యాంజెలీనా జోలీ ముఖ్య పాత్రలో మరియు లీడింగ్ పాత్రలో నటించిన సాల్ట్ సినిమాని ఇవాళ చూసాను.
జనరల్ గా నాకు సినిమాలపై రివ్యూలు వ్రాసేంత పరిజ్ఞానం లేదు, కానీ ఈ రివ్యూ వెనక ఓ ఆంతర్యం ఉంది.
నేను స్వతహాగా యాంజెలీనీ జోలీ అభిమానిని.
నేను అభిమానించే అతికొద్ది మంది నటులలో ఈమె ఒకతి. అలాగే మన కమల్ హాసన్ మరొకరు. నేను ఇలా అభిమానించడానికి ఉండాల్సిన అర్హతలేమిటంటే .. ఒక్కటే.. అది వైవిధ్యం. ఇలా వైవిధ్యంగా నటించే వ్యక్తులలో నాకు నచ్చే వారు అక్కినేని నాగేశ్వర రావు గారు. స్వతహాగా దేవుడంటే నమ్మకం లేకపోయినా ఓ పరమ భక్తుని వేషం వెయ్యడమే కాకుండా అందర్నీ మెప్పించడం వీరి నటనా ప్రజ్ఞని చెప్పకనే చెబుతుంది. అలా తమ ప్రజ్ఞని తమ చిత్రాల ద్వారా తెలియ జేసే నటులలో ఒకరు యాంజెలీనా జోలి అని నా నమ్మకం. నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను కాబట్టి నేను మరియు నా అభిప్రాయాలు తప్పు కావచ్చు.
కానీ నేను ఓ సాధారణ సినిమా వీక్షకుడిని. అలాగే నాకు కొన్ని అభిరుచులు ఉంటాయి. అలాంటి అభిరుచుల వెనకాల నేను ఈ అమ్మాయి నటనకు అంతే కాకుండా ఈ అమ్మాయి ఎంచుకునే పాత్రలకు నేను ఓ అభిమానిని. ఎంత మంది అమ్మాయిలు ఈ అమ్మాయి లాగా ఆలోచిస్తారో గాని.. మన దేశంలో నాకు ఈ అమ్మాయి లాంటి అమ్మాయి మరొక వ్యక్తి కనబడింది. అది మరెవ్వరో కాదు, సుస్మితా సేన్. అప్పుడప్పుడు నేను నా భార్యతో చెబుతూ ఉంటాను, ఏమని అంటే, ఒక వేళ నేను నా భార్యని కనుక పెళ్ళి చేసుకోక పోతే అచ్చంగా సుస్సునే చేసుకుంటానని. అదేదో పాత సామేత చెప్పినట్టు, నేను మన సుస్సు లవ్వులో ఉన్నాం.. ఎటోచ్చి సుస్సుకే తెలియదు నేను లవ్ చేస్తున్నానన్న విషయం. కానీ మా లవ్వు ఫిఫ్టీ పర్సంట్ సక్సస్ (నా వైపు నుంచి). ఇక నా ఫీలింగ్స్ ప్రక్కన పెడితే, ఒక్క విషయం .. నేను మొదటి సారి యాంజలీనా జోలీ నటించిన టూంబ్ రైడర్ చూసిన తరువాత ఈమె ఫాన్ అయ్యాను.
ఇలా అభిమానిగా మారడం వెనకాల పలు కారణాలున్నాయి. మొదటిగా ఈ అమ్మాయి, సాధారణ అమ్మాయిలలాగా కధా ప్రాధాన్యమైన సినిమాలు మాత్రమే చెయ్యకుండా యాక్షన్ పూరితమైన సినిమాలు చేస్తుంది అనేది మొదటి అంశమైతే, మరొకటిది .. ఒక నల్ల జాతి పిల్లని దత్తత తీసుకోవడం. అంతే కాకుండా ముచ్చటగా మూడో సారిగా ఈ అమ్మాయి ఓ యాక్షన్ హీరోని పెళ్ళి చేసుకుంది. అదేనండి మన బ్రాడ్ పిట్, ఈమె మూడో భర్త. ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ముఖ్యం కాకపోయినా యాక్షన్ సినిమాలు చేసే మరో హీరోని చేసుకుంది అనేది ముఖ్యం. ఈ అమ్మాయి మిగతా ఇద్దరు మొగుళ్ళతో మూడు మూడేళ్ళకు మించి కాపురం చేయక పోయినా మన క్రూజ్ గారితో మాత్రం 2005 నుంచి కలసి కాపురం చెయ్యడమే కాకుండా భాద్యతాయుత మైన మరో పాత్రని నిజజీవితంలో పోషిస్తోంది అనేది మరో అంశం. అంతే కాకుండా ఈ అమ్మాయి అచ్చంగా ఆరుగురు పిల్లల తల్లి అంటే మీరెవ్వరూ నమ్మకపోవచ్చు. ఇందిలో ముగ్గురికి ఈమె స్వతహాగా జన్మనిచ్చిన తల్లి అయితే మరో ముగ్గురిని ఈమె దత్తత తీసుకుంది. ఈమె మొదటి కాన్పులో ఒక అమ్మాయికి తల్లైతే మరో కాన్పులో కవలలకు తల్లైంది. ఇలా ముగ్గురికి తల్లి అవ్వడమే కాముండా మరో ముగ్గురిని ఈమె దత్తత తీసుకుంది. మొదటిసారిగా 2002 లో ఇమె కంబోడియా దేశస్తురలైన ఒక అబ్బాయిని దత్తతీసుకుంటే, మరోసారి ఇథియోపియా దేశం నుంచి మరో అమ్మాయిని.. అంతే కాకుండా వియత్నాం దేశం లోని ఓ మూడేళ్ళ అబ్బాయిని ఆఖరి సారిగా దత్తత తీసుకుంది.
ఇక ఈ అమ్మాయి గురించి వ్రాయడం ప్రక్కన పెట్టి, సినిమా విషయానికి వస్తే.. మొత్తం మీద మూడు యాక్షన్ సీన్లు మాత్రమే ఉన్నాయి. మొదటి యాక్షన్ సీక్వెన్స్ ఇరవై మూడో నిమిషంలో మొదలైతే రెండొవ సీక్వెన్స్ అచ్చంగా నలభై ఆరో నిమిషంలో సాగుతుంది. ఆఖరి యాక్షన్ సీక్వెన్స్ మరో ఇరవైయ్యవో నిమిషంలో ఉంటుంది. నేను ఈ అమ్మాయి సినిమాలను ఒక్క యాక్షన్ కోసం మాత్రమే చూస్తాను. ఇందు వల్ల కొద్దిగా డిజ్జప్పాయింట్ అయ్యాను. కాకపోతే పాత సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను ఎక్స్యూజ్ చేసాను. ఇకపైన అయినా కొంచం జాగ్రత్త తీసుకుంటుందని తలుస్తాను.
మొత్తం మీద నూట పది మిలియన్ల డాలర్లతో నిర్మితమైన వంద నిమిషాల నిడివిగలిగిన సినిమా నన్ను మెప్పించ లేక పోయింది. కాకపోతే నాకు నచ్చిన విషయాలు ఈ క్రింది విధంగా..
౧) ఈ అమ్మాయి తన శరీర ఆకృతిపై తగినంత శ్రద్ద వహించింది అని వేరే చెప్పనక్కరలేదు
౨) యాక్షన్ సీన్లు ఎవ్వరు రూపొందించారో కానీ బాగా చిత్రీకరించారు
౩) పగటి పూట చిత్రీకరిస్తూ చుట్టు అంతటి ట్రాఫిక్ ఉంచుకోవడం బాగుంది
ఇక నచ్చని విషయాలకొస్తే..
౧) ఈ అమ్మాయిని చూడడానికి వచ్చేదే యాక్షన్ సీన్ల కోసం అలాంటిది.. సినిమా మొత్తంలో మూడే మూడు యాక్షన్ సీక్వెస్న్ ఉంచడం మైనస్ పాయింట్
౨) మొదటి యాక్షన్ సీక్వెన్స్ కోసం అచ్చంగా 23 నిమిషాలు ఎదురు చూడాల్సి రావడం నా పేషన్సీకి పరీక్షే అయ్యింది
౩) సాధారణంగా ఈ సినిమా ట్రాడెజీ అంటే నమ్మ బుద్దు కాలేదు.. క్లైమాక్స్ అర్దం కాలేదు. చాలా ప్రశ్నలు!!
అలా .. ఎన్నో విషయాలు నన్ను డిజప్పాయింట్ చేసాయి. ఇక మీకు వీలైతే ఒక్క సారి చూడండి అని మాత్రం చెబుతాను. ఇలా చెబటం వెనకాల ఒకటే ఒక పరమార్థం.. అదేనండి నూట పది మిలియన్లతో నిర్మించిన సినిమా అన్న ఒక్కటే అర్దం.
4 స్పందనలు:
she married Brad pitt not Tom Cruise.
సాహితి గారు,
ఈ సినిమాని మొదటగా టాం కౄజ్ ని చెయ్యమని అడిగారంట, అతను కాదంటే అంత బాగా యాక్షన్ సీక్వెన్స్ ఎవ్వరు చెయ్యగలరో అని ఆలోచించిన తరువాత ఈ అమ్మాయికి ఈ సినిమా అవకాశం వచ్చింది అని వ్రాద్దాం అని అనుకుంటూ ఈమె భర్త పేరు టాం అని వ్రాసాను. గమనించి స్పందించినందులకు నెనరులు. మార్పు చేసాను, గమనించండి
#Angelina Jolie# mIda mI #review# caalaa baagumdi. mari #SALT# gurimci #review# eppuDu raayabOtunnaaru? :)
Post a Comment