తెరాసా వారి దృష్టిలో బతుకమ్మ బొమ్మ మాత్రమేనా

ఈ మధ్య తెరాసా వారు కొటి బతుకమ్మ పూజలు చెసినట్టు మా అఫీసులో ఓ ఇద్దరు మాటాడుకుంటుంటే ఏమిటదా అని ఆసక్తికలిగి అటువైపు చెవ్వి సారించి ఆలకించిన పిదప నా భావనని ఇదిగో ఇక్కడ యధాతధంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది తెరాసా వారికి నచ్చకపోతే అది వారి దురదృష్టం.

ఎవ్వరో ఏదో చేసారని మనం కూడా చేద్దాం అని ప్రయత్నిస్తే అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంటుంది. అదే విధంగా తెరాసా వారు మేము ఉన్నాం అని తెలియ జేయ్యాలన్నట్టు ఏమి చెయ్యాలో తెలియక ఏదో చేద్దాం అని పూనుకుని మొదలు పెట్టినదే ఈ కోటి బతుకమ్మల పూజలు. నాకు వీరి ప్రయత్నం అసందర్బంగాను అనుచితంగాను అనిపించింది.

నేను బేగంపేటలో దాదాపు ఓ పదేళ్ళకు పైగా నివశిస్తున్నాను. ప్రతీ సంవత్సరం ఇక్కడ ఉన్న బస్తీ వాసులు బతుకమ్మ పండుగ దినాలలో ఎన్నెన్ని కలశాలు నెత్తిన పెట్టుకుని ఫ్లైఓవర్ ప్రక్కనే ఉన్న గుడికి వెళతారో నాకు బాగా తెలుసు. కానీ ఈ సారి తెరాసా వారికి భయపడ్డారా అన్నట్లుగా చాలా తక్కువమంది బహిరంగంగా గుడికి వెళ్ళి వచ్చారు. ఈ పదేళ్ళలో ఇంత తక్కువ మొత్తంలో జనాలు బతుకమ్మని జరుపుకున్న వైనం అక్కడి పూజారులకు కూడా మింగుడు పడలేదు. దీనంతటికీ తెరాసా వారు ఈ పండుగని రాజకీయ్యం చెయ్యడమే కాకుండా వారే భాద్యులని మరోలా చెప్పనక్కర లేదు.

అంతే కాకుండా, పెద్దపెద్ద రహ దారుల కూడలిలో పెద్ద గంపని బోర్లా పెట్టి దాని చుట్టూ ప్లాస్టిక్ పూలు తగిలించి మేము కోటి బతుకమ్మలు జరిపాం అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా చెయ్యడం ఎంతో భక్తితో మరెంతో శ్రద్దతో బతుకమ్మ పూజలు చేసే వారి మర్యాదని మంట కలిపిన్నట్టైంది. రాజకీయనాయకుల విగ్రహాలకు కనీసం ఒక్కసారైనా పూజాదికార్యక్రమాలు చెయ్యక పోయినా కనీసం పూల దండ అయినా వేస్తారు, కానీ తెరాసా వారు స్థాపించిన బతుకమ్మ రూపాలను పట్టించుకున్న నాధుడు లేడు. ఇలా ప్రవర్తించడం వీరు బతుకమ్మని ఒఠి బొమ్మగా మాత్రమే భావిస్తున్నారని చెప్పకనే చెబుతున్నారు, మన తెరాసా నాయకులు.

శవరాజకీయ్యాలను చూసాం కానీ దేవుడితో రాజకీయ్యం చెయ్యడం ఒక్క తెరాసా వారికి మాత్రమే చెల్లింది. నా దృష్టిలో తెరాసా వారికి గౌరవించడం ఎలాగూ చేతకాదు దానికి తోడు అగౌరవపరచడం మాత్రం బ్రహ్మాండం బద్దలైయ్యేటట్టు తెలుసు.

ఆఖరిగా తెలంగాణా వారికి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి తలచుకోండి..

22 స్పందనలు:

venkata subbarao kavuri said...

ప్లాస్టిక్ పూలు తగిలించి ha ha ha ha ha hahahahahahaaaaaa

ఓ బ్రమ్మీ said...

కావూరి వారు,

నిజ్జంగానండి, నాకు ఆ ప్లాస్టిక్ పూలు చూసిన తరువాత ఎంత భాధ కలిగిందో మీకు అర్దం కాదు.కొంతకాలం కనబడాలి కాబట్టి అలా ప్లాస్టిక్ పూలు తగిలించడంలో తప్పు లేదు కానీ పూజించడానికి బదులు నిర్లక్ష్యంగా వదిలేయ్యడం చాలా భాధగా ఉంది అలాగే వీరు చేస్తున్న అపహాస్యాన్ని అడ్డుకునే నాధుడు లేడని వీరు ప్రవర్తిస్తున్న తీరు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఏది ఏమైనా స్పందించినందులకు నెనరులు

Unknown said...

బాబూ, బ్రతుకమ్మ పండుగకు కాదు, బోనాల పండుగకు బోనాలు (కలశాలు) నెత్తిలో పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్తారు. తెలియకుండా ఎందుకు రాస్తావు?

Unknown said...

బాబూ, బ్రతుకమ్మ పండుగకు కాదు, బోనాల పండుగకు బోనాలు (కలశాలు) నెత్తిలో పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్తారు. తెలియకుండా ఎందుకు రాస్తావు?

తాడేపల్లి said...

బతుకమ్మ అనే పేరుతో కాదు గానీ ఇలాంటి ప్రకృతిమాత పూజలు శ్రావణమాసంలోను, దసరా రోజుల్లోను ఆంధ్రప్రదేశ్ అంతటా ఆచరిస్తారు. వీళ్ళేమో దీన్ని తెలంగాణ ఆత్మగౌరవ ప్రదర్శనగా భావిస్తున్నారు. వీళ్ళ పూర్వీకులకు లేని ఐడియా ఇది. ఇప్పటి బతుకమ్మపూజల్లో భక్తి మాటెలా ఉన్నా అవి చేయడానికి వచ్చే ఆడవాళ్ళ చీరలు, నగలూ అదిరిపోతూంటాయి. నడిచే నగల దుకాణంలా ఉంటారు ఒక్కొక్కఱు.

ఓరుగల్లు పిల్లాడు said...

ఆఖరిగా తెలంగాణా వారికి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి తలచుకోండి........ఈ Mentality వల్లె తెలంగానా వారు విదిపొదాం అంటునారు.u people are only the leaders...no one from telangana dont have capabilities.....Very sad abt ur mentality. పెద్ద గంపని బోర్లా పెట్టి దాని చుట్టూ ప్లాస్టిక్ పూలు తగిలించి ...nowadays puvvulu dorakaka ala chesthunnaru....adi oka panduga matrame...bathukammani roju water tho kadigi bottu pettarani thelusuko and bathukamma oka devatha kadu..its a gathering of people celebrations....మరి శివరాత్రి పండుగలకు బట్టలని విప్పి రెకార్దింగ్ డాన్సులు చెసెవరిని చుస్థె మీకు అసహ్యాo అనిపించలెదా?

ఓ బ్రమ్మీ said...

నాయనా శ్రీకాంత్,

నువ్వోసారి బేగంపేటలో ఉన్న కట్ట మైసమ్మ గుడికి బతుకమ్మ సమయంలో వెళ్ళి చూడు, అప్పుడు మాట్లాడు. నువ్వన్నది నిజమే, ఎక్కువ శాతం మంది బోనాలు అప్పుడు కలశాలు పట్టుకుని తిరుగుతారు, కాని ఇక్కడి కట్ట మైసమ్మ దగ్గర బతుకమ్మ పండుగకి ఆడ వాళ్ళు నెత్తిన బుట్టపెట్టుకుని వస్తే, మగోళ్ళు చంకలో మందు బాటిల్స్ పెట్టుకుని వస్తారు. ఆ రోజుల్లో ఆడమగ అనే తేడా లేకుండా అందరూ తాగి తందనాలాడతారు. కానీ ఈసారి అంతటి సందడి కనిపించలేదు. దానికి కారణం ఏమై ఉంటుందో ఊహించుకో.. తెలియకుండా వ్రాయలేదు, నీకు తెలియక పోయినంత మాత్రాన నాకు తెలియదు అనుకోకు. ఏమైనా స్పందించినందులకు నెనరులు

ఓ బ్రమ్మీ said...

తాడేపల్లి గారు,

నిజమేనండి. ఒక్కొసారి నాకు అవి గిల్టు నగలేమో అనిపిస్తుంది. మీరు అన్నది నిజమేనేమో అనిపిస్తోంది. కాని తెరాసా వారు దీన్ని నిజ్జంగానే మరో రాజకీయ కోణం ఇచ్చి చెత్త ఐడియా చేసారు. ఇక భక్తి విషయానికి వస్తే నాది మీ భావనే, దేవుని యందు భక్తి పూజ చెయ్యాలన్న చిత్తశుద్ది కన్నా తాగి తందనాలాడి తగాదాలు పెట్టుకోవడమే ఆనవాయితీగా జరుగుతోంది ఆ రోజుల్లో.. ఒక్కోసారి వీరి ఆగడాలు చూస్తే అసహ్యం వేస్తోంది. అయినా వారి స్థాయి అంతే అనుకుని నా దారిన నేను పోతూ ఉంటా. ప్రకృతి మాత పూజల గురించి వివరించినందులకు నెనరులు.

ఓ బ్రమ్మీ said...

ఓరుగల్లు పిల్లాడు గారు,

బాగుందండి మీ వితండ వాదం. మీరోసారి ఈ లంకెని చూడండి, http://chakravarthy.blogspot.com/2010/01/what-is-project-management-and-project.html, అప్పుడు అర్దం అవుతుంది లీడర్ షిప్ అంటే ఏమిటో. అలాంటి ప్రవర్తనని మీలో పెంపొందించుకుంటే, తెలంగాణాలోంచి ఎందరో ప్రముఖులు / త్యాగ శీలులు / మహాత్ములు / .. ప్రవర్తించిన తీరుని మీరు అర్దం చేసుకుంటే, ఇక గొడవలుండవు. కాని వారి మాటలు, వారి అభ్యుదయ వాదాలు మీకు అక్కర్లేదు. మీరు వారిని గౌరవించరు. మీకు కావలసినదల్లా, తెల్లవాడు వదిలి వెళ్ళిన డివైడ్ అండ్ రూల్ పాలసీ మాత్రమే. కలసి ఉంటే కలదు శుఖం అన్న నానుడి మీకు చెత్తగా అనిపిస్తోంది అంటే ఒక్క సారి ఆలోచించుకోండి. అయినా నా వెఱి కాకపోతే, అదేదో సామెతలో చెప్పినట్టు, ఆయినే ఉంటే మంగలెందుకు అన్నదంట వనకటికి ఓ విధవరాలు. అలా మీకే ఆలోచించే తత్వమే ఉంటే, గొడవలెందుకు వస్తాయి. ఇక ఆఖరుగా బతుకమ్మ పండుగ గురించి, వివరించినందులకు నెనరులు. చివరగా ప్రశ్నించిన శివరాత్రి పండుగ గురించి ఆ నాడు చేసే రికార్డింగ్ డాన్సుల గురించి, నా వివరణ. నేను ఏనాడు అలాంటి వాటిని హర్షించను. కాకపోతే అవి చేసేది కూడా తాగి తందనాలు ఆడే మందభుద్ది గల వాళ్ళు. పెంట మీద రాయి వేస్తే అది చింది మనమీదే పడుతుంది అన్న వైనంతో సమాజంలో హుందాగా గడుపుతున్న నాలంటి వారి మౌనం మీలాంటి వారికి అంగీకారంగా కనబడుతోంది అంతే కాని మేము అసహ్యించుకుంటున్నాం అన్న విషయం మీరు గ్రహించదలచుకోలేదని గమనించండి. మీలాంటి వారికి తాగి తందనాలు ఆడి గొడవలు పెట్టుకోవడానికి కారణాలు వెతుక్కుని వాటికి ఏదో పేరు కావాలి కాబట్టి ఇలా ఎదుటి వారిని దూషిస్తూ మేమేదో మిమ్మల్ని తొక్కేస్తున్నాం అని అనవసరమైన అవాకులు చవాకులు చేస్తున్నారు. మీలో విషయం ఉంటే నిరూపించుకోండి అంతే గాని ఎదుటి వారిపై పడి ఏడవకండి అని మనవి

Anonymous said...

తెలంగాణ రాని రాకపోనీ, గోదారి ఆంధ్రోళ్ళతో బతుకమ్మ ఆడించాలని నాకు మా చెడ్డకోరికగా వుంది, చెక్కురవత్తి.

Anonymous said...

మన్షిగ షెప్పినావ్ ఓరుగల్లు బిడ్డా, ఈ రాయలసీమ రమణారెడ్డి దిల్ చురాయించినవ్. ఇద రాసిచ్చా తీసుకో ఓరుగల్లు, ఇవ్వు నాకొక కల్లు.

Anonymous said...

dayachesi elaanti chettha abhipraayaalu allow cheyyoddu.

ఓ బ్రమ్మీ said...

మొదటి అజ్ఞాత,

మున్ముందుగా తాడెపల్లి వారి స్పందన చదివితే బతుకమ్మ అనే కానెస్ప్ట్ ఒక్క ప్రాంతానికి చెందినది కాదు, ఇలా శ్రావణ మాసంలోను మరియు దసరాల్లోను ఆంద్రప్రదేశ్ అంతటా ఆచరిస్తారని పెద్దలు చెప్పనే చెప్పారు. కాకపోతే మీలాంటి ఛాందసవాదులే ఇలా మతి తప్పి ప్రవర్తిస్తూ దైవత్వానికి ప్రాంతానికి ముడేస్తున్నారన్న విషయం మీరు గ్రహించే స్థితిలో లేనప్పుడు ఏమి చెబితే ఏమి లాభం? చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే.

రెండొవ అజ్ఞాత,

తాగి తందనాలాడటానికి నా బ్లాగుకేరావాలా? అక్కడ కెలుకుడు సంఘం ఒకటుంది అక్కడి వెళ్ళి వారితో చేరు.

మూడవ అజ్ఞాత,

మీ సలహా బాగుంది, అయినా సృతి మించనంత వరకూ పరవాలేదు. గీత దాటితే అలాగే చేస్తాను. స్పందించినందులకు నెనరులు

ఓరుగల్లు పిల్లాడు said...

చక్రవర్తి గారు...

"ఇక్కడి కట్ట మైసమ్మ దగ్గర బతుకమ్మ పండుగకి ఆడ వాళ్ళు నెత్తిన బుట్టపెట్టుకుని వస్తే, మగోళ్ళు చంకలో మందు బాటిల్స్ పెట్టుకుని వస్తారు".....తెలంగానా లొ పుట్టిన నెను మాత్రం అలాంటి వారిని ఎప్పుడు చుడలెదు.me abiprayam lo Katta mysamma area lo vunde vallu matrame telangana valla.
తెలంగానా వారు అంతా తాగుబొతులు అని అనుకునె మీ అబిప్రాయం మార్చుకుంటె మంచిది.కావాలంటె అనాలసిస్ కొసం ఒకసారి తాడెపల్లి గారి బ్లాగు చూడండి. ఎందుకంటె మీ పండుగలలొ తాగె వరు మంద బుద్దులు తెలంగాన పందుగలలొ తాగెవరు మాత్రం తందనాలాడతారు.
మీరు బతుకమ్మ థొ పాటు శివరాత్రి మీద కుడా ఒక టపా వ్రాసివుంటె సమాజం పట్ల మీ హుందాథనం మాకు అర్థం అయ్యెది
"కలసి ఉంటే కలదు శుఖం అన్న నానుడి మీకు చెత్తగా అనిపిస్తోంది"
కలసి 60 సంవత్సరలు వుంటె తెలంగాన బీడు పొయింది ..and తెలంగాన పరిస్రమలు మూతపడినయ్( ఆజంజహి మిల్ల్,ప్రాగ టూల్స్, అల్ల్యిన్ పరిస్రమ,IDPL,....long list)mari andhra lands and factories...

Anonymous said...

giltu nagalu pettukoni raru babu....

ఓ బ్రమ్మీ said...

ఓరుగల్లు పిల్లాడు గారు,

నా స్పందనని గౌరవించి తిరిగి స్పందించినందులకు మున్ముందుగా మీకు హృదయపూర్వక అభినందనలు. అభిప్రాయ భేదాలు ఉండటంలో తప్పులేదు అన్నంత మాత్రాన మనిషే తప్పని నిర్ణయానికి రావడం మంచి పద్దతి కాదు. ఇక నా అభిప్రాయంలో తెలంగాణా వాళ్ళంతా తాగుబోతులు అని నేను వ్రాయలేదు సుమా, మరి ఒక్క సారి నా స్పందనని చదివితే, " .. ఇక్కడి కట్టమైసమ్మ గుడి.. " అని మాత్రమే ప్రస్తావించాను. దానిని మీరు అందరితో అన్వయించుకుంటే, పుచ్చకాయల దొంగ వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనా విధానాన్ని మరియు అర్దం చేసుకునే పద్దతిని మార్చుకోండి. అంతే కాని అపార్దం చేసుకోకండి. ఇక సమాజం / శివరాత్రి / హుందాతనం గురించి మరోసారి ప్రస్తావిస్తాను. అలాంటి సంఘటన జరగనియ్యండి అప్పుడు తప్పకుండా వ్రాస్తాను. ఇవ్వాళ ఈ విషయం గురించి వ్రాయడం వెనకాల ఒకటే ఆవేదన, దేవుడిని ఆటబొమ్మ చేసి అగౌరవ పరచడమే.
ఇక అరవై సంవత్సరాలు కలసి ఉన్నప్పుడు బీడు పోయిన మీ భూముల మరియు పరిశ్రమల గురించి ఇక ఆలోచిద్దాం. మీరు ప్రస్థావించిన పరిశ్రమలన్నీ మూతపడిపోయ్యాయ్ అని ఆవేదన పడిపోతున్నారే, మరి అలంటి పరిశ్రమలు తెలంగాణాలోనే స్థాపించాలని పాటు పడ్డ రోజున కిమ్మనకుండా ఒప్పుకున్నప్పుడు మిగిలిన వారు ఎటువంటి ఆందోళన చెయ్యలేదే!! ఆ విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? పుట్టిన ప్రతీ వ్యక్తి గిట్టక తప్పదు అన్న నిజం పరిశ్రమల యడ ఎందుకు అన్వయించుకోలేక పోతున్నారు? అలా పరిశ్రమలు ఆంద్రా ప్రాంతానికి రానప్పుడు అక్కడి మనుష్యులు సేద్యంపై దృష్టి సారించి పంటలు పండిస్తే మీరు కుళ్ళుకుంటున్నారే!! తెలంగాణాలో ఎన్నో పండిచవచ్చు. వాటి గురించి ఆలోచించండి. అప్పుడు జనాలు పరిశ్రమల మీదే ఆధార పడాల్సిన అవసరం రాదు అని తమలాంటి వారు ఎంత తొందర్గా గుర్తిస్తే అంత మంచిది.

ఓ బ్రమ్మీ said...
This comment has been removed by the author.
ఓ బ్రమ్మీ said...
This comment has been removed by the author.
Anonymous said...

బాగా సెప్పినావ్ ఓరుగల్లు. నీ పోస్ట్ లో ఆవేదన వుంది, తెలంగాన భూములు ఆంధ్రోళ్ళు దున్ని పంటలు పండిస్తలేరు, ఇది చాలా విచారమైన విషయం. ఏమైనా చెప్పు మన ఓరుగల్లు తాటికల్లు రుచి వీళ్ళకేం తెలుస్తది? కోతికేం తెలుసు కొత్తిమిరికట్ట రుచి?

ఓ బ్రమ్మీ said...

నాల్గొవ అజ్ఞాత,

గిల్టు నగలు కాకపోతే అవన్నీ నిజమైనవంటావు, అంతేనా. మరి అంతంత బంగారం నిండా దిగేసుకుని తిరిగే తెలంగాణా వాళ్ళకు అంతంత ధనం ఎక్కడినుంచి వచ్చిందో!! ఆంద్రా వాళ్ళు అన్ని దోచేసుకుంటుంటే, ఇంతంత ధనం ఎక్కడినించి వచ్చిందంటావు?

ఓ బ్రమ్మీ said...

ఐదొవ అజ్ఞాత,

అందుకే అన్నది, తాగి తందనాలు ఆడటం మా కట్టమైసమ్మ గుడికి వచ్చేవారికి ఆనవాయితీ అని చెప్పింది. తమరు కూడా ఆ గుడికి వచ్చేవార్లలో ఒకరా?

ఓరుగల్లు పిల్లాడు said...

@చక్రవర్తి గారు.
"పరిశ్రమలు తెలంగాణాలోనే స్థాపించాలని పాటు పడ్డ రోజున కిమ్మనకుండా ఒప్పుకున్నప్పుడు మిగిలిన వారు ఎటువంటి ఆందోళన చెయ్యలేదే!!"ఆ విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు?
Azamzahi mills esablished in 1934
Allwyn Factory Established in 1942
Praga Tools established in 1942,,,oka sari charithra thelusukondi...

Vizag steel factory report before 2000-01
Over the last four years, the plant has managed to reduce its loss steadily. From Rs 770 crore in 1998-99, the net loss shrank to Rs 560 crore next year and to Rs 291 crore in 2000-01. This year, the net loss is expected to be Rs 120-125 crore.
THEN THE GOVT HELPED VIZAG STEEL PLANT FROM LOSSES AND WHY NOT TO TELANGANA FACTORIES.
"తెలంగాణాలో ఎన్నో పండిచవచ్చు" water lekunda em pandicha vachho telangana variki theliyadu lendi...
@ఐదొవ అజ్ఞాత,
ధెవథలు కూడా సుర పానం(May be కల్లు)తాగె వారు కాని బ్రాండి వ్హిస్కీ తాగ లెదు సుమా.

 
Clicky Web Analytics