హైదరాబాద్ వాసులు సలహా ఇవ్వండి

అమెరికా ప్రయాణం నాకు అచ్చి రాలేదు. ఇప్పటికి రెండు సార్లు వెళాను. రెండు సార్లు నాకు హార్ట్ ఏటాక్ ఇచ్చింది. నా అమెరికా ప్రయాణ ఫలితాలగురించి మరోసారి వ్రాస్తాను. అప్పటిదాకా నా ప్రస్తుత భాధని పంచుకోండి.

నాకు పెళ్ళైన తరువాత మొదటిసారిగా మా మామగారు నా భార్యని కాపురానికి పంపించేటప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నందు అక్కడికే తీసుకు రమ్మన్నాను. అలా కాపురం పెట్టినప్పుడు మొట్ట మొదటి సారిగా విడిగా ఇల్లు తీసుకోవడం అవసరం అయ్యింది. అప్పటిదాకా బాచ్‍లర్లమే కదా అందుకని నలుగురు స్నేహితులు కలసి ఉండే వాళ్ళం. ఆ విషయాలు ఇప్పుడు అనవసరం. సరే పెళ్ళైంది కదా అని కాపురం నిమిత్తం ఇళ్ళు వెతకగా బేగంపేటలోని బ్రాహ్మణ వాడలోని ప్రస్తుతం ఉంటున్న అపార్ట్‍మెంట్ ఖాళీగా ఉన్నట్టు తెలిసి చూడాటానికి వెళ్ళగా.. అదిగో అప్పుడు తగిలింది మొదటి దెబ్బ.

అద్దె ఇళ్ళు చూపించే బ్రోకర్ వెధవేమో అద్దే ఐదువేలు రెండు నెలల అడ్వాన్స్ అని ఇల్లు చూపించాడు. ఓనరేమో అద్దె అయిదు వేల ఐదు వందలు మూడు నెలల అడ్వాన్స్ అలాగే అయిదువందల యాభై మైంటెనన్స్ అని చెప్పాడు. పరస్పర చర్చల తరువాత ఓనర్ చెప్పినట్టే చెయ్యాల్సి వచ్చింది. ఇక 2006 వ సంవత్సరంలో అక్టోబర్ రెండో తారీఖు రానే వచ్చింది. వస్తూ వస్తూ భార్యని తెచ్చింది. అలా మొదలైంది మా కాపురం.

అయిదు వేల అయిదు వందల అద్దెతో మొదలైన మా కాపురం ఈనాడు ఎనిమిదివేల అయిదు వందలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వచ్చే సమస్య ఏముంది. ఇదిగో అనుకోకుండా రెండోసారి అమెరికా ప్రయాణం. తిరిగి వచ్చిన తరువాత మా ఓనర్ చావు కబురు చల్లగా చెప్పాడు. మీరు అమెరికా వెళ్ళి వచ్చారుగా ఓ రెండు వేలు అద్దె పెంచండి. అలాగే ఏప్రియల్ నెల నుంచి ఎరియర్స్ కూడా ఇవ్వండి అని. అప్పుడు తెలిసింది ఇంటి అద్దె పెంచడానికి ఉన్న కారణం నేను అమెరికా వెళ్ళి రావడం అన్న మాట.

ఈ నెలాఖరులోగా నేను మరో ఇల్లు చూసుకోవాలి అన్న ప్రయత్నంలో మొదటగా మా సహోద్యోగులు ఉండే ప్రాంతం అయిన నిజాంపేట్ విలేజికి వెళ్ళి మొన్న శనివారం చూసి వచ్చాను. నిజాం పేట విలేజి రోడ్డు మీదకి దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కూడా అద్దెలు చుక్కలనంటుతున్నాయి. అలా ఈ వారాంతం అంతా రోడ్లు సర్వే చెయ్యడమే సరిపోయింది. అన్నట్లు చెప్పడం మరిచా.. రోడ్డుకి ఒకవైపున ఉన్న కూకట్ పల్లిలో చూడడమే కాకుండా మరో ప్రక్కన కూడా చూడడం జరిగింది. మలేషియా టౌన్‍షిప్ వెనకాల ప్రాంతం కూడా వెతకాను. ఎవ్వరూ తొమ్మిది వేలకు తక్కువ చెప్పటం లేదు.

అలాగే నిన్న కూకట్ పల్లి ప్రాంతలో తిరిగాను. అక్కడ కొన్ని పాత అపార్ట్‍మెంట్స్ ఎనిమిది వేలకు దరిదాపుల్లో ఉన్నా రోడ్డుకి కొంచం దూరంగా ఉన్నాయి. నాకు హితులైన మరో తెలుగు బ్లాగరు నాకు ఓ సలహ ఇచ్చారు. ప్రస్తుతం మీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ అంటున్నావు కాబట్టి, ఒకవేళ నువ్వు కనుక కూకట్ పల్లి లో ఇల్లు తీసుకుంటే ప్రయాణ భారం నీకు ఎక్కువౌతుంది. కాబట్టి నీకు యూసఫ్ గుడా కానీ, వెంగళరావు నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, మోతీ నగర్ పరిసర ప్రాంతాలైతే బాగుంటుంది అని విశ్లేషించారు. వారి విశ్లేషన కొంతవరకూ నాకు సబబుగానే అనిపించింది

అందు వల్లన హైదరాబాద్ లో ఉన్న సహ తెలుగు బ్లాగర్లకు మనవి. మీకు తెలిసిన ఏరియాలో ఏవైనా ఖాళీలు ఉన్న యెడల నాకు తెలియ జేయండి. నాకు ఉన్న ఒకే ఒక రిక్వైర్ మెంట్ ఏమిటంటే, జూబ్లిహిల్స్ లో ఉన్న మా ఆఫీస్ కు కొంచం దగ్గరా ఉంటే కొంచం సులువౌతుంది. అలాగే ఖర్చు ఎక్కువగా లేకుంటే బాగుంటుంది. ఈ పోస్టు ద్వారా మీ అమ్యూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసానని మీకు అనిపిస్తే, మన్నించండి. వీలైతే సమాచారాన్ని తెలియ జేయమనవి.

నన్ను మీరు 944 14 18 139 నందైనా సంప్రదించ వచ్చు లేదా varthy@gmail.com కు ఓ జాబు వ్రాయండి. భవదీయుడు వెంఠనే స్పందిస్తాడు. అంతవరకూ ఓపికగా చదివినందులకు నెనరులు.

15 స్పందనలు:

Anonymous said...

ఒరేయ్ బొడి భోషాణం,

నీకు ఏది బ్లాగాలో ఏది బ్లాగకూడదో తెలిసినట్టు లేదు. ఇందుకే చెప్పింది ముందు నీ మూతి కడుక్కోమని. తొక్కలో ఇల్లు దొరకకపోతే ఏదో ఏరియాకు వెళితే అక్కడ వంద మంది రెంటల్ బ్రొకర్స్ ఉంటారు వాడి మొహాన ఓ పదో పాతికో కొడితే వాడే చూసి పెడాతాడుగా (మాటైం వేస్టు చెయ్యకపోతే). ముందు అలాంటి బ్రొకర్స్ నీకు కావాల్సిన ఏరియాలో ఎంత మంది ఉన్నారో వెతకు అప్పుడు నీకు అన్ని తెలుస్తాయి. అంతే కాని ఇలాంటి చెత్త పోస్టులు ఇకపై వెయ్యకు. నీకు పుణ్యం ఉంటుంది.

Praveen Mandangi said...

BHEL-లింగంపల్లి సర్కిల్ కి దగ్గరలో శ్రీదేవి-శ్రీలత థియేటర్ల వెనుక అపార్ట్మెంట్లలో అద్దె 5500. మా బాబాయ్ గారు అక్కడే ఉంటున్నారు. ఖైరతాబాద్ లో అద్దె 13000 అని లింగంపల్లి దగ్గర అద్దెకి దిగారు. లొకేషన్ నుంచి లింగంపల్లి MMTS స్టేషన్ కి సులభంగా చేరుకోవచ్చు.

Praveen Mandangi said...

లింగంపల్లిలో ఇల్లు తీసుకున్నా నాంపల్లి స్టేషన్ వరకు MMTS ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి బస్ లో జూబ్లీ హిల్స్ వెళ్లొచ్చు. అద్దె ముందు దూరం ఒక లెక్క కాదు.

ఓ బ్రమ్మీ said...

అనామకులుంగారు,

మొట్టమొదటగా మీరు హద్దు మీరి స్పందిస్తున్నారు. చెప్పదలచుకున్నది సున్నితంగా మరో విధంగా కూడా చెప్పొచ్చు. ఏమైనా స్పందించినందులకు నెనరులు.

ప్రవీణ్ శర్మ గారు,
నిజమేనండి. ఈ పద్దతేదో బాగున్నట్టుంది. కాకపోతే ఒక్క విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను. అది బండి పార్కింగ్ గురించి. అది సాల్వ్ అయిపోతే నేను అదే పని చేస్తాను. సలహాకు ధన్యవాదములు

Praveen Mandangi said...

స్టేషన్ దగ్గర బండి పార్కింగ్ గురించా? లింగంపల్లి స్టేషన్ దగ్గర పార్కింగ్ స్టాండ్ ఉంది.

ఓ బ్రమ్మీ said...

ప్రవీణ్ శర్మ గారు,

నేను బేగంపేట దగ్గరి పార్కింగ్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ పార్కింగ్ ఎలా ఉందో నాకు తెలుసు, అక్కడి బండ్లు ఎండకి ఎండుతాయి అలాగే వానకి తడుస్తాయి. వాటికి కాపలా ఎవ్వరూ లేరు. అదీ నాభాద.

Praveen Mandangi said...

లింగంపల్లి స్టేషన్ 6వ ప్లాట్ ఫార్మ్ ఎంట్రెన్స్ దగ్గర షెడ్ ఉంది. అక్కడ పార్కింగ్ ప్రోబ్లెం కాదు.

oremuna said...

ఇదో వృధా ప్రయాస. బ్లాగులు ఇంకా అంత డవలప్ అవ్వలేదు. వెనకటికి నేనూ ఇలానే పెట్టాను ఒక టపా మూడేండ్ల క్రింద. శూన్య రెస్పాన్స్.

అనామకా,

పదో పాతికో తీసుకునే బ్రోకర్లు కూడా ఉన్నారా?

venkata subbarao kavuri said...

ఈ విధంగా విస్త్రుత విషయాలు చర్చకు రావాలి. ఉపయోగం ఎంతన్నది తర్వాత విషయం. కచ్చితంగా కొత్త విషయాలు తెలుస్తాయి.
వెంకట సుబ్బారావు కావూరి
తెలుగిల్లు

Anonymous said...

Mehdipatnam or tolichowki try cheyandi..

ఓ బ్రమ్మీ said...

ప్రవీణ్ శర్మ గారు,
చూసి వస్తాను. కాన్‍స్టేంట్ గా స్పందిస్తు సహకరిస్తున్నందులకు నెనరులు.

కిరణ్ గారు,
మీరు ఇందులో కూడా ముందే ఉన్నారా.. హతవిధీ.. ఏమైనా నేను తెలుగులో వ్రాయడానికి కారణాలు వెతుక్కుంటున్నాను కావున ఇది నాకు ఒక రకమైన ఎక్సర్‍సైజ్ అనుకోండి. అప్పటికి ఇప్పటికి తెలుగులో స్పందించే వారు పెరిగారని నా అభిప్రాయం. మరో మూడేళైతే గాని మంచి స్పందన రాదేమో. ఏమైనా స్పందించి నందులకు నెనరులు. ఇక అనామికల సంగతి మీకు తెలియనిదా!!

కావురి వారికి,
నమస్కారములతో, చర్చకు వచ్చినంత మాత్రాన సరిపోదండి. ఇంటి ఓనర్లు ఎంత నిర్దయగా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారో తెలిసుకుంటే చాలు. అయినా తప్పులో మొత్తం వారిదే అని అనలేం, ప్రతి ఇంట్లోనూ ఇద్దరిద్దరు జీతగాళ్ళు ఉండటం కూడా కొన్ని సార్లు ఇలా ఓనర్ల ధన ధాహాన్ని పెంచుతూ ఉండవచ్చు. స్పందించినందులకు నెనరులు.

రెండవ అజ్ఞాత గారు,
నిజమే సుమా.. ఈ వారాంతం ఆ ప్రాంతం కూడా ఓ రౌండ్ వేసి వస్తా. సలహాకు ధన్యవాదములు

Anonymous said...

Rajeev Nagar/Mothi Nagar lo minimum 9000 pettandi double bed room radu. Kani Mothinagar extension lo vetakochu

ఓ బ్రమ్మీ said...

మూడో అజ్ఞాత గారు,

మోతీనగర్ లో చూద్దాం అనుకున్నాను. అలా అయితే, నేను మీరు చెప్పిన చోట చూస్తాను. సలహాకు ధన్యవాదములు

బాలు said...

చక్రవర్తిగారూ మేం ఉండేది మూసాపేట్ ఏరియాలో, ఇక్కణ్నుంచి హైటెక్ సిటీ 8కి.మీ. అనుకుంటా. సరిగ్గా 20నిమిషాల్లో హైటెక్ సిటీ దగ్గరకు చేరుకోవచ్చు. అక్కణ్నుంచి మీ ఆఫీసుకు ఎంత టైమ్ పడుతుందో కాలుక్యులేట్ చేసుకుని ఓకే అనుకుంటే ఈ ఏరియాలో తీసుకోవచ్చు. మోతీనగర్ ఏరియాలోనూ 8,9 వేలల్లో దొరకొచ్చు. ఆల్ ది బెస్ట్.

ఓ బ్రమ్మీ said...

బాలుగారు,

బాగుందండి. మీ సలహా ఏదో నాకు సులువుగా ఉన్నట్టుంది. ఈ ఆది వారం ఆ ఏరియాలో ఓ లుక్కేస్తా. సకాలంలో స్పందించినందులకు నెనరులు.

 
Clicky Web Analytics