నేను ఓటేసానోచ్..


హైదరాబాద్ వచ్చిన తరువాత మొదటిసారి ఓటేసాను. అలాగే ఈ ఓటు వెనకాల మరో ప్రత్యేకత ఉంది. ఏమిటంటారా.. అది నా జీవితంలో పెళ్ళైన తరువాత మొదటిసారిగా సతీ సమేతంగా నాదైన కుటుంబం అనే గుర్తింపుతో వెయ్యడం అన్నమాట. ఇంతకు మ్రుందు ఎన్నికలు అన్నీ విజయవాడలో సింగ్ నగర్ లో ఉండేటప్పుడు వేసి వచ్చే వాడిని.

ఆ రోజుల్లో.. ఓటేశావా అని నన్ను ఎవ్వరూ అడిగే వాళ్ళు కాదు. అంటే ఈ రోజుల్లొ ఉన్నారు అని కాదు. కానీ నాది అనే ఒక కుటుంబం నుంచి నేను అనే భావన. మరి ఇంతకు ముందో.. మా కుటుంబం నుంచి నేను అనే భావన.

ఈ ’నా కుటుంబం’ మరియు ’మా కుటుంబం’ అనే విషయం మీద గంటలు గంటలు .. రోజులు రొజులు .. నెలలు నెలలు.. సంవత్సరాలు తరబడి చర్చించుకొవచ్చు. కానీ అదో అనుభూతి. అలాగే మరో అనుభూతి ఏమిటంటె.. ఇవాళ్ళ నేను నా భార్యతో మాట్లాడిన మొదటి మాట..

ఓటేసావా!!!!

నన్ను నేనే నమ్మలేకపోయ్యాను. కానీ ఇది నిజం. ఇక అసలు విషయానికి వస్తే.. ఓటు ఎవ్వరికీ వెసాను అనే ప్రశ్నకన్నా.. ఏందుకు వేసాను అనేది ఇక్కడ చాలా ముఖ్యం. దానికి వివిధ కారణాలు..

౧) దొంగ ఓటు వేసే వారికి అవకాసం ఇవ్వకుండా ఉండేందుకు

౨) రాజకీయ నాయకులంతా దొంగలె.. అలాంటిది, నా ఓటు ఓ చిన్న సైజు చిల్లర దోంగకు వేసి వాడిని పెద్ద దొంగని చేస్తే.. వాళ్ళు వాల్లు కోట్టుకుని చస్తారు కదా అన్న క్రమంలో..

౩) ఈ మధ్య కొంత మంది చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయ రొంపి లోకి లాగ బడుతున్నారు. అటువంటి క్రమంలో సాటి చదువుకున్న వాడిగా సదురు అభ్యర్దికి నా నివాళి అర్పిస్తున్నాను

ఇలా చాలా కారణలు ఈ ఎన్నికలను భహిష్కరించ లేకుండా చేసాయి..మరి మీరో..!!??

2 స్పందనలు:

శరత్ కాలమ్ said...

మీదేనా ఆ చెయ్యి?

చైతన్య said...

నేను కుడా ఓటేసాను...

"ఈ మధ్య కొంత మంది చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయ రొంపి లోకి లాగ బడుతున్నారు."ఈ వాక్యం నాకు అంతగా నచ్చలేదు (దానివల్ల పెద్ద నష్టం ఏమి లేదనుకోండి!)
చదువుకున్న వాళ్ళు రొంపిలోకి లాగ బడటం ఏంటి... అసలు చదువుకున్న వాళ్ళే తమంతట తామే స్వయంగా రాజకీయాల్లోకి రావాలి... లేదంటే ఎప్పటికి ఇక ఈ దేశం ఇలాగే ఉండిపోతుంది... అసమర్ధులు, స్వార్ధపరుల చేతిలో నుండి దేశం చదువుకున్న, సమర్ధులైన నాయకుల చేతిలోకి రావాలి...
చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి.
(కాస్త ఎక్కువైన్దంటారా!)

 
Clicky Web Analytics