వ్యాపార సలహా : NHPC పడిపోతోంది

 

ఈ మధ్యనే వచ్చిన కొన్ని IPOలలో చాలా తక్కువకు లిస్ట్ అయిన స్క్రిప్ట్ ఇది. పబ్లిక్ ఆఫర్ క్రింద ఈ స్క్రిప్ట్ విలువను 36/- రూపాయలుగా నిర్ణయించి ఇష్యూ చేసారు. ఆ తరువాత దీని విలువ 39/- రూపాయలు దాకా వెళి ఆ తరువాత క్షీణించ సాగింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మఱో ఉత్తర్వుని కూడా జారీ చేసింది. ఏమిటంటారా.. ఈ షేర్ నందు పెట్టుబడి పెట్టే వంతు శాతంలో పబ్లిక్ వాటాని మఱో పది శాతం పెంచుకునే హక్కుని ఈ యాజమాన్యానికి ఇచ్చింది. ఇదిగో అప్పుడు మొదలైంది అస్సలైన కధ.

ఎప్పుడైతే కొనుగోలు మొదలైందో అమ్మకాలు జోరుగా సాగడం, ఆ తరువాత హెచ్చు తగ్గులౌతూ ఇప్పుడు అతి తక్కువలో వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. ఈ పుట వ్రాసే నాటికి ఈ షేర్ ధర 30.10/- వద్ద ట్రేడ్ అవుతోంది. ఎందుకని నేను ఈ షేరుని రికమెండ్ చేస్తున్నానంటే, ముఖ్యంగా ఇది గవర్నమెంట్ యాజమాన్యం సహాయ సహకారాలతో నడుస్తున్న సంస్థ. రెండొవది, వీరు ఎన్నుకున్న ప్రోజక్టుల లొకేషన్స్. ఈ లొకేషన్స్ లలో నీరు చాలా బాగా ప్రవహిస్తోంది. ఈ షేర్ ఎక్కటికైనా సేఫే. కానీ ఇది దీర్ఘ కాలిక పెట్టుబడిగా మాత్రమే తలచుకోవాలి. ఏదో కొద్దిపాటి లాభాలకోసం అయితే మాత్రం ఓ ఆరు నెలలు ఆగితే సరిపోతుంది. దీర్ఘ కాలం ఉంచగలిగిన వాళ్ళకు ఇది కల్ప వృక్షమే. నేనైతే ఈ సంవత్సరానికి ఎంత సొమ్మైతే ఫిక్స్ ‍డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ సొమ్మునంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాను. కాబట్టి నేను దీర్ఘకాలిక లాభాలవాడిని అని అనుకోండి. వాళ్ళు క్రొత్తగా మఱో ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసారు. NHPC వివరాలు క్రొత్తగా ఈ లంకెలో చూడండి.

ఏది ఏమైనా.. ముందే చెప్పినట్లు, ఇది నా అనుభవం మాత్రమే. నేను ఏ విధమైన పరిశోధనలు జరపలేదు, అలాగే నాకు అనుభవఙ్ఞులెవ్వరు సాయ పడలేదు. ఈ కంపెనీ యొక్క సాంకేతిక విషయాలు నాకు ఏమాత్రం తెలియదు, కావున మీరు ఇన్వెస్ట్ చెయ్యదలచుకుంటే అందుకు పూర్తిగా మీరే భాద్యులు. ఒక వేళ నేనాశించినట్లుగా ఆరు నెలల తరువాత కూడా ఈ షేరులో మార్పు రాని యడల అందుకు నన్ను భాధ్యుడను చెయ్యవద్దని ముందుగా హెచ్చరిస్తున్నాను

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

చచ్చినోడి చావుకి వచ్చిందే కట్నం – కాదు కాదు, మనం అడిగింది ఇవ్వాల్సిందే

ఈ మధ్య మన అందరికీ తెలిసిన విషయమే.. మన ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ మృతి. ఆయన స్మృత్యర్ధం కాంగ్రెస్ ఎమ్ ఎల్ ఎ లు ఏవిధంగా డబ్బులు దండుకుంటున్నారో మీకు తెలిస్తే పాత కాల సామెతను తిరగ వ్రాస్తారేమో.. ఏంటి జోకనుకుంటున్నారా..


చాల్లేండి .. మీతో నాకు జోకులా.. ఇదిగో నాకు వచ్చిన ఓ స్కాన్ కాపీని మీ ముందు ఉంచుతున్నాను. చక్కగా చదివి మీ తెలివికి పదును పెట్టుకోండి. ఈ విషయం పై వీరెవ్వరిని అడిగామనుకోండి, వచ్చే సమాధానం ఏమిటో మీ కందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి, ఖండిస్తున్నాం.. ఇది అంతా భూటకం.. తప్పుడు సాక్ష్యం.. ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని మేము కూడా సృష్టిస్తాం అంతా అబద్దం .. అంటూ తెగ వాగేస్తూ మనమీద పరువు నష్టం దావా కూడా వేస్తారు. కాబట్టి ఇది ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు కాంగ్రెస్ వారిని అప్రదిష్ట పాలు చెయ్యడానికి ప్రత్యర్దులు పన్నిన పన్నాగం ఏవిధంగా ఉందో అని తెలియ జేస్తున్నాను.



ఉష్.. ష్.... మనలో మన మాట ఒకవేళ నిజంగా చెక్కొచ్చిందనుకోండి. అది ఎవ్వరికీ చెప్పొద్దు. బినామి ఎకౌంట్ ఏదో ఒకటి ఉంటుంది, అందులో వేసుకుంటారు అని మనం వేరే చెప్పనక్కర లేదు కదా..

ఓయ్ – నా అభిప్రాయం


నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం చాలా ఛూజీగా ఉంటాను. అలా నేను చూద్దాం అనుకున్న ఓ సినిమా ’ఓయ్’. నేనేదైతే చూద్దాం అనుకుంటానో ఆ సినిమా చాలా చెత్తగా బోరింగ్ గా ఉంటుంది అని సినీ జనాలు అంటారు. అలాగే కొన్ని కొన్ని బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టి నష్టాలతో వారం రోజులు కూడా ఆడలేదనేది నిజం. కానీ ఎందుకో నాకు అలాంటి కధలే ఆకట్టుకుంటాయి. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, నాకు నచ్చడానికి అక్కడ కధ ముందుగా తెలియాల్సిన అవసరం లేదు. అలా కధ తెలియ కుండా నచ్చిన సినిమా ఓయ్. ఈ సినిమా నచ్చడానికి ఉన్న ఒకే ఒక్క కారణం ఈ సినిమా టాగ్ లైన్. His first love called him Oye..


ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు
౧) అశ్లీలం లేకపోవడం
౨) డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకపోవడం
౩) కుటుంబ సమేతంగా చూడడానికి అనువైన వాతావరణం
౪) కొన్ని కొన్ని సన్నివేశాలు అచ్చంగా హీరో హీరోయిన్ల మధ్య జరిగినట్లుగా చిత్రీకరించడం, కానీ వీరిద్దరూ వారి వారి స్నేహితులుతో మాట్లాడుకోవడం కధనం
౫) కొన్ని కొన్ని సందర్బాలలో వయస్సులో ఉన్న యువత ఎలా ఆలోచిస్తారో చాలా బాగా చూపించడం


ప్రతీ సినిమాలోని కొన్ని నచ్చని అంశాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాలోని నచ్చని అంశం


హీరోయిన్ చావు కాకపోయినా, హీరో పుట్టిన రోజు బహుమతులు ఇస్తూ టీ కప్పులో వేడి తేన్నీరు కాలేక పోయ్యాను అని చెప్పడం చాలా హృదయ విదారకంగా ఉంది. కొన్ని విషయాలు ఇల్లాజికల్ గా అనిపించినా, వాటిల్ని మనం కధలో భాగంగా తీసుకుని లైట్ తీసుకోవాలి. ఉదాహరణకి వైజాగ్ నుంచి కాశీకి ఓడలో వెళ్ళడం, దిష్టి బొమ్మలో డబ్బులు ఉండటం, ఇద్దరు ఎక్కి తక్కువ దూరాలకు ప్రయాణించ గల ఓ చిన్న హెలికాఫ్టర్ కాశీనుంచి వైజాగ్ వరకూ రావడం, ఓడపై రియల్ ఎస్టేట్ వ్యాపారం, సునీల్ పాత్ర, ఇలా అనవసరమైనవి కొన్ని ఈ సినిమా దివాళాకు కారకాలు.


ఏది ఏమైనా, ఈ సినిమా తప్పని సరిగా చూడదగ్గ సినిమా. కధ పరంగా చాలా పట్టు ఉన్న సినిమా, కధనం మరియు చిత్రీకరణ నాకు బాగా నచ్చాయి. పాటలు కూడా ఒక్కసారి వినొచ్చు అనేటట్టుగా ఉన్నాయి. నా వ్యక్తిగత కలక్షన్స్ లోకి ఈ చిత్రం చేరుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

రక్షించండి .. మమ్మల్ని కాపాడండి

ముందుగా మన ముఖ్యమంత్రి డా. వై. ఏస్. ఆర్ మృతికి రెండులైన్ల సంతాపం
.
.
ఇక విషయానికి వస్తా.

ఇదిగో ఇక్కడ చూస్తున్న చిత్రం మేముండే ప్రదేశం. పేరంటారా!! బ్రాహ్మణవాడ. ఇది నాలుగు వైపులా మూసేసి ఉన్న ఒక ప్రదేశం. ఎక్కడ ఉందంటారా!! అదేనండి, బాగ్యనగరంలో బేగం పేటలో ఉంది. మా వాడకి ఒక వైపు ఎప్పుడూ పారే మురికి కాలువ మరోవైపు లోకల్ రైళ్ళు వెళ్ళడానికి అనువుగా ఏర్పరచిన రైల్వే లైన్. కనబడుతోంది కదా. మరి మేము బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే మాకు ఉన్నవి రెండే రెండు దార్లు. అవే మీకు చిత్రంలో ఎర్ర రంగులో వేసిన బాణం గుర్తుతో సూచించ బడ్డాయి. మీరెప్పుడైనా లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళారా.. అయితే మీకు ఓ ప్రక్కగా వరుణ్ మోటర్స్ వారి బోర్డు తపని సరిగా కనబడి ఉంటుంది అలాగే మరోప్రక్కగా అమ్మవారి గుడి కూడా చూసే ఉంటారు. వీటిల్లో రెండు వన్ వే దార్లే.

ఇంత సోదెందుకు అంటారా!! అదిగో అక్కడికే వస్తున్నా. మన ముఖ్యమంత్రి పార్దివ శరీరం ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉంది. అలాగే వీరికి శ్రధ్ధాంజలి ఇవ్వడానికి వచ్చే మంత్రులు, ప్రముఖులు అందరూ చక్కగా బేగం పేట విమానశ్రయంలో దిగి వీరింటికి వెళుతున్నారు. ఇలా వచ్చిన వాళ్ళలో ప్రధాని మన్ మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గార్లు ఉన్నారు. వీరందరికీ ఉన్న ఒకే ఒక దారి సదురు లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. అందువల్ల చాలా టైట్ సెక్యూరిటి. అంతే కాకుండా మా దార్లు రెండూ పోలీసోళ్ళ కభ్జా. మేము బాహ్య ప్రపంచాన్ని చేరుకోవాలంటే ఈ పోలీసోళ్ళను దాటుకుని వెళ్ళాలి. ఏమైనా అంటే లాఠీ ఛార్జీ చెయ్యడమే కాకుండా కాల్పులు కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ చేతుల్లోని రివాల్వర్లను చూసిన జనాలకి మాట పడిపోయి మూగోళ్ళై పోయారు. ఏమైనా అంటే టప్పుక్కున కాల్చేసి విధ్వంసానికి కారణమౌతున్నాడు అందుకే కాల్చేసాం అంటే, అడిగే వాడెవ్వడూ ఉండడు.

పైగా అందరూ z కాటగిరీ ప్రముఖులే. అన్నంత మాత్రాన మా రోజువారి కార్యక్రమాల పరిస్థితేమిటి? మేము బాహ్య ప్రపంచానికి అకర్లేదా .. మాకు బయటి ప్రపంచంతో సంబందాలు అక్కర్లేదా.. మేము ఎక్కడికీ వెళ్ళకూడదా.. మాయింటికి ఎవ్వరు రావాలన్నా వారి పరిస్థితేమిటి? సామాన్య జనం ఈ దారిన వెళ్ళకూడదా?? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?? చెప్పే నాధుడెవ్వడు?

 

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

వ్యాపార సలహా : ఇది ఒక సలహా మాత్రమే

 

ఈ మధ్య కొంత కాలంగా ఫార్మా ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ కనబడుతోంది. అలాంటి కాంపిటీషన్ వ్యాపార పరంగా మంచిదే. అంతే కాకుండా, ఫార్మాలో పని చేసేవారు అనే మాట ఒక్కటే, జనాలు ఉన్నంత వరకూ జబ్బులు ఉంటాయి. అలాగే జబ్బులున్నంత వరకూ ఫార్మా బాగానే ఉంటుంది అని. ఇలాంటి తరుణంలో నేను క్రితంలో లాభమార్జించిన ఓ షేర్ ఇప్పుడు చాలా నష్టాలలో ఉంది. ఇలాంటి సమయంలో మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

అది 2007వ సంవత్సరం మార్చి నెల 17వ తారీఖు. అప్పట్లో మన షేర్ మార్కెట్ శర వేగంతో పరిగెడుతోంది. అలాంటి రోజున నేను REI Agro Ltd., అనే కంపెని యొక్క షేర్లు ఓ నాలుగొందలు కొన్నాను. ఎంతకి అంటారా.. Rs.257.35/- ఆ తరువాత దానిని ఓ ఆరు నెలల తరువాత Rs.375/- వద్ద అమ్మేశాను. దీని వల్ల నాకు కలిగిన లాభం, Rs.47060/-. ఈ షేరు ఇప్పుడు నష్టాలలో కూరుకు పోయి తక్కువలోనే అమ్ముడవుతోంది. BSE లో ఈ షేరుని కొనాలంటే ఈ లంకె ని చూడండి

ప్రస్తుతం ఈ షేరు 48 రూపాయిల 90పైసలు దగ్గర వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. కావున వీలైనన్ని కొని, లాంగ్ టరమ్ కోసం దాచుకున్నారనుకోండి, బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువే లాభం పొందే అవకాసం ఉంది. ఇక్కడ నా ఉద్దేశ్యంలో లాంగ్ టరమ్ అంటే దాదాపు ఓ ఆరు నెలలు అన్నమాట. అందువల్లన ఓ ఆరు నెలలు డబ్బులు మనవి కాదు అనుకున్నట్లైతే ఈ షేర్ యందు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. కాకపోతే ఇక్కడ ఓ మాట చెప్పికోవాలి. ప్రస్తుతం ఈ షేరు ముఖ విలువ ఒక్క రూపాయి మాత్రమే. ఈ సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలలో ఈ షేరుని స్ప్లిట్ చేసినట్టున్నారు. అందువల్ల ఆ నాటి నుంచి ఈ షేరు అమ్మకాలలో ఎక్కువగా కదలిక కనబడుతోంది. ఈ తరుణంలో ఈ షేరు 90 రూపాయలు వద్ద కూడా వ్యాపార లావాదేవీలు మనకు కనబడతాయి. ఏమైనా, ఇంకొక రోజు చూసి ఈ షేరుని కొనడం తెలివైన నిర్ణయమే అని నా అభిప్రాయం

ఆఖరుగా .. ముందే చెప్పినట్లు, ఇది నా అనుభవం మాత్రమే. నేను ఏ విధమైన పరిశోధనలు జరపలేదు, అలాగే నాకు అనుభవఙ్ఞులెవ్వరు సాయ పడలేదు. ఈ కంపెనీ యొక్క సాంకేతిక విషయాలు నాకు ఏమాత్రం తెలియదు, కావున మీరు ఇన్వెస్ట్ చెయ్యదలచుకుంటే అందుకు పూర్తిగా మీరే భాద్యులు. ఒక వేళ నేనాశించినట్లుగా ఆరు నెలల తరువాత కూడా ఈ షేరులో మార్పు రాని యడల అందుకు నన్ను భాధ్యుడను చెయ్యవద్దని ముందుగా హెచ్చరిస్తున్నాను

 
Clicky Web Analytics