శీమ సింతకాయలు



ఇవాళ ఉదయం సప్తగిరి స్టూడియోకి వెళ్ళి వస్తూ ఉంటే దారిలో ఇవిగో ఇవి కనబడ్డాయి. మేము వీటిల్ని శీమ సింత కాయలు అంటాము. ఇంతకీ ఇవి “సింతకాయలా” లేక “చింతకాయలా”!!

ఏదో ప్రజల నోట్లో పడి వ్యవహారిక భాషలో అవి సింతకాయలయ్యాయా??

ఏది ఏమైనా నేను వీటిల్ని చాలా రోజుల తరువాత!!! కాదు కాదు చాలా సంవత్సరాల తరువాత తింటున్నాను. అందునా కొనుక్కుని మరీ తింటున్నాను. ఈ మాట వ్రాసినప్పుడు చాలా బాధ వేసింది. అంటే నా ఉద్దేశ్యం డబ్బులు ఖర్చు పెట్టాను అని కాదు కానీ, ఊరికే దొరికె వస్తువుని అందునా.. ఎటువంటి శ్రధ లేకపొయినా చెట్టుకు కాసేదానిని కొనుక్కుని తినె పరిస్థితి వచ్చినందులకు.

నాకు ఇప్పటికీ గుర్తు, విజయవాడలో ఏకేటీపీ హైస్కూల్ ఆవరణలో ఈ చెట్టు ఇరగ కాసేది. సాయాంత్రం వేళ్ళల్లొ బడి నుంచి తిరిగి వస్తూ.. ఎంచక్కా మేము ఆ గ్రౌండులో కబడ్డి ఆడుకుని పోతు పొతూ చేతికి చిక్కినన్ని కోసుకుని జేబులొ పట్టినన్ని కుక్కుకుని గ్రంధాలయం ఎదురుగా ఉన్న పార్కు పంపులో మంచి నీళ్ళు త్రాగి ఇంటికీ చేరుకునే వాళ్ళం. ఇదిగొ సరిగ్గా అప్పుడే మా అమ్మ ఓ గుడ్డు పెద్ద గ్లాసు నిండా బోర్నవీటా ఇచ్చేది. అప్పటికే  కడుపు నీండి ఉండడం వల్ల ఏవేవో సాకులుచె ప్పి తప్పీంచు కునే ప్రయత్నంలో మా వీపులు రామకిర్తనలు పాడేవి.

ఎలా కని పెట్టేదొ ఏమో కానీ మా అమ్మ అసలు విషయాన్ని కనిపెట్టెది. అంతే “అబద్దం  చెబుతార్రా!!” అంటూ మరో విడత మ్రోగించెది. ఇంతకీ ఇవి తినడం వలనఏ వైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటె.. ఏమో.. నా దగ్గర సమాధానం లేదు.

చదివే చదువరులలో ఎవ్వరికైనా వీటి ఉపయోగాలు ఏవైనా తెలిసి ఉన్నట్లైతే తెలియ జెయగలరు.

7 స్పందనలు:

Anonymous said...

సీమ చింతకాయలు
చిన్నప్పుడు పొలం లో కోసు కొని తినే వాడిని .వాతిమిద ఇస్తం తో ఇప్పతికీ విజయవద లో కొన్నుక్కుని తింటాను.

Anonymous said...

సీమ చింతకాయలు అని అంటారు. రుచిగా ఉండటమే కాక సి విటమిన్ ఉంటుందని అంటారు.
మంచినీళ్ళే కొనుక్కొనే రోజుల్లో ఇవి కొనుక్కోవడంలో వింత ఏముంది.
నా చిన్నప్పుడు హైదరాబాదులో బొప్పాయి పండ్లు అమ్మటం చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు అన్నిచోట్లా అమ్ముతున్నారు.

kiraN said...

నాక్కూడా ఇవంటే ఇష్టమే..
నాకు తెలిసి నేనెప్పుడూ వీటిని కొనుక్కుని తినలేదు..
అలా తినాల్సి వస్తే నా దౌర్భాగ్యంగా సరిపెట్టుకుంటాను.

కాలేజీలో ఒకసారి కోసుకుని తింటుంటే ఎవడో వచ్చి కోయకూడదు అని గొడవ పెట్టాడు. ఎం చేస్కుంటావో చేస్కోమని నేను కూడా గొడవ పడ్డాను కోయడం ఆపకుండానే..

- కిరణ్
ఐతే OK

Anonymous said...

మీరు విజయవాడ సత్యనారాయణపురం ఏకెటిపి స్కూల్లో చదివారా. 10త్ క్లాసు మీరు ఏ బ్యాచ్,ఎప్పుడు- నేను 1983, బ్యాచ్, హెచ్.ఎం. నాగేశ్వరరావుగారు, తర్వాత శెట్టి గారు. రాజు మాష్చారు, రామారావుగారు, కొన్ని పేర్లు గుర్తుకు రావట్లేదు.

ఓ బ్రమ్మీ said...

అయ్యా జర్నలిస్టు గారు,

లేదండి నేను ఏకేటీపీ కాదు, నాది ఎస్‍కేపీవివి హిందూ హైస్కూల్. కాకపోతే మేము ఆ రోజుల్లో సత్యన్నారాయణ పురంలో ఉండే వాళ్ళము అందువల్ల అక్కడ ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళము. అంతే తప్ప నాకు ఏమీ తెలియవు, మా అన్నయ 84 బ్యాచ్. అన్నయ్యకు తెలిసి ఉండ వచ్చు. చెబుతాను.
స్పందించినందులకు నెనరులు.

Mauli said...

చీమ చింతకాయలు కదా అండి :)

మన ఇంట్లో పెంచే చెట్టు కాదు కదా,అలానే చుట్టుపక్కల నుండి కూడా ఈ చెట్లు వెళ్లి పొయ్యాయి.

ఓ బ్రమ్మీ said...

మౌళి గారు,
నిజమేనండి. స్పందించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందులకు నెనరులు

 
Clicky Web Analytics