పద్దతీ పాడు లేని జీవనం

 

మరో ఉదాహరణ. ఇది కొంచం పచ్చిగా ఉండవచ్చు. కానీ చదువరుల విచక్షణా ఙానానికి వదిలేస్తాను. వారు ఏది చెప్పినా తప్పులేదు. ఎందుకంటే వారి వారి అభిప్రాయాలు వారి వారి స్తితి గతుల నుంచి ఉద్వవించినవి కనుక.

ఆరోజు కొంచం తొందరగానే నిద్ర లేచాను.. అందువల్ల రోజూ జరిగే పనులన్నీ అనుకున్న సమయాని కన్నా కొంచం ముందుగానే జరిగి పోయాయి. అలాగే బస్ స్టాప్ కి కూడా ఓ పావు గంట తొందరగా చేరుకున్నాను. మా కార్యాలయానికి వెళ్ళే బస్సు ఎనిమిది గంటల ముప్పై అయిదు నిమిషాలకి వస్తుంది. ఓ పావు గంట ముందుగానే వచ్చాం కదా .. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా.. మైలున్నర దూరంలో ఉన్న కార్యాలయానికి నడిచి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. సరిలే.. నడిస్తే ఆరోగ్యానికి మంచిదే కదా అనుకుంటూ.. చెవులకు హెడ్ సెట్ తగిలించుకుని.. సంగీతాన్ని మంద్ర స్తాయిలో ఉంచి నడక మొదలు పెట్టాను. మామూలుగా బస్సులో వెళితే, ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ మూలంగా ప్రతి రోజూ పదిహేడు నిమిషాలు అవుతుంది. ఆరోజు నడుచుకుంటూ వస్తే, ఇరవై ఏడు నిమిషాలైంది. అలాగే ఒళ్ళు కూడా కాస్త అలిసింది. దాని వల్ల ఉదయం త్రాగిన బోర్నవీటా పాలు కాస్తా కరిగి చమట రూపంలో విసర్జించ బడినది.

కార్యాలయానికి చేరుకునేటప్పటికి దాదాపుగా తొమ్మిది కావచ్చింది. అలసి ఉన్నానేమో లేక ఒంట్లో నీటి శాతం తగ్గడం వల్ల కాసిని నీళ్ళు పట్టించేసాను. రోజూ మామూలుగా త్రాగే రెండు లీటర్ల నీటికి తోడు మరో ముప్పావు లీటరు నీరు శరీరం లోకి అదనంగా చేరుకుంది. అంతే.. పది గంటలకు అటూ ఇటూగా మూత్ర విసర్జన చేయ్యవలసి వచ్చింది. సరే .. దానిదేముంది.. ఆఫీసే కదా, ఎన్ని సార్లు పోతే ఎవ్వడైనా లెక్క పెడతాడా ఎవ్వడేమంటాడులే అని మెల్లగా మూత్రసాల వైపు అడుగులేసా. జనరల్ గా అన్ని ప్రదేశాలు క్లోజ్‍డ్ గా ఉంటాయి.

మా మూత్రసాల దాదాపుగా వెయ్యిగజాల వైశాల్యంలో కట్టి ఉంటారు. కాబట్టి మనకు మూత్రసాల నుంచి ఎటువంటి దుర్ఘందం రాదు అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిన నాకు ఒక్క సారిగా అపాన వాయువు ముక్కు పుటాల్ని తాకింది. అనుకోని ఆ వాసన నన్ను ఒక్కసారిగా మతి పోగొట్టేంత పని చేసింది. అదేదో సినిమాలో హీరోగారు రౌడీని గట్టిగా పీకి, "ఎవ్వడు కొడితే {మధ్యలో మిస్సయింది}, వాడే పండుగాడు.." అంటాడు. అప్పుడు ఆ రౌడీకి ఎదో అయిన్నట్లు అయింది నా పరిస్తితి. ఒక్క సారి బుర్ర పని చెయ్యడం మానేసింది. దిమ్మ తిరిగి ఒక్క సారిగా తూలి పడబోయి ప్రక్కనే ఉన్న గోడని ఆనుకుని నిలదొక్కుకున్నా. ఇంత గందర గోళంలో ఎలాగోలా వచ్చిన పని కానిచ్చి, హమ్మయ్య .. అనుకుంటూ బయట పడ్డాను. మరో అరగంటలో మరొసారి మూత్రసాలను దర్సించ వలసిన అవసరం వచ్చింది.

ఈ సారి ముందు జరిగిన అనుభవాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ, ముక్కుకి గుడ్డ కట్టుకుని మెల్లగా అందులోకి ప్రవేశించాను. ముక్కుకి ఉన్న గుడ్డ మూలంగానో .. ఏమో.. ఈసారి అంత ఘాటుగా అపాన వాయువు తగల లేదు. నేను ఉన్నానని మాత్రం తెలుస్తూనే ఉంది. కాకపోతే ఈసారి అనుభవం ఈ పుటకు మూలం. వెయ్యిగజాల స్థలంలో నిర్మించిన మూత్రసాల ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అందులో దాదాపుగా ఓ ఇరవైఐదు మల విసర్జన ప్రదేశాలు నిర్మించి ఉంటారు. వాటన్నింటికీ ప్రక్కగా మూత్ర విసర్జన చేసే అవకాశం కలిపించారు. అదిగో అప్పుడు మరో అనుభవం. ఒక్కొక్క మల విసర్జనా చోటునుంచి, అపాన వాయువు వదిలేటప్పుడు వచ్చే శబ్ధాలు, ఈసారు చెవులకు ఉన్న తుప్పు వదిలించాయి. ఒక్కొక్కడూ మరొకడిని మించి పిత్తుతున్నారు. నేను గట్టిగా శబ్దం చేసానంటే, నేను చేసానంటూ పోటీ పడి మరీ చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే.. క్షమించాలి .. వింటూంటే.. పిత్తుల పోటీ కనుక పెడితే, వీళ్ళని మించిన వాడు ఎవ్వడూ లేడనిపిస్తుంది. ఇక లాభం లేదని పరుగు పరుగున బయటకు చేరుకున్నా.

మూత్రసాలలో కొంచం రూమ్ ఫ్రష్‍నర్ కొడతారేమో అని అడగడానికి తలచి, భవన సముదాయం మైన్‍టైన్ చేసే వారి వద్దకు వెళ్ళి అసలు విషయం చెప్పకుండా, ’ మూత్రసాలలో కొంచం రూమ్ ఫ్రష్‍నర్ కొట్టండి ..’ అన్నా. పదకొండున్నరకు ఎగ్జాస్ట్ వేస్తాము అంతవరకూ ఇంతే, తరువాత పన్నెండు గంటలకు, మొదటిసారి రూమ్ ఫ్రష్‍నర్ కొడతాం, రెండవ విడతగా నాలుగు గంటలకు, మలి విడతగా రాత్రి తొమ్మిది గంటలకు కొడతాం, తప్పితే, మధ్యలో కొట్టం అని కరా ఖండీగా చెప్పెసారు. ఇదంతా మాకు మామూలే. ఇది ప్రతి రోజూ ఉండే ప్రవసనమే అని వాళంటూటే, "ఏడిసారు, చచ్చినోళ్ళు..", అనుకుంటూ మెల్లిగా నా సీటుకు చేరుకున్నాను. అదే మేమైతేనా... అంటే నా ఉద్దేశ్యంలో మా ఇంట్లో పెరిగిన వాళైతేనా అని. ఉదయానే నిద్ర లేవంగానే, పళ్ళుతోమావా.. దొడ్డికెళ్ళావా.. స్నానం చేసావా.. అంటూ కాలకృత్యాలు అన్నీ ఆయేంత వరకూ వదిలేవారు కాదు. మల విసర్జన రోజులో ఉదయం వేళ్ళల్లో తప్పితే మరి ఇంకొక సారి చేసే వాళ్ళం కాదు. అంటే అంతగా తినే వాళ్ళం కాదు, అలాగే అన్ని సార్లు వెళ్ళవలసిన అవసరం వచ్చేదీ కాదు అని అర్దం. ఒక వేళ్ళ వెళ్ళవలసి వచ్చినా, ఎదో శరీరంలో సుశ్తి చేసో లేక ఆరోగ్య పరిస్థితి మారో లెక జీర్ణావస్థ సరిగా పని చెయ్యక విరోచనాలు ఆయ్యెవే కానీ ఇలా వేళకాని వేళ్ళల్లో చోటు కాని చోట్లలో వెళ్ళే అలవాటు కాలేదు. వీళ్ళకేమో ఎక్కడ పడితే అక్కడ .. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా.. ఏమి పద్దతో!! ఏమిటో!! మాయాలోకం..

ఇది జరిగిన తరువాత కొంత కాలానికి, సహోద్యోగులతో కలసి మందు కొట్టడానికి బారు కెళ్ళాం. అప్పుడు ఈ ప్రస్థావన వచ్చింది. నా అభిప్రాయం తెలియ జేసాను. వాళ్ళలో తెలియని స్పందన కొట్టొచ్చి నట్లుగా కనబడింది. మెల్లగా ఒక్కడొక్కడూ బయట పడడం మొదలు పెటాడు.

ఒకడంటాడు, సింహాలు పులులు ఉదయానే బహిర్బూమికి వెళతాయా!!
మరొకడు, ఏం.. ఇంట్లోనే వెళ్ళాలా.. బయట వెళ్ళకూడదా!!
ఇంకొడు.. అదేం లెక్క.. ఎప్పుడూ ఉదయానే వెళ్ళాలా.. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదా!!

వీళ్ళతో వాదించడం కాలాయాపన అలాగే సుద్ద వేస్టు అనుకుని, మా సంభాషణని మెల్లిగా మరో అంశంలోకి మార్చేసాను. కానీ నా అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

పులులు సింహాలు ఎక్కడ పడితే అక్కడ బహిర్బూమికి వెళతాయి, మరి తమరెందుకు మూత్రసాలకే వచ్చి వెళుతున్నారు అని మొదటి వాడిని ప్రశ్నించాననుకోండి వాడేమి చెబుతాడో..

ఇంట్లోనూ.. బయట .. ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు. తప్పులేదు, కానీ కార్యాలయంలో మూత్ర సాల కట్టింది అనుకోని సమయంలో ఎప్పుడైనా యాదృశ్చికంగా వెళ్ళవలసి వస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా అనేది యాజమాన్యం అభిప్రాయం. అంతే కానీ ఉద్యోగులంతా ఇళ్ళలో వెళ్ళకుండా ఇక్కడే వెళతారనేది కాదు కదా.

ఇక ఆఖరివాడి విషయానికి వస్తే.. జీవితం అన్న తరువాత ఒక పద్దతీ పాడూ అనేవి ఉంటాయి. ఎక్కడ చెయ్యాల్సిన పనులు అక్కడే చెయ్యాలి. సరసాన్ని నాలుగు గోడల మధ్యే చెయ్యాలి అనేది సమంజసం. కానీ కుక్కల్లాగా మనుషులు కూడా రోడ్డు మీదే శృంగారం సాగించి, తప్పు లేదు అని సమర్ధించుకునే సమాజంలో బ్రతుకుతున్న వీళ్ళకి ఏది ఎక్కడ చెయ్యాలో ఎవ్వరు చెబుతారో.

ఏమిటీ ఈ తరహా వర్క్ సంస్కృతి

నేను ఈ మధ్య వృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను కదా.. కొన్ని కొన్ని విషయాలు అసహ్యాన్ని కంపరాన్ని కలిగిస్తున్నాయి. వాటిల్లో ఇవిగో కొన్ని.

శుచి సుబ్రం - భారత దేశంలో మాకు నేరిన అలవాటు


ఉదయానే లేవంగానే పళ్ళు తోముకోవడం అలవాటు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే.. దాదాపుగా చిన్నప్పటి నుంచి పళ్ళు తోము కోందే మాట్లాడ వద్దేనేవారు. ఉదయానే పళ్ళు తోము కోవడం .. కళ్ళల్లో పుసులు తీసు కోవడం .. నాలుక గీకడం వంటివి .. ఎప్పుడైనా మర్చి పోయ్యాము అనుకోండి, పోలీస్ కుక్క వాసన పసిగట్టినట్లు ఎవరో ఒకరు పసిగట్టేశే వారు. అంతే, ఓ పది నిమిషాలు ఏక బీకిన తిట్లు చీవాట్ల దండకం. వాళ్ళ దండకం పడలేక చట్టుక్కున బాత్ రూమ్ లోకి దూరేశి ఓ పది నిమిషాలు బ్రష్ తో కుస్తీ పడి, అంతా అయ్యింన తరువాత తిట్టిన వాళ్ళ దగ్గర కెళ్ళి .. ఈ.. అంటూ పళ్ళన్నీ కనబడేటట్టు చూపించేత వరకూ వదిలే వారు కాదు.

 

ఇలా అలవాటై .. ఇక్కడికి వచ్చాక.. ఇక్కడ నాతో పని చేసే వాళ్ళ ప్రవర్తన చూసాక. మన సాంప్రదాయమే వీరి కన్నా కోటి రెట్లు మెరుగు అనిపిస్తోంది.

 


శుచి సుబ్రం - అమెరికాలో నేను గమనించిన అలవాటు

 

పనిలో తీవ్రంగా మునిగి ఉండగా ఏదో దుర్గంధం ముక్కు పుటాలకు తాకింది. ఏమిటా అని ఒక తల పక్కకు త్రిప్పితే, నాతో పనిచేసే సహ ఉద్యోగి. ఏదో పని పడింది. అడగడానికి వచ్చాడు. వాడు నోరు తెరిచినప్పుడల్లా దుర్ఘంధం ముక్కు పుటాల్ని చీల్చి చెండాడుతోంది. చికాకుగానే సమాధానమిచ్చి, వాడితో వేగే ఓపిక లేక, ఏవైనా సంధేహాలుంటే మెయిల్ చెయ్యమన్నాను. అదికాదూ .. అంటూ ఏదో చెప్పబోయాడు.

 

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో చూడలేదు, మరో అమెరికన్. వీడు వాడు కలిసి మెల్లిగా జారుకున్నారు. కడుపులో దేవుతూ ఉన్నట్లు ఉన్నందు వల్ల మెల్లిగా రెస్టు రూమ్.. అదేనండీ .. టాయిలెట్.. వైపు వడి వడిగా .. (ఇందులో మొహమాట పడవలసినది ఏమీ లేదు..) పరిగెత్తా.. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది. ఇందాకటి ఇద్దరూ అక్కడ తీరికగా నించొని పళ్ళు తోముకుంటున్నారు.

ఇంతకీ విషయమేమిటంటే.. వీళ్ళు రాత్రి పీకలదాకా బాగా తాగి తెల్లారిదాకా చిందులేసి.. ఉదయాన ఇంటికెళ్ళి ఓ రెండు గంటలు నిద్రపోయి.. పక్క మంచం మీదనుంచి నేరుగా ఆఫీస్ చేరుకున్నారన్న మాట. ఇదిగో ఇక్కడి కొచ్చి దంత ధావనం చేస్తున్నారన్న మాట

పెద్దలే ఇలా ఉంటే, ఇక పిల్లల్లు ఏ విధంగా తయారవుతారు?
మరో చికాకు విషయంతో మరలా మీ ముందుంటా..

అమెరికాలో రిక్షాలు

అమెరికాలో కూడా రిక్షాలు ఉంటాయి అని నాకు నిన్ననే తెలిసింది. ఆశ్చర్యం కాక పోయినా వీళ్ళ విధానాలు కొన్ని బాగానే ఉన్నాయనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయే.. అవే రిక్షాలు ... వాళ్ళే ఈ రిక్షాలను లాగే వాళ్ళు. వీళ్ళంతా ఈ రిక్షాలను సాయంత్రం వేళ్ళల్లో అద్దెకు తెచ్చుకుంటారు. తెచ్చుకుని, ఎక్కువగా యాత్రికులు వచ్చే యాత్ర స్థలాలో ఈ విధంగా నిలబడి పిచ్చాపాటి వేసుకుంటూ ఎవ్వరైనా బకరాలు దొరుకుతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు.


ఆడవాసన తగలగానే చొంగ కార్చుకునే వారు అన్ని చోట్ల ఉంటారు అనడం అతిశయోక్తి కాదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాలలో జనాలు ఎదో పెద్ద సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళ జోలికి పోరు అని చాలా మంది నాకు ఙ్ఞాన భోధ చేసారు. ఏది ఏమైనా, త్యాగరాజు అన్నట్లు.. "ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే.. సంతతంబు ..", కొప్పు చూస్తే చాలు కొట్టుకు చచ్చే వాళ్ళు అన్ని చోట్లా ఉంటారనేది జగద్వితం అని మరొక సారి రుజువు అయ్యింది



అలాగే ఈ క్రింది చిత్రంలో రిక్షాల వెనకాల గుఱ్రం బగ్గీ కూడా కనబడుతోంది కదా. అది కూడా ఇలాంటిదే. ఇవి ఇక్కడకు వచ్చే యాత్రికుల కోసం ప్రక్కనే ఉన్న హోటల్ వాడు ఏర్పాటు చేసాడు. వీటిల్ని అద్దెకు తీసుకునే వారు రోజుకు 40 డాలర్లు చెల్లిస్తారు. యాత్రికులను నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడకు తీసుకు వెళతారు. ఇందుకు ప్రతి ఫలంగా ఇంత కావాలని అడగకుండా.. భారత దేశంలో క్షురకుడు అడిగేటట్లుగా, ’మీ స్థోమతకు తగ్గట్లుగా’ అనో.. లేక .. ’తమ ఆనందం ఎంతిచ్చినా సరే..’ అనో చాక చక్యంగా అడుగుతారు.


ఇదిగో ఇలా విహారం చెయ్యవచ్చన్న మాట. వెలుగు ఉన్న వేళల్లో తిరిగే జంటలు ఎక్కువగా శృంగార చర్యల కొరకే పరిమిత మవ్వడం నాకెందుకో మింగుడు పడలేదు. నేను అనుకోవడం ఈ జంటలు ఙ్ఞాపాల నిధిని నిక్షిప్తం చేసుకోవడానికే అలా చేస్తున్నారని సర్దుకోవడం తప్ప మనం చేసేది ఏముంటుంది. కన్నులు పండగ చేసుకునే వారికి చేసుకున్నంత. ఏలా ఉంది నా ఈ అమెరికా రిక్షాల పుట?
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

కృతఙ్ఞత తెలియ జేసే విధానం

ఈ పుట వ్రాసేముందుగా, ఒక విషయం. నేను ప్రస్తుతం, అంటే ఈ పుట ప్రచురించే సమయానికి అమెరికాలో ఉన్నాను. ఖఛితంగా చెప్పాలంటే, అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని ఔస్టిన్ అనే నగరంలో ఉన్నాను. ఇక్కడ అన్ని విషయాలు కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ కొన్నిపద్దతులు మెచ్చుకోదగ్గ రీతిలో ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇదిగో ఈ ప్రక్కన కనబడుతోందే అదే మా కార్యాలయం. నేను దీనిలోని తొమ్మిదవ అంతస్తులో కూర్చుంటాను.

ఇంతకీ ఈ పుట అస్సలు విషయనికి వద్దాం. ఈ భవంతి స్వంత దారుడు, ఇక్కడ అద్దెకు ఇచ్చిన అన్ని కార్యాలయాల ఉద్యోగులకు కృతఙ్ఞతా భావంతో ఈ రోజు అందరికీ ఐస్ క్రీమ్ పంచి పెట్టాడు. ఇదేదో వింతగా ఉంది కదూ.. నాకు మాత్రం వింతగానే ఉంది. భవనం స్వంతదారుడేమిటి.. అద్దెకు ఇచ్చిన స్థలంలో ఉన్న సంస్థలలో పనిచేసే ఉద్యోగులేమిటి!!! వీళ్ళకీ భవన సొంతదారునికి ఎక్కడైనా సంభందం ఉందా అంటే.. లేదనే చెప్పాలి. కానీ ఆశ్చర్యపరచే విషమేమిటంటే.. ఈ భవనంలో పని చేసే ప్రతి ఉద్యోగికీ ఈరోజు ఉచితంగా ఐస్ క్రీమ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ సంస్థలో పని చేస్తున్నాం అనే దానికన్నా, ఏ భవంతిలో పనిచేస్తున్నాం అనేదే, ముఖ్యం. of course, you have to work from this building, irrespective of company you work.
 

ఓవ్ .. ఓవ్.. ఆంగ్లం పోంగి పొర్లుతోంది.. ఓ.. ఓ..

ఇంతకీ ఈ ఐస్ క్రీమ్ ఎలా పంచారంటే.. ఇదిగో ప్రక్కన చూపించినట్లుగా ప్రతి వ్యక్తికీ ఒక టోకెన్ ఇస్తారు. అదికూడా, ఆ యా కంపెనీల ప్రతినిధులు వారి వారికార్యాలయం లలో వారి వారి పద్దతులలో పంచుతారు.

నేను పనిచేసే సంస్థ వాళ్ళు ఈ కూపన్ల పంపక వ్యవహారం మా రిసెపషనిస్టు చేతుల్లో పెట్టారు.


ఆ అమ్మాయి ఓ విధంగా మెతక నైనది. ఈ అమ్మాయి నిమ్మది తనాన్ని అలుసు చేసుకుని, మా సహోధ్యోగులు, మనిషికి ఒకటి అంటే.. క్రింద కి వెళ్ళి తినేసి వచ్చి, మరొకటి అంటూ.. దాదాపుగా మూడు వరకూ లాగించేసారు. ఇదిగో నా వంతు గా నేనేమో "ఓరిఓ" (OREO) తీసుకున్నా. స్వతహాగా నేను ఐస్ క్రీమ్ తినను, ఎందు కంటే.. ఆ మరునాడే జ్వరం వచ్చేస్తుంది. నాకు ఐస్క్ క్రీమ్ పడదు. కానీ ఇన్ని రకలు ఒక్క చోటే కనబడడం, సహ ఉధ్యోగులు తినమని ఇబ్బంది పెట్టడంతో తినక తప్పింది కాదు.

 

నాకు స్వతహాగా ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు, ఏం దుకంటే.. నా ఆరోగ్యం గురించి నాకన్నా బాగా ఎవ్వరికి తెలుసు గనుక.

 

ఇలా సంగ్ధిధావస్తలో ఉన్న నాకు సహ ఉధ్యొగి ఒకరు, అమెరికాలొ ఐస్ క్రీమ్ చేసే విధానం గురీంచి ఒక చిన్న క్లాసు పీకారు.

 

దాంతో ఇక ధైర్యం చెయ్యక తప్పలేదు. మెల్లిగా అడుగులో అడుగెసు కుంటూ.. ఆ బల్లల దెగ్గిరకు  వెళ్ళా.. కొంచం తక్కువగా  ఉన్నా.. కొంచం రంగులు రంగులు గా ఉన్న ఒక కప్పు తీసుకుని మెల్లిగ నా సీటు చేరుకున్నా.

ఇంతకీ ఐస్ క్రీమ్ పంచే చోటే చాలా మంది ఆస్వాదిస్తుంటే కొన్ని ఫొటోలు తీసాను. ఇవిగో ఈ క్రింద అవి.

నా ఫోన్ (వి) చిత్రాలు

నా కొత్త ఫోన్ విషయాలు ప్రస్తావించే ముందు.. అస్సలు నేను ఈ ఫోన్ ఎందుకు కొనవలసిందో అన్న విషయం మీద చిన్న ఉపోధాతం

అవి డిసెంబర్ 2005 రోజుల్లో.. నేను దుబాయ్‍ లోని ఎమిరేట్స్ లో పనిచేసే రోజులు.. దుబాయ్ వెళ్ళే ముందు నా ఆఖరి పెళ్ళి చూపులు జరిగాయి.. అమ్మకు ఆ అమ్మాయి నచ్చింది. సరే కదా అని సంభంధం కుదుర్చు కున్నారు. ఇంకే.. కొత్తకదా.. నేను ఆ అమ్మాయితో ఎప్పుడైనా మాట్లాడాలి అంటే వాళ్ళ అమ్మగారి (ప్రస్తుత అత్తగారు) ఫోన్ కి చేస్తుండే వాడిని. ఒక్కొక్కసారి మా కబుర్లు అత్తయ్యగారికి వచ్చే కాల్స్ కి ఇబ్బందిగా ఉండేది. ఇక మేము మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుందని, నా శ్రీమతి కోరికపై nokia వాళ్ళ పాత మోడల్ 1100 బహుమతిగా ఇచ్చాను. నేను స్వతహాగా Gadgets అంటే పిచ్చి ఉన్న వాడిని కాదు. అందుకనే.. basic model ఫరవాలేదనిపించింది.

ఇక్కడ మరొక విషయమేమిటంటె.. నా శ్రీమతికి అదే మొదటి మొబైల్.. దేవుడి దయవల్ల కొంచం బాగానే సంపాదిస్తున్నా, మొబైల్ కి మాత్రం ప్రాముఖ్యత నిచ్చేవాడిని కాదు. తరువాత నేను దుబాయ్ నుంచి తిరిగి రావడమూ.. నాకు మొబైల్ లేక పోవడం వల్ల తన ఫోన్ వాడుకునే వాడిని. అదిగో అప్పుడు మొదలైంది.. కొత్త మొబైల్ కొనమనే ప్రస్తావన. జనవరి 2007లో nokia వాళదే, మరొక basic model 2310 నాకోసం కొనుక్కుని 1100 మోడల్‍ని శ్రీమతికి ఇచ్చేసా.. తనకంటూ ఫొన్ అయితే ఉంది కానీ, కెమెరా మొబైల్ లేదని .. తనకు వెంటనే ఒక కొత్త ఫోన్ కొని పెట్టమని ఒకటే పోరు.. అప్పటినుంచి అదిగో .. ఇదీగో అంటూ కాలాయాపన చేస్తూ వచ్చాను. ఈ సంవత్సరం మే లో నా శ్రీమతి ఉధ్యోగంలో చేరింది, అదిగో అప్పుడు ఇక తప్ఫించుకో లేననిపించి ప్రమాణం చేసా.. జులై 16 తారీకున తప్పని సరిగా కొనిపెడతానని .. ఇక తప్పీంది కాదు.
 
అలా, కొన్నదైతే శ్రీమతి కోసం. కానీ ప్రస్తుతం నేను వాడుకుంటున్నానన్న మాట. కొంత కాలం తాను వాడుకున్న తరువాత, దీనిలో ఉన్న ఫీచర్స్ అర్ధం కాక ప్రక్కన పెడితే, ఇదిగో నేను కొట్టేసి ఇలా experiments చేస్తున్నాను అన్న మాట.
 
కొత్తగా వచ్చింది ఏదైనా కొత్తల్లో బాగానే ఉంటుంది. నేనేమీ అతీతుడిని కాదు. అందుకే.. ఈ మధ్య నేను తీసిన చిత్రాలను ఇక్కడ పొందు పరుచుదాం అని నిర్ణయించాను. ముందుగా నేను + నా శ్రీమతి ఉన్న చిత్రం
 
ఈ చిత్రం చూసిన తరువాత నాకు ఒక్క విషయం అర్దమయ్యింది. అది ఏమిటంటే.. నాకన్నా నా భార్యే కొద్దో గొప్పో అందంగా, మరో విధంగా చెప్పాలంటే.. photogenic గా ఉందని.
 
అంతే కాకుండా.. నా కళ్ళ క్రింద చారలు కొంచం ఎక్కువగా వచ్చాయని. దీనిని చూసిన తరువాత నేనే నన్ను చూసి భయపడ్డానంటే నమ్ముతారా.. పాపం నా భార్య పొద్దస్తమానం చూసి చూసి అలవాటు పడిపోయుంటుంది.
 
ఏది ఏమైనా కళ్ళ క్రిందటి ఈ చారల విషయం లో ఏదో ఒకటి తప్పకుండా చెయ్య వలసిందే.. లేకపోతే.. హమ్మో.. పెళ్ళాం .. నేను బాగా లేనని వేరే ఎవ్వరి నైనా తెచ్చుకుంటే.. అస్సలుకే మోసం..
 
మీకు ఏదైనా చిట్కా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టు కోండే..
 
ఇక కొంచం యాంగిల్ మార్చి ప్రయత్నిస్తే.. ఇదిగో ఈ క్రింది విధంగా వచ్చింది
గుడ్డిలో మెల్ల .. అనే విధంగా .. ఈ యాంగిల్‍లో నాకు కళ్ళ క్రింద చారలు కనబడటం లేదు ..
 
హమ్మయ్య!!!! ఈ డైరెక్షన్ ఫిక్స్ చేసేసా..
 
ఇక మీదట ఎప్పుడు నా ఫొటో తియ్యా లన్నా ఈ యాంగిల్ మిస్ అవ్వకూడదు..
 
 
ఈ మధ్య నేను ఉధ్యోగం చేసే కార్యాలయాన్ని మర్చేసా.. "నేను ఉధ్యోగం మారాను" అని వ్రాస్తే బాగుంటుంది అనుకుంటున్నారా.. చేసే పని అదే .. కానీ కార్యాలయం మాత్రం వేరే.. అలాంటప్పుడు "ఉధ్యోగం మారాను .. " అని వ్రాస్తే, ఎందుకో కుదిరినట్టు లేదు ..
ఎదో కొత్తగా ఉంటుందని అలా వాడాను..
వెరైటీగా ఉందనుకుంటాను .. ఏమంటారు?
ఇంతకీ ఈ చిత్రంలో ఉన్నది ఏమిటనుకుంటున్నారు?
కొంచం జాగ్రత్తగా గమనించండి.. గోల్కొండ లాగా ఏదైనా కనబడుతోందా??
లేదా.. అయితే చిత్రం పెద్దది చేసి చూడండి..
పెద్దది కావాలంటే చిత్రానికి ఒక మొట్టికాయ వెయ్యండి..
నేను స్వతహగా పెద్ద చిత్రాన్ని చూసిన తరువాత తెలిసింది, నా ఫోన్ యొక్క ప్రతిభ..
బాగానే ఉంది.. ఎదో అనుకున్నా కానీ .. బాగానే తీస్తోంది..
ఏమి చేసానో తెలియదు .. ఒక్క సారిగా చిత్రాలన్నీ రంగులు పోయి.. ఇదిగో ఈ క్రింద చిత్రం మాదిరిగా అంతా నలుపు తెలుపు అయ్యిపోయింది. దేవుడా .. నాకు ఈ ఫోన్ ఎందుకిచ్చావు? ఇప్పుడు మళ్ళీ రంగులెలా తెప్పించాలి?


ఇంకోక విచిత్రం, అంటే.. కెమెరా ఫోన్ నాకు కొత్త కదా.. అలాగే అనిపిస్తుంది. అలా అనిపించక పోతే వింత కానీ .. విచిత్రం అనిపించడం వింతేమీ కాదు..
 
 
 
అస్సలు ఇంతకీ ఆ vచిత్రం ఏమిటంటారా.. క్రింద ఉన్న మూడు చిత్రాలు గమనించిన తరువాత చెబుతా.. ముందు వీటిని చూసారా..
ఇదే నేను పనిచేసే కొత్త కార్యాలయం.. MLA Colonyలో ఉంది.
 
ఈ బిల్డింగ్ ఎవ్వరిదో చెప్పమంటారా.. మన జలగం వెంగళరావు గారు లేరూ.. వారి మనవడిది..
 
ఎవ్వరిదైతే మనకేంటండీ.. నావరకు నాకు .. ఎక్కడ పనిచేస్తున్నాం.. ఏ పని చేస్తున్నాం .. ఎంత వస్తోంది .. అనేవే ముఖ్యం..
 
ఇక సోది వదిలేసి .. రెండవ చిత్రం దగ్గరకు వద్దాం..
 
దీని గురుంచి ఎదైనా తెలియ జేసే ముందు .. ఇక్కడ మధ్యలో ఉన్న మహిళ గురించి కొంచం ప్రస్తావించాలి.
 
నాతో పనిచేసే సహ ఉధ్యోగిని మా కార్యాలయం వైపు వెళుతోంది. గమనించారా..
 
ఆరెంజ్ రంగు గల చుడీదార్..
 
పట్టారా..
 

ఇప్పుడు దాదాపుగా తన మన దృష్టి పధం లోంచి జారుకున్నట్లు గమనించి ఉంటారు .. ఇక అసలు విషయానికి వస్తే.. నా ఫోన్‍కు ఉన్న కొన్ని వసతులలో ఒకటి, దానికదే ఒకేసారిగా 3గానీ 5గానీ చిత్రాల్ని తీసేస్తుంది. కాకపోతే .. మనం చెయ్యాల్సినదల్లా... aim and hold.. తరువాత దానిపని అదే చేసుకుంటుంది.

ఎందుకో నాకు ఈ facility బాగుందనిపించింది.

ఎప్పుడైనా.. నలుగురితో కలిసి ఫోటో దిగాలనుకున్నప్పుడు.. ఈ విధంగా చేస్తే.. ఒక స్టిల్ మిస్స్ అయ్యినా మరొకటి బాగా వస్తుందని నా అభిప్రాయం.

 
ఇంతటితో నా ఫోన్ చిత్రాలు ముగియలేదు.. మున్ముందు మరిన్ని.. అంతవరకూ ససేషం..

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics