సాధారణంగా నేను బ్రేక్ ఫాస్ట్ మిస్ అవ్వను. ఉదయం ఏదో ఒకటి తినాల్సిందే. ఈ విషయం నాకు ఊహ తెలుస్తున్న కొత్తల్లో ఒక న్యూస్ పేపర్లో చదివినట్లు గుర్తు. లేలేత వయస్సులో ఏదైతే తెలుసుకుంటామో అవి చాలా బలంగా మన మనోఃఫలకంపై ముద్రించుకుపోతాయి. అందువల్ల వాటిని ఇక మనం జన్మలో మానము. వాటిల్లో ఒకటి ఇది. నేను మా అమ్మకి అలాగే నా భార్యకి ఎప్పుడూ చెబుతూ ఉంటాను.. వీలైతే మధ్యాన్నం భోజనం మానేయ్యండి, అంతే కాని ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానొద్దు అని. కొన్ని కొన్ని విషయాలు అందరికీ చెప్పలేం.. మా అమ్మకు మాత్రం ఓ గుక్కెడు వేడి వేడి కాఫీ ఇస్తే చాలు .. ఇంకేం అడగదు.. మధ్యాన్నం భోజనం మాత్రం చక్కగా శుస్టిగా భోంచేస్తుంది. ఒక్కొక్క సారి మా అమ్మ తిన్నంత నేను తినేలేకపోతున్నానే అని సిగ్గుగా ఉంటుంది కూడా.. అప్పుడప్పుడు మాఅమ్మని చూసి అబ్బుర పడుతుంటాను..
వెధవల్లార.. వెధవల్లార.. గట్టిగా కంచం నిండా అన్నం పెడితే తినలేరు కానీ పెద్ద పుడింగులంటూ తయ్యారవుత్తారు.. ముందు గట్టిగా అన్నం తినడం నేర్చుకోండిరా..
అంటూ చీవాట్లు పెడుతున్నప్పుడు ముచ్చటేస్తుంది.. ఏది ఏమైనా సరే నేను మాత్రం బ్రేక్ ఫాస్ట్ మానను.. ఇండియాలో ఉన్నప్పుడైతే, నా భార్య చక్కగా ఓ ఆరు ఇడ్లీలో లేక ఓ నాలుగు దోశలో అదీ ఇది కాకపోతే కొంచం ఉప్మానో చేసి పెడుతుంది.. అది తిని ఆఫీసుకు బయలుదేరే ముందు ఓ గ్లాసుడు కాచి చల్లార్చిన పాల గ్లాసు ముందు గదిలో ఉంచుతుంది.. అది షూ వేసుంకుంటూనో లేక టీవీ న్యూస్ చూస్త్తూనో త్రాగేస్తాను.. ఇదిగో ఇక్కడ అంటే అమెరికా వచ్చిన తరువాత అవేమీ లేవు కానీ మరో రకమైన బ్రేక్ ఫాస్ట్..
కాకపోతే, చిన్నపిల్లల్ల లాగా సీరియల్ తినాల్సొస్తోంది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాకపోతే దానికి నా వంతు ఇస్టైల్ గా ఉంటుందని కొన్ని కిస్ మిస్ లు, బాదంపప్పు, జీడిపప్పు, వగైరా వగైరా జోడించి లాగించేస్తుంటాను.. మరో ప్లేటులో చూసారూ.. అవేనండి ఫ్రూట్స్ మరియు కోడిగుడ్డు.. పాత రోజుల్లో ఓ ఆంగ్ల సామెత ప్రకారం రోజుకొక యాపిల్ తింటే వైధ్యుడి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం రాదంట.. అలాగే రోజుకొక గుడ్డు తిన్నా అంతే అని నా అభిప్రాయం.. ఇక్కడ నేను ఉంటున్న హోటల్ వాళ్ళు ఒక వేళ గుడ్డుని గుడ్డుగా ఉడకపెట్టకపోతే.. ఇదిగో ఇలా రోల్ చేసి దాన్ని ఓ చెపాతిలో ఉంచుతారన్నమాట..
ఎలా ఉంది నా బ్రేక్ ఫాస్ట్ ఇస్టోరి..
3 స్పందనలు:
guDlu tinadavaeMtee, braahmanyam manta galuputoo..??
హా..హా..
అయ్యా అనామకులుంగారు.. మీ మనసులోని మాటని మరింత వివరించమనవి..
అయ్యో అయ్యో పాపం. మేము ఇంచక్కా రోజుకో టిఫిన్ చేసుకుంటాము.జస్ట్ ఫర్ fun
Post a Comment