స్టీవ్ జాబ్స్ – ఆపిల్ సంస్థ మూలం

స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు. ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి, బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.

steve_jobs

నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ. అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా. ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే. అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం. ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని కారణాలలో మొదటిది ఏమిటంటే..

.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి, అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.

ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా, ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా, నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు, కలలు కనండి, కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ, సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.

వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట) ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు. ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.

నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు. అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు. అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.

దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి. అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే, IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే, IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.

అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత వ్యాపారం తోడైంది.

ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి (అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే బుఱ ఇకలేదు. ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి

4 స్పందనలు:

Anonymous said...

Steve jobs and Bill Gates worked for IBM? LOL, Great stuff!!

చక్రవర్తి said...

అయ్యా అఙ్ఞాత గారు,

వివరం తెలియక పోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అంతే కాని ఇలా అపహాస్యానికి గురి అవ్వకండి. మీకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీకు వివరం తెలుసుకోవాలనుకుంటే, ఓ విషయం చెబుతాను. వాటి గురించి కొంచం కూలంకుషంగా పరిశోదించండి.

మనం ప్రస్తుతం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం అన్నీ 8086 మైక్రో ప్రోసెసర్ ఆధారంగా రూపుదిద్దుకున్నవే. అంటే IBM కంప్యూటర్స్ మదర్ బోర్డ్స్ అన్నీ 8086 ఆర్కిటెక్ట్చర్ ఆధారంగా చెయ్యబడినవి. మరి మాక్ కంప్యూటర్స్ యొక్క ఆధారిత ఆర్కిటెక్ట్చర్ దేని ఆధారంగా తయారు చెయ్యబడినద్?

అలాగే ప్రస్తుతం వాడుకలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం మూలం MS-DOS, అలాగే PC-DOS అనేది IBM వారు ప్రతిపాదించిన మఱో ఆపరేటింగ్ సిస్టం. రెండు ఆపరేటింగ్స్ మధ్య తేడా ఏమిటి? ఇది ఎలా జరిగింది?

వీటి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోండి. అప్పుడు విషయాలు మీకు అర్దం అవుతాయి. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

Mauli said...

:( ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకు౦టున్నాను

Anonymous said...

The previous anonymous comment was correct. Jobs never worked for IBM only he partnered strategically with IBM. Here is life chronicle of Jobs

http://gizmodo.com/5301470/the-life-of-steve-jobs-+-so-far

 
Clicky Web Analytics