ఈ మధ్య వస్తున్న పెద్ద పెద్ద సినిమాలతో పోల్చుకుంటే, కలవరమాయే సినిమా పాటలు నాకు బాగానే నచ్చాయి. నాకు హితుడు సన్నిహితుడు అయిన హరనాద్ గారు ప్రచురించినట్లుగా జోష్ పాటలు హిట్ అని నేను ఒప్పుకోను. ఇక్కడ నా రుచి వీరి రుచి ఒక్కటవ్వాలని రూలు ఎక్కడ లేదు కానీ, సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే కలవరమాయే పాటలు చాల రిచ్ గా ఉన్నాయి. కానీ జోష్ పాటలలో అంతటి సంగీత ధోరణి కనబడ లేదు.
సినిమా అంటే పూర్తిగా కమర్షియల్ .. అందువల్ల కమర్షియల్ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉన్నాయి జోష్ పాటలు. ఈ బాటలోకే వస్తాయి మగధీర పాటలు కూడా. కొన్ని పాటలు వ్యాపార ధృక్పధం లేకుండా జనాలలోకి చొచ్చుకుని పోతాయి. అలాంటి వాటి కోవలోనిదే, మగధీరా లోని బంగారు కోడి పెట్ట పాట. కానీ మగధీరా పాటలు కూడ నాకు అంతగా నచ్చలేదు.
అదేదో నానుడి చెప్పినట్లు, విశ్వనాద్ గారి సినిమాలు కళ్ళుతో కాదు చూడాల్సింది. మనసుతో చూడాలి అలా అన్నట్లు, సినిమాని సినిమాగా చూడాలి అలాగే మనకు ఎంత గిట్టింది మాత్రమే చూడాలి తప్ప అందులో రసం ఙ్ఞానం(సాంబారు, పులుసు, వగైరా వగైరా..) ఉందా లేదా అని చూడకూడదు. ఆ కోవలోలే, అభిమానులు ఉన్నారు కదా అని మన నాగార్జున గారి కొడుకుని మోసేయ్యడమో.. లేక ప్రజారాజ్యం అధిపతి కొడుకు కాబట్టి చెరణ్ బాగా చేశాడు అని నేను చెప్పలేక పోతున్నాను.
వీరిద్దరి అభిమానులు, నన్ను మన్నించండి. నాకు జోష్ పాటలకన్నా మగధీరా పాటలు బాగున్నాయి. అలాగే మగధీరా పాటలకన్నా కలవరమాయె పాటలు బాగున్నాయి
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి