అమెరికాలో కూడా ఈగలుంటాయని నాకు నేటి వరకూ అనుకోలేదు. నా పిచ్చి కాకపోతే, ఈగలకు పాస్ పోర్ట్ మరియు విసాలాంటివి అవసరంలేదు కదా.. వాటికి కావలసినదల్లా రుచికరమైన ఆహారపదార్దం ఆరు బయట ఉంచడమే.. నేను నా భోజనాన్ని ప్లేటులో పెట్టుకుని హాయగా ఉంటుందని, స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నా.. ఇదిగో ఇలా నేను కూర్చున్నానో లేదో.. వెంటనే తయారయ్యాయి.
హల్లో ఈగల్స్.. ఎలా ఉన్నారు?
4 స్పందనలు:
ఇంతకీ ఆ పదార్థం పేరు చెప్పలేదు?
హ హ హ అమెరికా లో ఈగలు దోమలు కాకులు అన్నీ లక్షణం గా వుంటాయి. భాస్కర్ గారు క్రేన్ బర్రీ సాస్ ముక్కో లేక బీట్ రూట్ ముక్కో అనుకుంటా.. మరి ఈగలు రాక ఏం చేస్తాయి. :-)
భాస్కర్ గారు,
అది భావనగారు చెప్పినట్టు ఆలీవ్ ఆయిల్ లో నాన్చిన బీట్ రూట్ ముక్క. స్పందించినందులకు నెనరులు
భావనగారు,
కాకులు ఇంకా కనబడలేదు గానీ ఉడుతులు మాత్రం కనబడ్డాయ్.. అలాగే వాటి వీపుమీద చారలు లేవు సుమా. ఏమైనా స్పందించినందులకు నెనరులు
సీతమ్మతల్లి అమెరికాకు వెళ్ళలేదు కదండీ మరి :)
అందుకే మన ఉడతలకే వీపు మీద చారలుంటాయి.
Post a Comment