క్రిందటి నెలలో ఆఫీస్ లో ఉన్నప్పుడు జరిగిన యధార్ధ గాధ. ఉదయం నుంచి చాలా కామ్ అండ్ సైలెంట్ గా ఉండే మా సహోద్యోగులలో కొంత మంది పెళ్ళి కాని ప్రసాదులు సాయంకాలం అయ్యేటప్పటికి వైలెంట్ అయ్యి మా చెవులకు ఉన్న తుప్పుని దులుపుతుంటుంటారు. ఎలా అంటారా.. అదేనండి వెస్ట్రన్ సంగీతాన్ని తారస్థాయిని మించి ఒకళ్ళు వాయిస్తే రాక్ సంగీతాన్ని మరొక బాచ్ వాయిస్తూ ఉంటుంది. ఇదేంటి పని చేసే ఆఫీస్ లో ఇలా సంగీతం వాయించడం అనుకుంటున్నారా.. సదురు పెళ్ళి కాని ప్రసాదులలో కొంత మంది మ్యూజిక్ పిచ్చోళ్ళు ఉన్నారు. అంతే ఇంకేముంది, మార్క్తెట్ లోకి వచ్చిన అన్ని మ్యూజిక్ ఆల్బంస్ అన్నింటినీ ఒక్క సారైనా వినాల్సిందే.
వాళ్ళు వింటే ఫరవాలేదు, అక్కడితో ఆగకుండా.. అంకుల్ ఈ పాటలు ఎలా ఉన్నాయ్ .. అంటూ మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశ్యంలో అంకుల్ అంటే పెళ్ళైన మొగాడు అలాగే పెళ్ళైన ప్రతి అమ్మాయి ని అంటీ అని. సరే అసలు విషయాన్ని మరచి పోతున్నాం. అలా ఉదయం అంతా సీరియస్ గా పని చేసుకునే మాకు సాయంత్రం అయ్యేటప్పటికి మ్యూజిక్ గోల తప్పదన్నమాట. ఇలాంటి వాళ్ళ గోల పడలేక నేను నా ఐపాడ్ లో చక్కగా నాకు నచ్చిన పాటలను మంద్ర స్తాయిలో వాయించుకుంటూ వినేస్తుంటాను. కానీ మంద్ర స్తాయిలో ఉన్న సంగీతానికి తారస్థాయి డామినేట్ చేస్తుంది కదా!! అందుకని, చెవులన్నీ కప్పేసేటట్టుగా ఓ హెడ్ సెట్ కొనుక్కొచ్చి నా ఐపాడ్ కి తగిలించేసాను. ఇంకే.. నా ప్రపంచం నాది. ఇక ఇతరులతో మనకు సంబందం లేదు, బయటి వాళ్ళు ఎలాంటి గోల చేసినా నాకు వినపడదు. ఇలా సాఫీగా సాగుతున్న నా సాయంకాలలో .. ఓ చేదు అనుభవం!!
సంగీతం మంద్రస్థాయిని దాటి తారస్థాయిని చేరింది. అయినా ఆ పాటలు జోష్ గానే ఉన్నాయి. నాకు నచ్చిన జోష్ పాటలు అంటే అవి వాసు సినిమాలాంటివి అన్నమాట. ఇంతలో అనుకోకుండా అత్యంత అవసరంగా నాకు FART చెయ్యాల్సి వచ్చింది. (FART అంటే ఏమిటి అని నన్ను అడగవద్దు. మీదెగ్గర ఆంగ్ల డిక్షనరీ ఉంటే వెత్తుక్కోండి. అదేనండి తెలుగులో దానిని అపాన వాయువు అంటారు. అయినా అర్దం కాలేదా మీరు తప్పకుండా నా పాత పుట చదవాల్సిందే మరింకే ఓలుక్కేసుకోండి..) పని వదిలి ప్రక్కకు వెళ్ళలేను.. అయినా తప్పని సరి.. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే.. వినబడుతున్న పాటలో పాత గోడ గడియారంలోని గంటల మ్రోతలా, కొంచం రిధమిక్ గా డ్రం మోతలు వినబడుతున్నాయి.
ఇంకే!! కోతికి కొబ్బరికాయ చిక్కినంత ఆనందం. నాలోని ఒత్తిడిని అంతా ఆ డ్రమ్ మ్రోతలకు అనుగుణంగా చేసుకుంటూ నేను కూడా కొంచం రిధమ్ ని ఏ మాత్రం తప్పకుండా తాళ గతికి అనుగుణంగా నాలోని ఆ వొత్తిడిని కొంచం కొంచంగా అని నేననుకున్నా అది పెద్ద మొత్తంలోనే వచ్చిందని నా నాశికకు తెలుస్తోంది. అయినా తప్పదు.. ఏం చేస్తాం .. అంతటి ఎమర్జన్సి.. మళ్ళీ రెస్ట్ రూమ్ కి వెళ్ళాలంటే మొహమాటమాయే. ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి, FART చేసేటప్పుడు వచ్చేటటువంటి రిలీఫ్ వర్ణనాతీతం. ఎంత భారం తగ్గినట్లు ఉంటుందో నేను మీకు వివరించనక్కర్లేదు. ఇలా సాగుతున్న నా రిలీఫ్ ప్రవసనంలో అనుకోకుండా అవాంతరాలు ఎదురవ్వడం మొదలైంది. ఎలా అంటారా.. చదవండి.
మా ఆఫీస్ లోని సహోద్యోగులంతా యాహూ మెసెంజర్ని వాడతారు. అది మాకు అఫీషియల్. అందు వల్లన సహోధ్యోగులు ఎవ్వరు ఎవ్వరికి ఏమి చెప్పాలన్నా మెసేంజర్లో మెసేజ్ పెడతారు. అదిగో అప్పుడు మొదలైంది. ఒక్కొక్కడు మెసేజ్ లు ఇవ్వడం. ఏమని అంటారా.. "బాసు కొంచం సౌండు తగ్గించు వినలేక చస్తున్నాం " అని. వాళ్ళకా అర్దం కాదు!! సౌండ్ తగ్గిస్తే నాకు ఇబ్బంది అని. అందుకని చిలవలు పలవలుగా వస్తున్న అలాంటి మెసేజ్ లన్నింటిన్ని పట్టించు కోకుండా నా పని పూర్తి చేసే కుంటూ పూర్తిగా రిలీఫ్ అవ్వడానికి సిద్దం అయ్యే హడావిడిలో పడ్డాను. అన్నింటికీ ముక్తాయింపు ఇచ్చిన తరువాత పూర్తిగా రిలీఫ్ అయ్యిన తరువాత నా పాటల సౌండ్ తగ్గించా.
ఆశ్చర్యం సౌండు తగ్గటం లేదు. సిస్టంలోని అన్ని ప్రయత్నాలు చేసేసా .. అయినా సౌండు మాత్రం తగ్గలేదు. కంట్రోల్ పానల్ కి వెళ్ళి అక్కడ సౌండు అండ్ ఆడియో డివైజస్ ఆప్షన్లో ఏమైనా మిస్ చేసానా అని విస్వ ప్రయత్నం చేసాను. అయినా అంతే సౌండ్ ఉంది .. ఎక్కడ పొరపాటు జరిగిందా అని తలమునకలౌతుంటే .. అప్పుడు గుర్తుకు వచ్చింది ..
నేను పాటలు ఐపాడ్ నుంచి వింటున్నానని..
ఇంకేముంది మరునాడు ఆఫీస్ కి సెలవు, ఓ వారం రోజులు ఎవ్వరినీ పలకరిస్తే ఒట్టు. మీకిలాంటి అనుభవం ఎప్పుడైనా అదురైందా!!
4 స్పందనలు:
:-) :-) :-):-)
హహహ
:)) :))
హ హ హ... మీ టపా చదువుతుంటే మా లెక్ఖల మాస్టారు గుర్తుకువచ్చారు.... మంచి జోక్ చెప్పారు అంకుల్ ( ఈ మాట ఎందుకు అన్నానంటారా? నేను పెళ్ళికాని ప్రసాద్ శిష్యుడునేగా :) ....
Post a Comment