ఇవ్వాళ మరో కంపెనీ చాలా తక్కువ వెలకి వ్యాపారం చెయ్యబడింది. అదే జై కార్పరోషన్ లిమిటడ్. దీని ప్రాధమిక షేర్ విలివ ఒక రూపాయి మాత్రమే. కానీ ఈ షేర్ విలువ 64.35 దగ్గర చేతులు మారుతోంది. గత సంవత్సర కాలంలో ఈ షేర్ ఇంత కంటే తక్కువ ఖరిదులో ఎప్పుడూ అమ్మకం జరగ లేదు. అధికంగా 1259/- అమ్ముడు పోయిందంటే నమ్ముతారా!!! కానీ ఇది నిజం.
మరి నా సలహాకి వస్తే, వచ్చే వారంలో ఈ షేర్ ధర మరింత తగ్గే సూచన కనబడుతోంది. కాబట్టి కొంచం తెలివిగా ఉండి 40/- రూపాయిలకి దగ్గరగా దొరికితే.. ఓ వంద కొని ఉంచు కోండి. స్వల్ప వ్యవధి కన్నా దీర్ఘ కాలంలో మీకు తప్పని సరిగా లాబాలని చేకూర్చే అవకాశాలు ఈ షేర్‍కి ఉంది.
ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.
5 స్పందనలు:
స్వగతం అనే పదాన్ని మీరు వాడిన సందర్భంలో వాడరనుకుంటాను. సరి చేసుకోగలరు.
ఎలా ఉండ వచ్చో .. లేదా .. ఎలా ఉంటే సందర్భోచితమవుతుందో కూడా సెలవిచ్చి పుణ్యం కట్టు కోగలరు
స్వగతం అనేదాన్ని మన జీవితంలో జరిగిన వాటి గురించి చెప్పేటప్పుడు వాడతారు. ఉదాహరణకు,
http://www.google.co.in/search?hl=en&q=స్వగతం
చూడండి.
ఇలా గూగుల్ సెర్చి విషయం చెబుతారను కోలేదు. చక్కగా మీ మాటలలో వివరిస్తారను కున్నాను.
ఏది ఏమైనా .. మరలా నా బ్లాగుకి వచ్చి స్పందించారు. నెనర్లు.
ఇలాగే స్పందిస్తూ ఉండండి
చక్రవర్తి గారు
మీరు వాడిన 'స్వగతం' అన్న పదం ఒక విధంగా ఈ విషయానికి సంభందించి ఉండవచ్చు కాని ... అక్కడ మీరు దానికి బదులు 'స్వానుభవం' లేదా 'సొంత అభిప్రాయం' అని వ్రాసుకొవచ్చు!
స్వగతం అంటె అది మీ అనుభవం కావొచ్చు, కాబట్టి ఆ పదం అంత అనువదించక పోవచ్చు?
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే సుమా!
-సత్య ష్యాం కె జె
(www.sqlserver-qa.net)
Post a Comment