గాయం 2 సినిమా మాతృక

జగపతి బాబు చాలా కాలం క్రిందట చేసిన సినిమా గాయం-2 సినిమా మొదటి సినిమా యొక్క సీక్వెల్ అని అనుకున్న వాళ్ళల్లో నేనూ ఉన్నాను. కానీ నిజం ఏమిటంటే, ఇది ఓ ఆంగ్ల సినిమా కాపీ అన్న విషయం, ఇవ్వాళ నాకు తెలిసింది. A History of Violence అనే ఆంగ్ల సినిమా నుంచి చాలా భాగం మక్కీకి మక్కీగా తీయ్యటం నాకు ఎందుకో మింగుడు పడలేదు. అందునా రామ్ గోపాల్ వర్మ వంటి వ్యక్తి పేరుతో ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఓ ఆంగ్ల మాతృక అనే చేదు నిజం నాకు గొంతులో పడ్డ వెలక్కాయ అయ్యింది. ఇది నాకు కొత్త విషయం, చాలా మందికి ఇది పాత విషయం అయ్యుండవచ్చు. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కాపీలు కొడతాడని నేననుకోలేదు.

పురుష రాగములు

ఏదైనా పాటగానీ కీర్తనగానీ విన్నామనుకోండి ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఆలోచన కలుగుతుంది. అలాంటిది ఓ సంగీత విధ్వాంశునికి ఏదైనా రాగమును వినిపించామనుకోండి, ముందుగా వారు ఆలోచించేది ఏమిటో తెలుసా??

బహుసా నేను అనుకునేది తప్పు అవ్వవచ్చు, కానీ నేను ఊహించినంత వరకూ, నా శ్రుతార్ధమేమిటంటే.. వీరు విన్న పాట యొక్క రాగమేమిటి? ఆ రాగ లక్షణాలు ఎమిటి? ఆరోహణ అవరోహణ ఏమై ఉంటుంది? వంటి వివరాల గురించి ఆలోచిస్తారని అనుకుంటాను. కాబట్టి ప్రతీ పాట ఏదో ఒక రాగయుక్తమై ఉంటుంది. ప్రతీ రాగానికి ఒక్కొరకమైన తాళగతి ఉంటుంది. ప్రతీ తాళగతికీ ఒక్కొక రీతి ఉంటుంది.

రాగములన్నింటినీ రెండు విధములుగా చెప్పుకోవచ్చు. వాటి స్వభావాన్ని ప్రాతిపదికగా చేసుకుని వాటిని లాలిత్యము / సాత్వికమైన స్వభావము కలిగిన రాగములు మరియు గంభీర / ఉదృతమైన స్వభావములు కలిగినవిగా మనము అనుకోవచ్చు. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి.  సంగీత ప్రపంచలో విద్వత్ ఉన్న వాళ్ళలో కొంతమంది ఇలాంటి క్లాసిఫికేషన్ మంచి పద్దతి కాదు అని చెబుతూ కొంతమంది చరిత్రకారులు ముప్పది రెండు నపుంశక రాగాలు కూడా ఉన్నాయని చెప్పినట్టు ప్రస్థావిస్తారు. మరి కొంత మంది నారుదుని రాగావిభాగం ప్రకారం కూడా ఇలాంటి మూడు విభజనల ప్రస్థావన ఉంది అని ఘంటా పధంగా చెబుతారు. ఇలా విభజించడం అనే విషయమై మరోసారి ఆలోచిస్తాను అప్పటిదాకా గంభీర / ఉదృతమైన స్వభావము కలిగినటు వంటి రాగములను పురుష రాగములు అని అంటారు అనే ప్రాతిపాధికను నేను అంగీకరిస్తూ...

ఇలాంటి పురుష రాగాలు ఎన్ని అంటే.. అవి ఎనిమిది రకాలని ఈ మధ్య చదువుకున్నాను. అవి ఈ క్రింద చెప్పినట్టు..

భైరవి మాళవి బంగాళ హిందోళ రాజమంజరియు శ్రీరాగగౌళభూపాల లెన్మిది పురుషరాగంబులు

అంటే అవి ఈ క్రింది చెప్పిన క్రమంలో

భైరవి రాగం -

మాళవి రాగం -

బంగాళ రాగం -

హిందోళ రాగం – సామజ వరగమన ..

రాజ మంజరి రాగం -

శ్రీరాగం – ఎందరో మహాను భావులు ..

గౌళ రాగం – దుడుకూ గల నిన్నే జేరి..

ఇలాంటివి కాకుండా వీటికి భార్యారాగాలు కూడా ఉంటాయి. అంతే కాకుండా వీటికి అనునయంగా పుత్ర రాగాలు కూడా ఉన్నాయని గ్రంధాలు చెబుతాయి. వీటి గురించి మరోసారి ఆలోచిస్తాను .. అంతవరకూ ఇంతే సంగతులు

నా గురించి : about.me

” అంటూ ఒక ఉచిత సౌలభ్యాన్ని అనే వెబ్ సైట్ వారు అందుబాటులోకి తీసుకు వచ్చారు. నేను ఒక సైట్ తయారు చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇది బాగుంది. వీలైతే చదివే వారు ఉపయోగించుకోండి. ఈ సౌలభ్యంలో నాకు నచ్చిన మరియు నా సలహాలు ఈ క్రింది విధంగా..

నచ్చిన విషయాలు:

1) చక్కగా మనకు నచ్చిన చిత్రాన్ని మన సైట్ నందు ఉంచుకోవచ్చు

2) మనకు ఉన్న వివిధ బ్లాగులను ఒక చోట చేర్చి చూపించ వచ్చు

3) ట్వీటర్ ట్వీట్స్ మరియు మరికొన్ని ఇతర ఉపకరణాలలో నా క్రియలు ఇక్కడ నుంచే చూడవచ్చు

 

నా సలహాలు

1) ప్రస్తుతానికి వీరు ఒక బ్లాగర్ ఎక్కౌంట్ మాత్రమే కలుపుకోవడానికి అనుమతినిస్తున్నారు. నాకు తెలుగు బ్లాగులు రెండు ఉన్నందున, ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు కలుపుకునే విధానం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం

2) మనం అప్‍లోడ్ చేసుకున్న చిత్రాన్ని మన సైట్ నందు అయితే మధ్యస్తమంగా (center) ఉంచుకోవచ్చు లేదా అంతటా పరచేవిధంగా (tile) చేసుకునే వీలు ఉంది. అంతే కానీ కుడి చేతి వైపునకో లేదా ఎడమ చేతి వైపునకు ఎడ్జెస్ట్ చేసుకునే అవకాశం లేదు.

ప్రస్తుతానికి ఇక్కడితో ఆపుతూ మిగిలిన విషయాలను మీరు తెలుసుకోండి

బాలయ్య సినిమాకి నేను వ్రాసే పంచ్ డైలాగ్

ఈ మధ్య బాలయ్య తీస్తున్న కొత్త సినిమాకి నాకు డైలాగ్స్ వ్రాసే అవకాసం వచ్చింది. పనిలో పనిగా ఓ పది డైలాగ్స్ బాలయ్యకు వినిపించడం జరిగింది. వాటిలో ఈ క్రింద చెప్పినది బాలయ్యకు బాగా నచ్చింది. కాబట్టి ముందుగా మీకు లీక్ చేస్తున్నా, ష్.. ఎవ్వరికీ చెప్పొద్దు. సినిమా కధ ఇంకా చర్చల్లో ఉంది, కధ ఏదైతేనేం, ఆఖర్లో డైలాగ్స్ వ్రాసేది నేనేగా.

నువ్వు ఒక్కడివే రా, ఒక్కొక్కడ్ని పెంచుకుంటురా, ఒక్కొక్క సారిగా రా, వచ్చిన ఒక్కొసారి ఒక్కోదెబ్బతో నేనొక్కడ్నే ఒక్కటిస్తా ఒక్కొక్కడూ వందౌతాడు

మొదటి మైల్ ఐడీ వివరాలు

ఇవ్వాళ అనాలోచితంగా నా మైల్ ఐడీ ఎక్కౌంట్ వివరాలు వెతుకుతుంటే, ఓ విషయం నన్ను ఆశ్చర్యపరచింది. అది ఏమిటంటే, నా మొదటి మైల్ ఐడీ సృష్టించుకుని పుష్కరం దాటిందని. సరిగ్గా అదే సంవత్సరంలో అంటే, 1998లో అన్నమాట హాట్‍మైల్‍ని మైక్రోసాఫ్ట్ కొనేసింది. 1998 వ సంవత్సరం జనవరి ఒకటవ తారీకు నుంచి హాట్‍మైల్ మైక్రోసాఫ్ట్ వారి సొంతం అయ్యింది.

జాలాన్ని అప్పట్లో ఇంత బాగా వాడేవారు కాదు. ఒకవేళ వాడినా డైల్‍అప్ చేసుకుని కనక్షన్ చేసుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్లకు వెళితే, గంటకు అరవై రూపాయలు తీసుకుని మనకోసం డైల్‍అప్ చేసి ఇచ్చేవాడు. అలా అద్దెకు తీసుకున్న లైన్లోంచి మళ్ళీ కొంత బాండ్ విడ్త్ దొంగతనం జరిగేది. అదేనండి ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ కూడా వాడుకునే వాడు కదా, అలా అన్న మాట.

ఇదేదో హంబక్ అనుకుంటున్నారా.. అక్కడే పొరపడ్డారు. ఇదిగో సాక్ష్యం. మరి మీ మొట్టమొదటి మైల్ ఐడీ ఎప్పటిది అని ఒక్కసారి చూసుకోండి.

image

దీనికి తోడుగా మరో మైల్ ఐడీ ఉండేది. అది ఫస్ట్ క్లాస్ మైల్ అనేటాగ్ లైన్‍తో మైల్ ఎక్కౌంట్స్ ఇచ్చిన FCMail వారి వద్ద. ఇప్పుడు ఆ డొమైన్ తీసేసారు. మరి మీ మొదటి మైల్ ఐడీ ఎప్పటిదో నాకు తెలియజేయండి లేదా మీ బ్లాగులో పెట్టుకొండి

 
Clicky Web Analytics