన్నాను. ఖఛితంగా చెప్పాలంటే, అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని ఔస్టిన్ అనే నగరంలో ఉన్నాను. ఇక్కడ అన్ని విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ కొన్నిపద్దతులు మెచ్చుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి.
ఇదిగో ఈ ప్రక్కన కనబడుతోందే అదే మా కార్యాలయం. నేను దీనిలోని తొమ్మిదవ అంతస్తులో కూర్చుంటాను.
ఇంతకీ ఈ పుట అస్సలు విషయనికి వద్దాం. ఈ భవంతి స్వంత దారుడు, ఇక్కడ అద్దెకు ఇచ్చిన అన్ని కార్యాలయాల ఉద్యోగులకు కృతఙ్ఞతా భావంతో ఈ రోజు అందరికీ ఐస్ క్రీమ్ పంచి పెట్టాడు. ఇదేదో వింతగా ఉంది కదూ.. నాకు మాత్రం వింతగానే ఉంది. భవనం స్వంతదారుడేమిటి.. అద్దెకు ఇచ్చిన స్థలంలో ఉన్న సంస్థలలో పనిచేసే ఉద్యోగులేమిటి!!! వీళ్ళకీ భవన సొంతదారునికి ఎక్కడైనా సంభందం ఉందా అంటే.. లేదనే చెప్పాలి. కానీ ఆశ్చర్యపరచే విషమేమిటంటే.. ఈ భవనంలో పని చేసే ప్రతి ఉద్యోగికీ ఈరోజు ఉచితంగా ఐస్ క్రీమ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ సంస్థలో పని చేస్తున్నాం అనే దానికన్నా, ఏ భవంతిలో పనిచేస్తున్నాం అనేదే, ముఖ్యం. of course, you have to work from this building, irrespective of company you work.
ఓవ్ .. ఓవ్.. ఆంగ్లం పోంగి పొర్లుతోంది.. ఓ.. ఓ..
ఇంతకీ ఈ ఐస్ క్రీమ్ ఎలా పంచారంటే.. ఇదిగో ప్రక్కన చూపించినట్లుగా ప్రతి వ్యక్తికీ ఒక టోకెన్ ఇస్తారు. అదికూడా, ఆ యా కంపెనీల ప్రతినిధులు వారి వారికార్యాలయం లలో వారి వారి పద్దతులలో పంచుతారు.
నేను పనిచేసే సంస్థ వాళ్ళు ఈ కూపన్ల పంపక వ్యవహారం మా రిసెపషనిస్టు చేతుల్లో పెట్టారు.
ఆ అమ్మాయి ఓ విధంగా మెతక నైనది. ఈ అమ్మాయి నిమ్మది తనాన్ని అలుసు చేసుకుని, మా సహోధ్యోగులు, మనిషికి ఒకటి అంటే.. క్రింద కి వెళ్ళి తినేసి వచ్చి, మరొకటి అంటూ.. దాదాపుగా మూడు వరకూ లాగించేసారు. ఇదిగో నా వంతు గా నేనేమో "ఓరిఓ" (OREO) తీసుకున్నా. స్వతహాగా నేను ఐస్ క్రీమ్ తినను, ఎందు కంటే.. ఆ మరునాడే జ్వరం వచ్చేస్తుంది. నాకు ఐస్క్ క్రీమ్ పడదు. కానీ ఇన్ని రకలు ఒక్క చోటే కనబడడం, సహ ఉధ్యోగులు తినమని ఇబ్బంది పెట్టడంతో తినక తప్పింది కాదు.
నాకు స్వతహాగా ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు, ఏం దుకంటే.. నా ఆరోగ్యం గురించి నాకన్నా బాగా ఎవ్వరికి తెలుసు గనుక.
ఇలా సంగ్ధిధావస్తలో ఉన్న నాకు సహ ఉధ్యొగి ఒకరు, అమెరికాలొ ఐస్ క్రీమ్ చేసే విధానం గురీంచి ఒక చిన్న క్లాసు పీకారు.
దాంతో ఇక ధైర్యం చెయ్యక తప్పలేదు. మెల్లిగా అడుగులో అడుగెసు కుంటూ.. ఆ బల్లల దెగ్గిరకు వెళ్ళా.. కొంచం తక్కువగా ఉన్నా.. కొంచం రంగులు రంగులు గా ఉన్న ఒక కప్పు తీసుకుని మెల్లిగ నా సీటు చేరుకున్నా.
ఇంతకీ ఐస్ క్రీమ్ పంచే చోటే చాలా మంది ఆస్వాదిస్తుంటే కొన్ని ఫొటోలు తీసాను. ఇవిగో ఈ క్రింద అవి.
తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ..
మొదటి సన్నివేశం:
సమయం: ఉదయం పది గంటలు
ప్రదేశం: ప్రబుత్వ మహిళా కాలేజి, బేగంపేట, హైదరాబాదు
పాత్రలు పాత్రధారులు : నేను మరియు ఆఫీసులకు పోయ్యే హైదరాబాదీ జనం. పైన చిత్రంలో పసుపురంగు నేను
పరిస్తితి: ట్రాఫిక్ చాలా బాగా ఉంది, ఆంగ్లంలో crawling అనే పదానికి, తెలుగులో పాకుతోంది అనే పదానికి సరిపోయే విధంగా, ఆరోడ్డుపై నిలచి ఉన్న కార్లు మెల్లగా .. అతి మెల్లగా కదులుతున్నాయి
అసలు కధ:
హీరో : ఇంకెవ్వరో కాదు నేనే
నా ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‍కి ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తుండటంతో, ఆ రోజు ఉదయానే రాహుల్ బజాజ్ సర్వోసింగ్ షోరూమ్‍లో ఇచ్చి, ఇంటికి వచ్చా. అర్దాంగి వేడి వేడిగా ఇడ్లీలు వేసి ఇస్తే.. గుటుక్కు మంటూ లాగించేస్తుండగా మెరుపులా మెదిలింది ఓ ఆలోచన. మేము ఉండేది, బ్రాహ్మణవాడ, బేగంపేట రైల్వేస్టేషన్ దగ్గర. ఆఫీసేమో జూబ్లీహిల్స్. రోజూ ఆఫీసుకు వెళ్ళాలంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గుండా U టర్న్ కొట్టి, మహిళా కళాశాల మీదుగా, లైఫ్ స్టైల్ దగ్గరి ఫ్లైఓవర్ మీదుగా సోమాజీగూడ చేరుకుంటా. ప్రతినిత్యం ద్విచక్ర వాహనం ఉండడం వలన అందునా తొందరగా బయలు దేరుతానేమో, ట్రాఫిక్ సమస్య అంతగా చికాకుగా అనిపించదు. ఆరోజు బండి లేకపోవడంతో ఆటోలో వెళదాం అనుకున్నా. కానీ పైన చెప్పినట్లు మెరుపులా ఒక ఆలోచన మదిలో మెదిలింది.
నాతో పనిచేసే మరో సహ ఉద్యోగిని సికింద్రాబాద్ నుంచి వస్తారు. ఆవిడ కారులో వస్తారు. ఎలాగో ఇటునుంచేకదా వెళ్ళేది అని తలంచి వెంటనే ఒక తంతి తగిలించా. అదేనండీ, ఫోను కొట్టా. ఎప్పుడు అడక పోవడం వల్ల, అడగంగానే ఒప్పుకున్నదామె. కాకపోతే ఒక చిన్న మెలిక పెట్టింది. ఆవిడ ఇంటి దగ్గరే కొంచం లేటుగా బయలు దేరుతాను కాబట్టి, ’నేను మహిళా కాలేజీ దగ్గరకు చేరుకునేటప్పటికి దాదాపు పావుతక్కువ పదకొండవుతుంది.. ఫరవాలేదా..’ అంది. ’ దానిదేముంది.. ఒక్క రోజు ఆఫీసుకి లేటుగా పోతే నన్నెవరూ అడగరు .. మెల్లగానే రండీ..’ అంటూ సమాధానమైతే ఇచ్చాగానీ. ఆఫీసుకి లేటుగా వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. ఎదైతే ఎంటి, ఎలాగో అడిగేశాం .. ఇక ఆవిడకోసం వెయిట్ చెయ్యకపోతే బాగుండ దనుకుని ఇంట్లోనే పది నలభై వరకూ కాలక్షేమం చేసా.
ఇక చాల్లే అనుకుని మెల్లగా స్కూల్ బ్యాగ్ భుజానేసుకుని.. అదేనండీ ల్యాప్ టాప్.. మెల్లగా మైన్ రోడ్డుకి చేరుకున్నా. ఇదిగో ఇక్కడ అస్సలైన కధ మొదలైంది. చూడబోతే, ట్రాఫిక్ చాల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఎదోలే అనుకుంటూ మెల్లగా ఫుట్ పాత్ మీదుగా నడుచుకుంటూ మేమిద్దరం అనుకున్న చోటుకి చేరుకున్నా. ఇదిగో ఇప్పుడు మొదలైంది అస్సలు సీను.. కష్టాల సీను. ట్రాఫిక్ బాగాఉండటం వల్ల, ద్విచక్ర వాహనాలు మెల్లగా రోడ్డు మీదనుంచి, ఫుట్ పాత్ ఎక్కుతున్నాయి. నేనేమో అక్కడే అడ్డంగా నించున్నానాయే. ఇంక చేసేదేమీ లేక వాహన చోదకులు అడగలేక మెల్లగా నా ప్రక్కనుంచి ఫుట్ పాత్ ఎక్కేస్తున్నారు. నాకేమో ఈ తతంగం అంతా చాలా చికాకుగా ఇబ్బందిగా ఉంది. ఇక లాభం లేదనుకుని. ఫుట్ పాత్‍కి అడ్డంగా నిల్చొని వచ్చే వాళ్ళందరినీ పోలీసులా గదమాయించడం మొదలుపెట్టా..
’ఏందిది.. ఇదేమన్నా రోడనుకున్నారా.. ఫుట్‍పాత్.. అటునుంచి వెళ్ళండి..’ నా స్వరంలో కోపం కొట్టొచ్చినట్లుగా అనిపించగానే..
’కొంచం తపుకో అన్నా.. ట్రాఫిక్ చూసావుగా.. ఆఫీసుకి లేటైతోందే..’ అంటున్నాడు ఓ మొటరిస్టు
’ఫుట్ పాత్‍లు ఉన్నవి.. మనుష్యులు నడవడానికి బాసూ.. బండ్లు నడపడానికి కాదు .. అర్ద మైందా..’ అంటూ.. ’పోలీసోళ్ళు ఇక్కడ నిలబడి, ఫుట్‍పాత్‍లు ఎక్కి నడిపించే వీళ్ళందరికీ ఫైన్ వెయ్యచ్చు కదా..’ అని మనసులో అనుకుంటూ ఉండగానే .. జూయ్యి మంటూ మరో మోటరిస్టు అమాంతం వచ్చి గుద్దినంత పని చేసాడు..
’ఏం బాసూ కనబడటంలే.. అలా అడ్డం నిలబడక పోతే తప్పుకోవచ్చుగా ..’ డబాయిస్తున్నాడు. ’ఎదో పెద్ద ఈ ఫుట్ పాత్‍లన్నీ వీళ్ళే కట్టించినట్లు.. చూడండి ఎలా అడ్డం నుంచున్నాడో..’ ప్రక్కనున్న మరో మొటరిస్టుతో అనగానే..
అప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా ఒక్క దూటున నా మీద విరుచు పడ్డారు. ’ఏందయ్య.. ఇందాకణ్ణించి చూస్తున్నాం .. ఎవ్వరినీ ఫుట్ పాత్ ఎక్కనివ్వటం లేదు .. ఇదేమన్నా నీ బాబు జాగీరనుకున్నావా...’ మరో గొంతుకు ..
’జరగవయ్యా.. జరగమంటూంటే వినబడటం లేదా..’ ఇంకొడడు.. ఎక్కడ లేని ఐక్యత వీళ్ళందిరిలో ఒక్క సారిగా పుంజుకుంది.
ఇలా ఒకరొకరుగా నామీద యుధానికి దిగటంతో, అలవి కాని చోట అధికుల మన రాదన్నట్లు.. ప్రక్కకి జరిగి వాహన చోదకులకు త్రోవనిచ్చా.. దొరికిందే తడవుగా, ఒకళ్ళు తరువాత మరొకళ్ళు దూసుకుంటూ ఫుట్‍పాత్ పైకి పోనిచ్చేసారు..
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
మరో పుటలో తరువాతి సన్నివేశం.. అంత వరకూ ’ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహిస్తూ ఉండకండే.. ’. ఈ పుటకి స్పందిస్తూ తరువాత situation ఎమై ఉంటుందో మీఊహకి ఎలా తోచిందో.. నేను ఈ పుటకి శీర్షికగా ’తనదాక వస్తే కానీ..’ అంటూ ఎందుకు పెట్టానో చెప్పకోండి చూద్దాం
ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన, నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా, విశ్వదాభిరామ! వినురవేమ!

