కోలుకోవడం ఎంత కష్టమో!!

ఈ మధ్య రెండు వార్తలు నన్ను చాలా భాధకి గురిచేసాయి. వాటిలో ఒకటి రోజుల పసిగొడ్డుని చెత్తబుట్టలో వేసి పోయిన తల్లి తండ్రుల వార్తలు మనకి అను నిత్యం కనబడుతుంటాయి కానీ ఈ నాటి ఈ వార్తలో విషయం నన్ను మరింత భాద పెట్టింది. అది ఆ పసి గొడ్డు ప్రాణాలతో మాత్రం లేదు. అది నన్ను మరింత భాదలోకి నెట్టేసింది. తేరుకోవడానికి కొంచం టైం పట్టింది.

మరో విషయం పూర్తిగా స్వవిషయం. స్వవిషయాన్ని నలుగురితో పంచుకునేంత మహాత్ముడిని కాలేదు కాబట్టి ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించాలి. భాధ పడటం నాకు క్రొత్తేం కాదు గానీ పడ్డ భాధలోంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు. ఎందుకంటే నన్ను నేను ఓదార్చుకునే వాడిని. ఈ సారి నన్ను నేను ఓదార్చుకోవడానికి కూడా శక్తి చాలలేదు.

నేను శక్తిని కూడకట్టుకుని నన్ను నేను నిభాళించుకునేంత వరకూ మౌనంగా ఎదురుచూడటం తప్పితే చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. మనసులో కలిగిన గాయాన్ని కాలం పరిష్కరించేంత వరకూ ఎదురు చూడటమే అని ఎదురుచూస్తున్నంతలో కొత్త బంగారులోకం సినిమాలోని ఓ డైలాగ్ నాకు మంచి ఆయింట్ మెంట్ లాగా అనిపించింది. ప్రకాష్ రాజ్ కి పిల్లల విషయం తెలిసి ఒకటే డైలాగ్ కొడతాడు..

నాకు తెలిసిందల్లా ఒక్కటే.. ఇంకా ఎక్కువగా ప్రేమించడమే ..

5 స్పందనలు:

Anonymous said...

స్వవిష్యఆన్ని నలుగురితోనూ పంచుకునే వారు మహాత్ములవుతారా? మీకు పంచుకోవడం ఇష్తంలేకపోతే పోనీ, ఎందుకండి అలాంటి వెటకారాలు? అలాంటప్పుడు బాధని మాత్రం పంచుకోవడమెందుకు?

ఓ బ్రమ్మీ said...

అనామకులుంగారు,

గాంధిగారు తన బయోగ్రఫీలో కొన్ని కొన్ని వ్రాసినట్టు గుర్తు, వాటిల్లో ఒకటి దొంగతనం చెయ్యడం అనుకుంటాను. వారు ఒక్క బయోగ్రఫీలో తప్ప మరెక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు నాకు తెలియదు. అలా ఎవ్వరికీ తెలియని విషయాన్ని నలుగురితో పంచుకోవడానికి ధైర్యం ఉండాలి అలాగే ఎవ్వరైనా ఆ విషయంపై స్పందిస్తే అహ్వానించే గుణం కూడా ఉండాలి. అలా ఆ రెండూ లేనంత కాలం ప్రస్తావించకుండా ఉండటమే శ్రేష్టం. అందుకే ప్రస్తావించలేదు.

ఇక భాధని పంచుకోవడం ఎందుకు అన్నదానికి నా స్పందన నా టాగ్ లైన్లోనే ఉంది. ఒక్క సారి తిలకించండి.

కొత్త పాళీ said...

పై అజ్ఞాత వ్యాఖ్య బొత్తిగా సందర్భశుద్ధి లేకుండా నిర్దయగా ఉంది.
@చక్రవర్తి, ధైర్యంగా ఉండండి. భగవంతునిపై నమ్మకం ఉంచండి.

Anonymous said...

నేనున్నాను. నన్ను గుర్తు తెచ్చుకోండి. మీ బాదలన్నీ ఉష్ కాకి ..

ఓ బ్రమ్మీ said...

శంకగిరి నారాయణ శర్మగారు,

స్పందించినందులకు నెనరులు. అజ్ఞాతలు ఏదో కెలుకుదాం అని ప్రయత్నిస్తున్నారు. అందుకే వివరణ ఇచ్చాను. సమర్దించినందులకు ధన్యవాదములు. మీకు చెప్పెంతటి పెద్దవాడిని కాదు కానీ, ఇది కలి యుగం కదండీ అందుకని భగవంతుని కన్నా మనపై మనకి నమ్మకం ఉండాలి అని నాకు ఓ పెద్దాయన చెప్పారు, అలా అని చెప్పని భగవంతుని మరచి పొమ్మనలేదు. అవసరానికి మాత్రమే గుర్తుకు తెచ్చుకోవద్దని మాత్రం చెప్పటంద్వారా ఎల్లవేళలా స్పరించుకోమని చెబుతూ.. మనపై మనకి విశ్వాసం ఉండాలి.. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి.. ఒప్పు చేసినా తప్పు చేసినా మనకి మనం సమాధానం చెప్పుకునే విధంగా ఉంటే, యముని దగ్గర పని చేసే చిత్రగుప్తుడు కూడా మనం చేసే పనులకు లెక్క చెప్పేటప్పుడు మనం ఏమి తప్పు చేసామో అర్దం అవుతుంది అని చెప్పారు. ఆ విధంగా నాకు ఎల్ల వేళలా భగవంతునిపై నమ్మకం ఉంది. ఏమైనా ఈ విషయం ద్వారా నాకు గురు సమానులైన వారిని స్మరించుకోవడం సంతోషంగా ఉంది. ఎక్కువ వ్రాస్తే మన్నించండి.

హరనాద్ గారు,
మీరు ఎల్ల వేళలా నాకు స్మరణలోనే ఉన్నారు. నేను మా అమ్మ అను నిత్యం మిమ్మల్ని పూజా సమయంలో స్పరించుకుంటాము. అయినా కొన్ని నిర్దాక్షిణ్య విషయాలు నన్ను ఆశాంతం కలచివేస్తుంటాయి. అలాంటప్పుడే మనోః ధైర్యాన్ని కూడదీసుకోవాలి, ఈ ఒక్కసారి మాత్రం నా వల్ల కాలేక పోయింది. అయినా ఇప్పుడు వాకే.. స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics