సృజనాత్మకత ఎక్కడ లేదు?

IMG_0043

అప్పుడెప్పుడో వెంకటేష్ గారి సినిమాలో హీరోయిన్ చేసింది అని విన్నాను ఇదిగో ఇవ్వాళ్ళ అనుభవిస్తున్నాను. పైన శీర్షికకి ఇక్కడ వ్రాసిన మొదటి వాక్యానికి పొంతన లేదనుకుంటున్నారా? పైన చిత్రంలో కనబడుతున్నవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

చదివే వారికి ఓ క్లూ కూడా ఇచ్చేసాను. వెంకటేష్ చేసిన సినిమాలలో స్నేహం అనే ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమాలోని హీరోయిన్ చద్దన్నం పారేయ్యకుండా పిండి ఒడియాలు చేస్తుంది. అదిగో అలాగునే మా అమ్మ ఇవ్వాళ్ళ మధ్యాహ్నం వేళకి ఓ ఫలహారం చేసింది. ఏమిటో అనుకుంటే, ఇదిగో ఇలా పకోడీలు వచ్చాయి. పకోడీలు శనగపిండితో చేస్తారు కదా వద్దులే నేను తినను కాలికి చీము పడుతుందేమో అని దాటేయ్యబోతే, ఒరేయ్ భడవాయ్ ఇవి శనగపిండి పకోడీలు కాదు, ఇందాక మనం తిన్న తరువాత మిగిలిన అన్నాని ముద్ద చేసి ఇలా వేయించాను అని నెత్తిమీద ఓ మొట్టికాయ్ వేసింది.

నిజం చెప్పొలంటే, మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ వంట మాత్రం బాగానే చేస్తుంది. క్రొత్తగా ఏదైనా చేసే విషయాన్ని సృజనాత్మకత అని అంటే, మా అమ్మ లాంటి వారిని చూచిన తరువాత సృజనాత్మకత ఎక్కడ లేదు అనిపిస్తుంది. కాకపోతే చెయ్యాలి అన్న ఆలోచన రావడమే ముఖ్యం.

8 స్పందనలు:

Anonymous said...

enti mee ammagaaru rayadam manesaru? appudeppudo imtiki vaste lunch pedatanannau, appatinunci tappichukini tirugutunnaru. mallee intakanaka?

చక్రవర్తి said...

అఙ్ఞతగారు,

మున్ముందుగా స్పందించి నందులకు ధన్యవాదములు. మా అమ్మ చెబుతోందేమిటంటే, అప్పడెప్పుడో చెప్పిన విషయాన్ని ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నందులకు చాలా చాలా ధాంక్స్. మీలాంటి వారే మహిళలను ప్రోత్సహించేది. అది సరే కాని ఎప్పుడు వస్తారో చెప్పమంటోంది మా అమ్మ. వచ్చేటప్పుడు ఓ వారం రోజులు ఉండేటట్టు రమ్మని చెబుతోంది. వివరం తెలియజేయండి

జయ said...

అన్నం తోటి పకోడీలా, భలే ఉందే. మంచి ఐడియా. నేనూ ట్రై చేస్తాను. థాంక్యూ.

చక్రవర్తి said...

జయ గారు,

స్పందించినందులకు నెనరులు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఒకవేళ కుదరకపోతే, మా అమ్మ మైల్ ఐడీకి వ్రాయండి వివరం తెలియజేస్తుంది. మా అమ్మ మైల్ ఐడీ, maanikyamba@gmail.com

VJ said...

aa pakodini aa photo lo unaa vaaru thintu nattu undi choosaaraa

చక్రవర్తి said...

VJ గారు,

ఇది కూడా సృజనాత్మకంగా చూడడమే సుమా.. భలే చెప్పారు. స్పందించి మీ వివరాన్ని తెలియజేసినందులకు నెనరులు

కొత్త పాళీ said...

True. Our elders had great creativity in preventing waste.

చక్రవర్తి said...

నిజం చెప్పారండి. ఒక్కోసారి, కాదేది కవితకనర్హం అన్న రీతిలో ఉంటాయి మా అమ్మ చేసే వంటకాలు. ఒక్క మా అమ్మేకాదు సుమా, నాకు తెలిసిన పెద్ద వాళ్ళంతా. ఉదాహరణాకి బీరకాయి తొక్కుని కూడా వదిలేవారు కాదంటే నమ్ముతారా? స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు.

 
Clicky Web Analytics