వ్యాపార సలహా - ఇది ఒక సలహా మాత్రమే

 

ఈ మధ్య కొంత కాలంగా మొబైల్ ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ కనబడుతోంది. అలాంటి కాంపిటీషన్ వ్యాపార పరంగా మంచిదే. కొన్ని విలీనాలు, మరికొన్ని కొత్త బ్రాండ్స్ మార్కెట్ లో విరివిగా కనబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో నేను క్రితంలో లాభమార్జించిన ఓ షేర్ ఇప్పుడు చాలా నష్టాలలో ఉంది. ఇలాంటి సమయంలో మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

అది 2007వ సంవత్సరం జూన్ 21వ తారీఖు. అప్పట్లో మన షేర్ మార్కెట్ శర వేగంతో పరిగెడుతోంది. అలాంటి రోజున నేను HFCL Infotel Ltd., అనే కంపెని యొక్క షేర్లు ఓ రెండొందలు కొన్నాను. ఎంతకి అంటారా.. Rs.15.75/- ఆ తరువాత దానిని ఓ ఆరు నెలల తరువాత Rs.46.40/- వద్ద అమ్మేశాను. దీని వల్ల నాకు కలిగిన లాభం, Rs.6130/-. ఈ షేరు ఇప్పుడు చాలా తక్కువలో కాక పోయినా తక్కువలోనే అమ్ముడవుతోంది. BSE లో ఈ షేరుని కొనాలంటే ఈ లంకె ని చూడండి

ప్రస్తుతం ఈ షేరు 6 రూపాయిల 36పైసలు దగ్గర వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. కావున వీలైనన్ని కొని, లాంగ్ టరమ్ కోసం దాచుకున్నారనుకోండి, బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువే లాభం పొందే అవకాసం ఉంది. ఇక్కడ నా ఉద్దేశ్యంలో లాంగ్ టరమ్ అంటే దాదాపు ఓ ఆరు నెలలు అన్నమాట. అందువల్లన ఓ ఆరు నెలలు డబ్బులు మనవి కాదు అనుకున్నట్లైతే ఈ షేర్ యందు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.

ఆఖరుగా .. ముందే చెప్పినట్లు, ఇది నా అనుభవం మాత్రమే. నేను ఏ విధమైన పరిశోధనలు జరపలేదు, అలాగే నాకు అనుభవఙ్ఞులెవ్వరు సాయ పడలేదు. ఈ కంపెనీ యొక్క సాంకేతిక విషయాలు నాకు ఏమాత్రం తెలియదు, కావున మీరు ఇన్వెస్ట్ చెయ్యదలచుకుంటే అందుకు పూర్తిగా మీరే భాద్యులు. ఒక వేళ నేనాశించినట్లుగా ఆరు నెలల తరువాత కూడా ఈ షేరులో మార్పు రాని యడల అందుకు నన్ను భాధ్యుడను చెయ్యవద్దని ముందుగా హెచ్చరిస్తున్నాను

మీకొక నిజం చెప్పనా !!

 

క్రిందటి నెలలో ఆఫీస్ లో ఉన్నప్పుడు జరిగిన యధార్ధ గాధ. ఉదయం నుంచి చాలా కామ్ అండ్ సైలెంట్ గా ఉండే మా సహోద్యోగులలో కొంత మంది పెళ్ళి కాని ప్రసాదులు సాయంకాలం అయ్యేటప్పటికి వైలెంట్ అయ్యి మా చెవులకు ఉన్న తుప్పుని దులుపుతుంటుంటారు. ఎలా అంటారా.. అదేనండి వెస్ట్రన్ సంగీతాన్ని తారస్థాయిని మించి ఒకళ్ళు వాయిస్తే రాక్ సంగీతాన్ని మరొక బాచ్ వాయిస్తూ ఉంటుంది. ఇదేంటి పని చేసే ఆఫీస్ లో ఇలా సంగీతం వాయించడం అనుకుంటున్నారా.. సదురు పెళ్ళి కాని ప్రసాదులలో కొంత మంది మ్యూజిక్ పిచ్చోళ్ళు ఉన్నారు. అంతే ఇంకేముంది, మార్క్తెట్ లోకి వచ్చిన అన్ని మ్యూజిక్ ఆల్బంస్ అన్నింటినీ ఒక్క సారైనా వినాల్సిందే.

వాళ్ళు వింటే ఫరవాలేదు, అక్కడితో ఆగకుండా.. అంకుల్ ఈ పాటలు ఎలా ఉన్నాయ్ .. అంటూ మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. వీళ్ళ ఉద్దేశ్యంలో అంకుల్ అంటే పెళ్ళైన మొగాడు అలాగే పెళ్ళైన ప్రతి అమ్మాయి ని అంటీ అని. సరే అసలు విషయాన్ని మరచి పోతున్నాం. అలా ఉదయం అంతా సీరియస్ గా పని చేసుకునే మాకు సాయంత్రం అయ్యేటప్పటికి మ్యూజిక్ గోల తప్పదన్నమాట. ఇలాంటి వాళ్ళ గోల పడలేక నేను నా ఐపాడ్ లో చక్కగా నాకు నచ్చిన పాటలను మంద్ర స్తాయిలో వాయించుకుంటూ వినేస్తుంటాను. కానీ మంద్ర స్తాయిలో ఉన్న సంగీతానికి తారస్థాయి డామినేట్ చేస్తుంది కదా!! అందుకని, చెవులన్నీ కప్పేసేటట్టుగా ఓ హెడ్ సెట్ కొనుక్కొచ్చి నా ఐపాడ్ కి తగిలించేసాను. ఇంకే.. నా ప్రపంచం నాది. ఇక ఇతరులతో మనకు సంబందం లేదు, బయటి వాళ్ళు ఎలాంటి గోల చేసినా నాకు వినపడదు. ఇలా సాఫీగా సాగుతున్న నా సాయంకాలలో .. ఓ చేదు అనుభవం!!

సంగీతం మంద్రస్థాయిని దాటి తారస్థాయిని చేరింది. అయినా ఆ పాటలు జోష్ గానే ఉన్నాయి. నాకు నచ్చిన జోష్ పాటలు అంటే అవి వాసు సినిమాలాంటివి అన్నమాట. ఇంతలో అనుకోకుండా అత్యంత అవసరంగా నాకు FART చెయ్యాల్సి వచ్చింది. (FART అంటే ఏమిటి అని నన్ను అడగవద్దు. మీదెగ్గర ఆంగ్ల డిక్షనరీ ఉంటే వెత్తుక్కోండి. అదేనండి తెలుగులో దానిని అపాన వాయువు అంటారు. అయినా అర్దం కాలేదా మీరు తప్పకుండా నా పాత పుట చదవాల్సిందే మరింకే ఓలుక్కేసుకోండి..) పని వదిలి ప్రక్కకు వెళ్ళలేను.. అయినా తప్పని సరి.. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే.. వినబడుతున్న పాటలో పాత గోడ గడియారంలోని గంటల మ్రోతలా, కొంచం రిధమిక్ గా డ్రం మోతలు వినబడుతున్నాయి.

ఇంకే!! కోతికి కొబ్బరికాయ చిక్కినంత ఆనందం. నాలోని ఒత్తిడిని అంతా ఆ డ్రమ్ మ్రోతలకు అనుగుణంగా చేసుకుంటూ నేను కూడా కొంచం రిధమ్ ని ఏ మాత్రం తప్పకుండా తాళ గతికి అనుగుణంగా నాలోని ఆ వొత్తిడిని కొంచం కొంచంగా అని నేననుకున్నా అది పెద్ద మొత్తంలోనే వచ్చిందని నా నాశికకు తెలుస్తోంది. అయినా తప్పదు.. ఏం చేస్తాం .. అంతటి ఎమర్జన్సి.. మళ్ళీ రెస్ట్ రూమ్ కి వెళ్ళాలంటే మొహమాటమాయే. ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి, FART చేసేటప్పుడు వచ్చేటటువంటి రిలీఫ్ వర్ణనాతీతం. ఎంత భారం తగ్గినట్లు ఉంటుందో నేను మీకు వివరించనక్కర్లేదు. ఇలా సాగుతున్న నా రిలీఫ్ ప్రవసనంలో అనుకోకుండా అవాంతరాలు ఎదురవ్వడం మొదలైంది. ఎలా అంటారా.. చదవండి.

మా ఆఫీస్ లోని సహోద్యోగులంతా యాహూ మెసెంజర్ని వాడతారు. అది మాకు అఫీషియల్. అందు వల్లన సహోధ్యోగులు ఎవ్వరు ఎవ్వరికి ఏమి చెప్పాలన్నా మెసేంజర్లో మెసేజ్ పెడతారు. అదిగో అప్పుడు మొదలైంది. ఒక్కొక్కడు మెసేజ్ లు ఇవ్వడం. ఏమని అంటారా.. "బాసు కొంచం సౌండు తగ్గించు వినలేక చస్తున్నాం " అని. వాళ్ళకా అర్దం కాదు!! సౌండ్ తగ్గిస్తే నాకు ఇబ్బంది అని. అందుకని చిలవలు పలవలుగా వస్తున్న అలాంటి మెసేజ్ లన్నింటిన్ని పట్టించు కోకుండా నా పని పూర్తి చేసే కుంటూ పూర్తిగా రిలీఫ్ అవ్వడానికి సిద్దం అయ్యే హడావిడిలో పడ్డాను. అన్నింటికీ ముక్తాయింపు ఇచ్చిన తరువాత పూర్తిగా రిలీఫ్ అయ్యిన తరువాత నా పాటల సౌండ్ తగ్గించా.

ఆశ్చర్యం సౌండు తగ్గటం లేదు. సిస్టంలోని అన్ని ప్రయత్నాలు చేసేసా .. అయినా సౌండు మాత్రం తగ్గలేదు. కంట్రోల్ పానల్ కి వెళ్ళి అక్కడ సౌండు అండ్ ఆడియో డివైజస్ ఆప్షన్లో ఏమైనా మిస్ చేసానా అని విస్వ ప్రయత్నం చేసాను. అయినా అంతే సౌండ్ ఉంది .. ఎక్కడ పొరపాటు జరిగిందా అని తలమునకలౌతుంటే .. అప్పుడు గుర్తుకు వచ్చింది ..

నేను పాటలు ఐపాడ్ నుంచి వింటున్నానని..

ఇంకేముంది మరునాడు ఆఫీస్ కి సెలవు, ఓ వారం రోజులు ఎవ్వరినీ పలకరిస్తే ఒట్టు. మీకిలాంటి అనుభవం ఎప్పుడైనా అదురైందా!!

కలవరమాయే పాటలు .. నా అభిప్రాయం

ఈ మధ్య వస్తున్న పెద్ద పెద్ద సినిమాలతో పోల్చుకుంటే, కలవరమాయే సినిమా పాటలు నాకు బాగానే నచ్చాయి. నాకు హితుడు సన్నిహితుడు అయిన గారు ప్రచురించినట్లుగా అని నేను ఒప్పుకోను. ఇక్కడ నా రుచి వీరి రుచి ఒక్కటవ్వాలని రూలు ఎక్కడ లేదు కానీ, సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే కలవరమాయే పాటలు చాల రిచ్ గా ఉన్నాయి. కానీ జోష్ పాటలలో అంతటి సంగీత ధోరణి కనబడ లేదు.

సినిమా అంటే పూర్తిగా కమర్షియల్ .. అందువల్ల కమర్షియల్ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉన్నాయి జోష్ పాటలు. ఈ బాటలోకే వస్తాయి మగధీర పాటలు కూడా. కొన్ని పాటలు వ్యాపార ధృక్పధం లేకుండా జనాలలోకి చొచ్చుకుని పోతాయి. అలాంటి వాటి కోవలోనిదే, మగధీరా లోని బంగారు కోడి పెట్ట పాట. కానీ మగధీరా పాటలు కూడ నాకు అంతగా నచ్చలేదు.

అదేదో నానుడి చెప్పినట్లు, విశ్వనాద్ గారి సినిమాలు కళ్ళుతో కాదు చూడాల్సింది. మనసుతో చూడాలి అలా అన్నట్లు, సినిమాని సినిమాగా చూడాలి అలాగే మనకు ఎంత గిట్టింది మాత్రమే చూడాలి తప్ప అందులో రసం ఙ్ఞానం(సాంబారు, పులుసు, వగైరా వగైరా..) ఉందా లేదా అని చూడకూడదు. ఆ కోవలోలే, అభిమానులు ఉన్నారు కదా అని మన నాగార్జున గారి కొడుకుని మోసేయ్యడమో.. లేక ప్రజారాజ్యం అధిపతి కొడుకు కాబట్టి చెరణ్ బాగా చేశాడు అని నేను చెప్పలేక పోతున్నాను.

వీరిద్దరి అభిమానులు, నన్ను మన్నించండి. నాకు జోష్ పాటలకన్నా మగధీరా పాటలు బాగున్నాయి. అలాగే మగధీరా పాటలకన్నా కలవరమాయె పాటలు బాగున్నాయి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

ఆడపిల్లగా పుట్టడం వెనుక ఉన్న లాభాలు

ఎప్పుడైనా ఆలోచించారా!! ఆడ పిల్లగా పుట్టడం వెనకాల ఎన్ని లాభాలున్నాయో!! నాకు తోచిన కొన్ని

 

  1. టైటానిక్ ఓడ మునిగి పోయే ముందు చక్కగా తప్పించు కోవచ్చు
  2. రోజూ గెడ్డం చేసుకోవాల్సిన పని లేదు
  3. ఏవైనా వస్తువులు మరిచి పోయినా ఫరవాలేదు .. అందరూ మనకు సహాయపడే వాళ్ళే.. (ఎదవలు, అంతా చొంగ కార్చుకునేటోళ్ళే!!)
  4. ఎవ్వరితో నైనా నిరభ్యంతరంగా మాట్లాడేయొచ్చు..
  5. సినిమాకి వెళ్ళాలంటే కష్ట పడనక్కర్లేదు .. బాయ్ ఫ్రండ్ ఉన్నాడుగా .. ఆ కష్టమేదో ఆడే పడతాడు..
  6. మేకప్ చెరిగి పోకుండా టింగు రంగా అంటూ తిరిగేయ్యొచ్చు ..
  7. ఒక్క స్మైల్ పడేశామంటే చాలు ఇంటి ముందు వాచ్ మెన్ సిద్ధం..
  8. ఉద్యోగంలో ఎవ్వడైనా ఏమైనా అంటే ఆ అధికారిపై చక్కగా sexual herassment కేసు పెట్టేయ్యొచ్చు
  9. ఈ పురుషాధీక్య సమాజంలో మనమే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
  10. కంట తడి పెట్టామా .. అంతే .. వందం మంది వీరేశలింగాలు సిద్ధం..

ఇంకా, ఎన్నో ఎన్నెన్నెన్నో.. మీరే ఏమంటారు..

ఏమిటీ <<డాష్ డాష్..>>

ఈ క్రింది ప్రకటన చూసాక ఈ పుటకి శీర్షిక ఏమి పెట్టాలా అని చాలా సేపు ఆలోచించాను. నాకు తట్టిన పదాలలో కొన్ని.. "కొత్తదనం" అనాలా!! "వైవిధ్య"మైన ప్రకటన అనాలా !!! "వైపరిత్యం" అనాలా !!! లేక "తలతిక్క" ప్రకటన అనాలా!!


ఏమంటే బాగుంటుందో మీరే చెప్పండి.. ఇంతా చేస్తే ఇది నిస్సాన్ అనే కార్ల కంపినీకి తీసిన యాడ్.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics