కలవరమాయే పాటలు .. నా అభిప్రాయం

ఈ మధ్య వస్తున్న పెద్ద పెద్ద సినిమాలతో పోల్చుకుంటే, కలవరమాయే సినిమా పాటలు నాకు బాగానే నచ్చాయి. నాకు హితుడు సన్నిహితుడు అయిన గారు ప్రచురించినట్లుగా అని నేను ఒప్పుకోను. ఇక్కడ నా రుచి వీరి రుచి ఒక్కటవ్వాలని రూలు ఎక్కడ లేదు కానీ, సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే కలవరమాయే పాటలు చాల రిచ్ గా ఉన్నాయి. కానీ జోష్ పాటలలో అంతటి సంగీత ధోరణి కనబడ లేదు.

సినిమా అంటే పూర్తిగా కమర్షియల్ .. అందువల్ల కమర్షియల్ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉన్నాయి జోష్ పాటలు. ఈ బాటలోకే వస్తాయి మగధీర పాటలు కూడా. కొన్ని పాటలు వ్యాపార ధృక్పధం లేకుండా జనాలలోకి చొచ్చుకుని పోతాయి. అలాంటి వాటి కోవలోనిదే, మగధీరా లోని బంగారు కోడి పెట్ట పాట. కానీ మగధీరా పాటలు కూడ నాకు అంతగా నచ్చలేదు.

అదేదో నానుడి చెప్పినట్లు, విశ్వనాద్ గారి సినిమాలు కళ్ళుతో కాదు చూడాల్సింది. మనసుతో చూడాలి అలా అన్నట్లు, సినిమాని సినిమాగా చూడాలి అలాగే మనకు ఎంత గిట్టింది మాత్రమే చూడాలి తప్ప అందులో రసం ఙ్ఞానం(సాంబారు, పులుసు, వగైరా వగైరా..) ఉందా లేదా అని చూడకూడదు. ఆ కోవలోలే, అభిమానులు ఉన్నారు కదా అని మన నాగార్జున గారి కొడుకుని మోసేయ్యడమో.. లేక ప్రజారాజ్యం అధిపతి కొడుకు కాబట్టి చెరణ్ బాగా చేశాడు అని నేను చెప్పలేక పోతున్నాను.

వీరిద్దరి అభిమానులు, నన్ను మన్నించండి. నాకు జోష్ పాటలకన్నా మగధీరా పాటలు బాగున్నాయి. అలాగే మగధీరా పాటలకన్నా కలవరమాయె పాటలు బాగున్నాయి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

4 స్పందనలు:

చైతన్య said...

ఇది కాస్త ఇరుకులో పెట్టే విషయమే...
నాగ చైతన్య మనోడే... కమల్ మనోడే... (మనోడు !=(not equal to) మన కులం వాడు)

కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే మాత్రం... నాకు కలవరమాయే మదిలో పాటలు నచ్చాయి... నాకు సాహిత్యం బాగుండే పాటలు నచ్చుతాయి...ofcourse సంగీతం కూడా...
స్లో సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతాను కనుక నా taste ప్రకారం KVM సాంగ్స్ నచ్చాయి.
నిజానికి నేను జోష్ పాటలు అన్ని వినలేదు... ఒకటో రెండో రేడియో లో వచ్చినప్పుడు విన్నాను అంతే... కానీ అంతగా నచ్చినట్టు అనిపించలేదు.
మగధీర పాటలు విననేలేదు!

Anonymous said...

సార్,
ప్రపంచమంతా వ్యాపారం సార్ .. సంగీత జ్ఞానం లేని నాలాంటి వారే ప్రపంచంలో ఎక్కువ. మాదే డామినేషన్. కలవరమాయే మదిలో పాటలు బాగున్నాయి. కాదు అనను కానీ, వాటిని మగధీర, జోష్ పాటలతో పోల్చలేను.

"కలవరమాయే మదిలో" సినిమా చూసారా ? వ్యాపారాత్మకం మిస్ అవ్వకుండా విశ్వనాథ్ గారి అనుకురిద్దామని ప్రయత్నించారు.

ఓ బ్రమ్మీ said...

చైతన్య గారు,

ఏదో నాకు తోచినది తెలియ జేసాను. స్పోర్టివ్ గా తీసుకుని స్పందించినందులకు నెనరులు

హరనాద్ గారు,

ఈ సినిమా ఇంకా చూడలేదండి. కానీ చూద్దాం అనుకుంటున్నాను. కలవరమాయే పాటలను అనవసరంగా పోల్చానేమో అనిపించిందా..

ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

Srini said...

నాకు సాహిత్యం బాగున్న పాటలు ఎక్కువ నచ్చుతాయి. అందుకని నేను ఎక్కువగా స్లో పాటలు వింటుంటాను. ఆ కోవలో చూస్తే నాకు జోష్, మగధీర పాటల కన్నా కలవరమయెమదిలొ పాటలు బాగా నచ్చాయి.

 
Clicky Web Analytics