అమెరికాలోని ప్రతీ పౌరుడు సగటున పదిహేను సంవత్సరాల వయసు దాటిన వారు రోజులోని ఇరవై నాలుగు గంటలను ఏవిధంగా గడుపుతున్నారు అని జరిపిన సర్వేలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి సంఖ్యలు చూసాక నేను ఆశ్చర్య చతికుడనైయ్యాను.
అన్నింటికన్నా నన్ను ఆశ్చర్య పఱచినదేమిటంటే, సగటున ఎనిమిదిన్నర గంటలు వీళ్ళు నిద్రపోతున్నారట. అంతే కాకుండా మరో ఆశ్చర్యమైన విషయమేమిటంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు సగటున ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఉద్యోగం చేస్తుంటే, లేని వాళ్ళు చక్కగా ఏదైనా పనికి వచ్చే పని పట్ల దాదాపు నాలుగున్నర గంటలు పని చేస్తున్నారు. వీళ్ళ విషయంలో పనికి వచ్చే పని ఏమిటంటే, వ్యాయామం, సోషల్ సర్వీస్, ఇంకా ఇంకా వగైరా వగైరా అన్నమాట. వీళ్ళు తిండికి అచ్చంగా గంటకు తగ్గకుండా కేటాయిస్తారు. నా విశ్లేషణలు అనవసరం గానీ అచ్చంగా వీరి సంఖ్యలను యధా విధిగా ఇక్కడ ఉంచుతాను.
Purpose | Time (h:min) |
Sleeping | 8:23 |
Work / Related activity | 4:30 |
Employed | 8:16 |
Watching TV | 2:37 |
Leisure/Sports (NonTv) | 2:06 |
Eating, Drinking | 1:10 |
Housework | 0:33 |
1 స్పందనలు:
వుద్యోగం వున్నవాళ్లు సగటున యెనిమిది గంటల పదహారు నిమిషాలు పని చెయ్యడమా!
బార్బేరియస్!
ఆరున్నర గంటలు దాటితే పని చెయ్యకండి.....చేసినా ఓవర్ టైం డిమాండు చెయ్యండి!
(అంటాయి మన కమ్యూనిస్ట్ డామినేటేడ్ యూనియన్లు!)
తరవాత మీ యిష్టం.
Post a Comment