నాగురించి ౫ విషయాలు

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నాట్లుగా అని అనుకోకుండా.. వీలయితే మీ గురించి ఎవ్వరికీ తెలియని ఓ అయిదు విషయాలను నిర్బయంగా తెలియ జేయ ప్రయత్నించండి. ముందుగా నా గురించి మీ అందరికీ తెలియని ఓ అయిదు విషయాలు

౧) నాకు సంగీతం మరియు నాట్యం అంటే ప్రాణం. వీటికి తోడు భరత నాట్యంలో డిప్లమో కూడా ఉంది నేను పుట్టింది 1972లో అయితే ఊహ తెలిసిన తరువాత అంటే ఓ పదేళ్ళ వయస్సులో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన తరువాత నుంచి 1996 వరకూ నాట్యాన్ని అభ్యసించడమే కాకుండా పలు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.. అంతే కాకుండా, కూచపూడి, కధక్, కధకళి మరియు చౌ అనేటటు వంటి విభిన్న నృత్య రీతులలో ప్రవేశం కూడా ఉందని వేళ్ళపై లెక్కపెట్టేంత మందికి మాత్రమే తెలుసని నా అభిప్రాయం

౨) నేను డిగ్రీని తొమ్మిది సంవత్సరాలు చదివాను. మూడేళ్ళలో ముగించాల్సిన B.Sc., ని తొమ్మిదేళ్ళలో అతి కష్టంపై కంప్లీట్ చేసాను అని చాలా మందికి తెలియదు.

౩) నేను నిత్య విద్యార్ధి అని చెప్పడానికి మరో ఉదాహరణ, నా MCA. రెండేళ్ళలో ముగించాల్సిన దానిని ఆరేళ్ళైనా ఇంకా ఇప్పటికీ వ్రాస్తునే ఉన్నాను అంటే మీరు నమ్ముతారా..

౪) మైక్రో సాఫ్ట్ వారిచే అత్యంత ఉన్నతమైన పురస్కారాన్ని నేను 2005వ సంవత్సరంలో పొందాను. ఆ సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో పదిహేడు మందికి మాత్రమే Most Valued Professional, MVP అనేటటువంటి సత్కారాన్నిచ్చారు. అటువంటి పదిహేడు మందిలో నన్ను చేర్చి గౌరవించారు. ఇందు మూలముగా తెలియ జేయునదేమనగా, మనకు చదువు అబ్బలేదు కానీ.. ఇలాంటి టెక్నికల్ విద్యలు మాత్రం అమోఘం

౫) మొట్ట మొదటి సారిగా 1999 వ సంవత్సరంలో నేను మైక్రోసాఫ్ట్ వారిచే ప్రొఫెషనల్ గా సర్టిఫై చేయబడ్డాను. అంటే నేను అప్పుడే MCP – Microsoft Certified Professional పరిక్ష వ్రాసి ఉత్తీర్ణుడైయ్యాను. ఇప్పుడు పదకొండు సంవత్సరాల తరువాత మరొక మైలు రాయి చేరాను. ఇప్పుడు నేను MCTS – Microsoft Certified Technology Specialist మాత్రమే కాకుండా MCPD – Microsoft Certified Professional Developer అనేటటువంటి గుర్తింపు పొందానన్న విషయం నా భార్యకు కూడా తెలియదు అంటే మీరు నమ్ముతారా!! కానీ ఇది నిజము

3 స్పందనలు:

Anonymous said...

1. నాట్యంలో అంత ప్రవేశం ఉన్నందుకు అభినందనలు.
2. అవునా. అంత సమయమా!!!
3. నేర్పరి అంటే 'నేర్పు గలవాడు' అని అర్థం. ఇంకో రెండేళ్ళలో పూర్తి చేసేస్తారుగా M.C.A
4. అత్యంత పురస్కారమేమిటి? 'అత్యంత విలువైన' అయుంటుంది. అభినందనలు.
5. నమ్ముతాం. మీ భార్యకి కూడా తెలియజేయండి.

ఓ బ్రమ్మీ said...

thanks for the correction, and modified accordingly

Anonymous said...

చాలా చాలా గ్రేట్ అండి.

 
Clicky Web Analytics