ఇవ్వాళ అనాలోచితంగా నా మైల్ ఐడీ ఎక్కౌంట్ వివరాలు వెతుకుతుంటే, ఓ విషయం నన్ను ఆశ్చర్యపరచింది. అది ఏమిటంటే, నా మొదటి మైల్ ఐడీ సృష్టించుకుని పుష్కరం దాటిందని. సరిగ్గా అదే సంవత్సరంలో అంటే, 1998లో అన్నమాట హాట్‍మైల్‍ని మైక్రోసాఫ్ట్ కొనేసింది. 1998 వ సంవత్సరం జనవరి ఒకటవ తారీకు నుంచి హాట్‍మైల్ మైక్రోసాఫ్ట్ వారి సొంతం అయ్యింది.
జాలాన్ని అప్పట్లో ఇంత బాగా వాడేవారు కాదు. ఒకవేళ వాడినా డైల్‍అప్ చేసుకుని కనక్షన్ చేసుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్లకు వెళితే, గంటకు అరవై రూపాయలు తీసుకుని మనకోసం డైల్‍అప్ చేసి ఇచ్చేవాడు. అలా అద్దెకు తీసుకున్న లైన్లోంచి మళ్ళీ కొంత బాండ్ విడ్త్ దొంగతనం జరిగేది. అదేనండి ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ కూడా వాడుకునే వాడు కదా, అలా అన్న మాట.
ఇదేదో హంబక్ అనుకుంటున్నారా.. అక్కడే పొరపడ్డారు. ఇదిగో సాక్ష్యం. మరి మీ మొట్టమొదటి మైల్ ఐడీ ఎప్పటిది అని ఒక్కసారి చూసుకోండి.
దీనికి తోడుగా మరో మైల్ ఐడీ ఉండేది. అది ఫస్ట్ క్లాస్ మైల్ అనేటాగ్ లైన్‍తో మైల్ ఎక్కౌంట్స్ ఇచ్చిన FCMail వారి వద్ద. ఇప్పుడు ఆ డొమైన్ తీసేసారు. మరి మీ మొదటి మైల్ ఐడీ ఎప్పటిదో నాకు తెలియజేయండి లేదా మీ బ్లాగులో పెట్టుకొండి
6 స్పందనలు:
ఆ ఇన్ఫో చూడటం ఎలా?
మొదటి మైల్ ఐడీ ఎదైతే ఏంటి? మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పన్నయ్యా?
హరనాద్ గారు,
ఇన్‍బాక్స్ లోపలికి వెళ్ళిన తరువాత టాప్ రైట్ హాండ్ సైడ్ చూడండి. అక్కడ ఆప్షన్స్ అని వస్తుంది. దానిలో మోర్ ఆప్షన్స్ కి వెళితే అక్కడ మానేజింగ్ యువర్ ఎక్కౌంట్ అనే శీర్షికన క్రింద ఎక్కౌంట్ డీటైల్స్ అని ఓ లంకె ఉంటుంది, తద్వారా మీరు అక్కడికి వెళ్ళవచ్చు.
పారదర్శి గారు,
హన్నన్న ఎంత పెద్ద ప్రశ్న వేశారు? తప్పు తప్పు.. ఆ విషయాలు ఇలా మనం పబ్లిక్గా మాట్లాడుకోకూడదు. నా భార్య చదివిందనుకోండి, నా బ్రతుకు కోఠీ లేదా ఇమ్లీబన్ పాలే. మనం ఆ విషయాలను ప్రవేట్ గా మాట్లాడుకుందాం. వాకే?
Is this works only for Hotmail?
Anonymous,
Yes, the mentioned steps works only for Hotmail. Am not sure about other mail providers.
Oh.. OK.. Thanks for the Info.
Post a Comment