ప్రేమకు అభ్యర్దన

వెన్నెల రేయిలో, మల్లెల్ల గాలుల్లో,

విహరించే మనసు తపనతో చూస్తోంది..

నువ్వు వస్తావని..

ఆశగా ఎదురు చూసే నామనసుని చూసి

పిల్లగాలి నవ్వుకుంది అల్లరిగా..

వెన్నెలమ్మ వెక్కిరించింది వెకిలిగా..

ఆ తపనలోని పరితపన గమనించు,

గమనించి నా హృదయంలో కనిపించు..

శిలని సైతం కదలించి కరిగించే

ప్రేమను కురిపించు..

అలాంటి వర్షంలో తడిసి

ముద్దవ్వాలని.. ఆ ప్రేమ కోసమే..

నా ఈ నిరీక్షణ

8 స్పందనలు:

ramya said...

మీ ఆవిడకి చూపించే పోస్ట్ చేసారా? :)

ఓ బ్రమ్మీ said...

రమ్య గారూ!!

అయ్యో రామా!! మీకెందుకు అంత అనుమానమొచ్చింది. ఈ విషయాన్ని నా శ్రీమతి చదివిన తరువాతే ఇక్కడ ఉంచాను. కాబట్టి నిర్బయంగా చదివేసుకోండి

ఇంతకీ ఎలా ఉంది ఈ తవిక?

కొత్త పాళీ said...

మీ దగ్గర చాలా కళలున్నాయే?
It is pretty good .. నిజంగానే

ramya said...

బావుందండి, తవికేం కాదు, నిక్షేపంగా కవితే!

Anonymous said...

chakravarthy garu r u a poet do u write these poetry .excellent beautiful expression really to have such a wonderful feelings is great., i think if u have written this for ur wife she is very lucky to have u. if someone has written for u then u r lucky to have them . u dont mind i have copied this poetry waiting for another . sreevalli

Anonymous said...

great feeling love to see such poetry. u r an excellent poet. hats of to ur poetry.for such expressions feel like falling in love.

Anonymous said...

good

Anonymous said...

its great expression. love to see such expressions . how do u get such ideas.

 
Clicky Web Analytics