టాటా.. బైబై..
వెనకనించి కొడలుపిల్ల నవ్వుతోంది,
చూస్తా.. చూపిస్తా..
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
మదిలో ఎన్నో, ఎన్నేన్నో!! ఆలోచనలు.. ఉబుసు పోక ఇలా.. ఇక్కడ..
మనోళ్ళు, అదే.. మన క్రికెట్ టీమ్ సభ్యులు.. కష్టపడి రెండవ టెస్టుని మూడవరోజునే ముగించేశారు. నాకు టెన్షన్ తగ్గింది. నిన్నటి పుట సమర్పించే సమయానికి మనోళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఆ తరువాత నాకు మొదలయ్యింది అస్సలు .. టెన్షన్.. ఎందుకంటే.. నిన్నటి పుటలో నేను, "౩ వరోజునే ఫలితం వెలువడుతుంది.." అని వ్రాసిన తరువాత, మన పాత కెప్టెన్, అదే.. గంగూలి కొంచం బాగా ఆడుతూ ఎదో కనీస ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ప్రక్కన మనోళ్ళు, ఎదో ముసలికన్నీరు మాదిరిగా పోరాటపఠిమతో, సౌత్‍ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కుంటున్నారని ఆనందం.. మరోప్రక్క వీళ్ళు ఈరోజు చివరిదాకా ఆడతారా అన్న అనుమానం..
అన్నింటికి ఒక ముగింపు అన్నట్లుగా ఒకే చరమగీతం పాడేసారు మన టైలేండర్స్.. ఏంచేస్తాం.. ఒక సగటు క్రీఢాభిమానిగా చింతిస్తూ.. ఓ సగటు రాజకీయ వాదిలాగా.. ఖండిస్తున్నాను..
ఏమిటి .. శౌత్‍ఆఫ్రికాతో రెండవ టెస్టు జరుగుతూ ఉంటే, ఆస్ట్రేలియా అని ఇక్కడ mention చేసాననుకుంటున్నారా??? నిన్న, మొన్నా జరిగిన మరియు ఇవాళ జరిగుతున్న ఆట తీరు చూస్తే, మనోళ్ళు ఆస్ట్రేలియాలో పడ్డ కష్టాలు గురుకు వస్తున్నాయి. ఏమంటారు?
ఏమిటిది??? సెహ్వాగ్, గౌతమ్‍గంభీర్, రాహుల్ ద్రావిడ్ వంటి మహామహులు తక్కువ స్కోరుకి ఇంటిముఖం పట్టడమేమిటి?? ఎదో పెద్ద పొడిచేస్తాడనుకుని తీసుకొచ్చిన వాసిమ్‍జాఫర్ కాస్తా ౯ (9) & ౧౯(19) పరుగులకు అవుటవడమేమిటి??? ఏంజరుగుతోదిక్కడ.. నాకు తెలియల్సిందే?? మెదటి టెస్టు జరిగిన మైదానము ఆటకు అనుకూలించింది, ప్రస్తుత మైదానంలో ఫలితం తేలదు అని వార్తాపత్రికలు గోడెక్కి కోడై కూసారు .. వ్రాసారు.. కానీ మూడోరోజునే ఈ టెస్టు ఒ కొలొక్కి వచ్చేటట్టుంది.
ఇదంతా, మన బ్యాటింగ్ వైఫల్యమా.. లేక శౌత్‍ఆఫ్రికా బౌలర్ల సాఫల్యమా?? కాలం మనకు ప్రతికూలిస్తోందా.. లేక శౌత్‍ఆఫ్రికకు అను(సా)కూలిస్తోందా?? ఈ వైఫల్యాన్ని, మనం కాలం మీద అభాండంగా అనుకుందామా.. లేక తయరు చేసిన మైదానం మీద కి ఈ అభాండం తోసెద్దామా?? ఎదో తెలుగు సామెత చెప్పినట్లు, "చేత కాక మద్దెల ఓడు అన్నాడట వెనకటికి నాలాంటి వాడొకడు..", అన్నట్లు.. మనోళ్ళలో చావ తగ్గినట్లా?? లేక మనోళ్ళ నిర్లక్ష వైఖరికి ఈ టెస్టు ఒక నిదర్సనంగా మున్ముందు మిగిలిపోతుంది.
మనవాళ్ళ ఆట తీరు మీద మీ అభిప్రాయమేమిటి??
ఇవ్వాళ కార్యాలయం (ఆఫీస్) లో నేను చెయ్యాల్సిన పని ఏమత్రం ముందుకు సాగనప్పుడు, ఆటవిడుపుగా ఉంటుందని చేసిన పనులు వాటి వివరాలు ఈ క్రింది విధంగా..
౧) వరూధిని గారి బ్లాగ్ లోని "స్కూటీ నేర్పగలవా.." కు నా అభిప్రాయాన్నితెలియజేయడం
౨) శ్రీవిద్య గారి బ్లాగ్ లోని, "మనిషి గెలవాలంటే మనసు ఓడిపోవాలా..? (నేనొప్పుకోను)" అన్నపుటకి విహారి ఇచ్చిన అభిప్రాన్ని వ్యతిరేకించడం
౩) ఉమామహేస్వరరావు ని చూసి, వాత పెట్టుకుని, ఒక "వ్యక్తిత్వ పరీక్ష"కు హాజరు అయ్యి, దాని ద్వారా తెలిసిన విషయాలను నా వెరే బ్లాగులో భద్రపరిచాను
౪) ఈ బ్లాగు తోలు (skin) ఒలొచి.. వేరేది ఏదైనా వెద్దామని చేసిన ప్రయత్నంలో ప్రస్తుత తోలు నచ్చడంతో ఇలా మార్చేసాను
౫) నాబ్లాగుని ఎంత మంది, ఎన్ని సార్లు చూస్తారో అన్న కుతూహలంతో.. ఒక కొలతల సంఖ్యామాన కొలబద్దను తగిలించాను.
౬) ఇంకా ఏమి చెయ్యాలోతెలియక ఇదిగో ఇలా..
ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయమాసన్నమయినది.. ఇంతే సంగతులు.. ఇట్లు.. ఓ సగటు సాఫ్ట్‍వేర్ ఇంజినీరు..
హయ్యోరామా.. ఇంకొక విషయం మర్చిపోయాను.. Disclaimer.. కూడా కొత్తగా చేర్చాను. మీఅభిప్రాయములను తెలియజేయడం మరచిపోకుండి.
ఆహారపు అలవాట్ల గురించి మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు.. పెద్దలే కాకుండా మనం కొన్ని అలవాట్లు వార్తల ద్వారానో.. స్నెహితుల ద్వారానో.. అనుభవాల ద్వారానో.. పరిచయస్తుల సలహాల ద్వారానో .. ఇలా ఎన్నో ఎన్నో మార్గాలలో నేను తెలుసుకున్న .. నాకు మంచిది అనిపించిన పద్దతి మీతో.. ఇలా.. ఇక్కడ..
ఆహారాన్ని మనం ప్రధానంగా ౩ లెదా ౪ (4) సార్లుగా తీసుకుంటాము .. ముఖ్యంగా.. ఉదయం, మధ్య్హాన్నం, సాయంత్రం మరియు రాత్రి వేళలలో.. అదియున్నూ ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లను బట్టి ఆ ఆ వేళలు మారతాయి. నావరకూ నేను ౪ (4) సార్లు భుజించటానికి ప్రయత్నిస్తూ ఉంటాను..
ప్రధానంగా .. అల్పాహారం .. ఎదో సామెత చెప్పినట్లు.. ఉదయం భోగి లాగా .. చాలా దండిగా, కళ్ళకు నిండుగా .. పుష్టిగా లాగించేస్తూ ఉంటాను. ఇక మధ్హ్యాన్న విషయానికి వస్తే .. యోగిలాగా .. కొంచం తక్కువగా, ముఖ్యంగా.. కాయ గూరలతో వండిన కూర, పులుసు వంటివాటితో లాగించేస్తూ పెరుగన్నంతో ముగిస్తాను.
ఇదయిన తరువాత, స్నేహితులు.. సహ ఉద్యోగులు.. పని ఒత్తిడి .. ఎలాగో ఒకలాగా .. ఎదో ఒక కారణంగా ... కాఫీ / టీ వంటి పదార్దాలు వెళుతూనే ఉంటాయి .. ఇలా సాయంకాలమయ్యేటప్పటికి, ఆఫీస్ వాళ్ళు కాస్తా, ఉద్యోగులకోసం అల్పాహారం తెప్పిస్తారనుకోండి.. ఎదో కొంచం పంటి కిందకి తోసేసి, మెల్లగా ఇంటి ముఖం పట్టి, మన హైదరాబాదు ట్రాఫిక్ అనే పద్మవ్యూహాన్ని ఛేధించుకుని ఇంటికి చేరుకునేటప్పటికి తల ప్రాణం తోకలోకి .. క్షమించాలి, మనకి తోకలు ఉండవు కదా.. మరేమని ఇక్కడ ఉపయోగిస్తే బాగుంటుందబ్బా..??!! ఎదోఒకటి.. తల ప్రాణం కాస్తా, పాదాల్లోకి చేరుకుంటుంది. అప్పుడు చక్కగా కాళ్ళు జాపుకుని .. రాత్రి వేళ ఒక రోగి తిన్నట్లు, ఎదో కొంచం లాగించేసి, మజ్జిగ తాగి కసేపు వార్తలు ఆ ఛానల్ .. ఈ ఛానల్ .. ఛానల్స్ అన్నీ ఒకసారి చుట్టేసి, ౧౦:౩౦ (10:30) కి కొంచం అటు ఇటుగా పక్కమీదకి చేరుకుంటాను..
క్లుప్తంగా ౩ ముక్కలో
౧) ఉదయం - భోగి లాగా తినాలి
౨) మద్యలో - యోగి లాగా
౩) రాత్రి వేళ - రోగి లాగా తినడం మనకే మంచిదని నాఅభిప్రాయం.
మరి మీరేమంటారు?
అఖరుగా ఒక ఆంగ్ల సామెత -- During breakfast Eat like KING, while at lunch Eat with Middle class people. Sleep after having the dinner such as any poor man.