దుష్టులకు దూరంగా ఉండాలి - The Final Cult



మొదటి పుట దేవాలయ స్థాన బ్రంశం గురించి ప్రస్తావిస్తే.. రెండవ పుట పరోపకారార్ధం మిదం శరీరం అంటూ చనిపోయిన తరువాత కూడా తాము ఉండడానికి అనువైన ప్రదేశాన్ని, శ్మసానాన్ని, కూడా వాహన చోదకుల ఉపయోగార్ధం త్యాగం చేసిన వైనాన్ని గుర్తుకు చెస్తుంది.

ఇక
ఆఖరుగా, విషయాన్ని ప్రస్తావించడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డాన్నో.. విషయాన్ని ఎలా తెలియ జేయాలా అని నేను ఎంత ప్రయాస పడ్డానో.. అసలు విషయాన్ని సున్నితంగా ఎలా తెలియ జేయాలో తెలియక ఎన్ని సార్లు పుటని పదే పదే పలు విధాలుగా వ్రాసుకున్నానో .. నా ఆత్మకు అలాగే పైన ఉన్న దైవానికి మాత్రమే తెలుసు.

అయినా ఉన్న విషయాన్ని తెలియ జేయడానికి ఇంత శ్రమ అవసరమా?? ఎంత నిజాయతిగా ఉందా మనుకున్నా .. దాన్ని వక్ర బుద్ధితో చూసే జనం అర్దంచేసుకోక పోగా.. అపార్ధం చేసుకుని అనర్ధాన్ని కలిగిస్తారనే భయం నుంచి బయట పడి ధైర్యంగా సాహసం చేస్తున్నా..
 
ఇక్కడ కనబడుతున్న రోడ్డు map కొంచం దాదాపుగా వచ్చేటట్టు ప్రయత్నించా..

గమనించాల్సిన విషయం -


స్థలం : ఏల్ వీ ఫ్రసాద్ మార్గ్ మొదలయ్యే చోటు. నాగార్జునా సర్కిల్నుంచి హైటెక్ సిటీ వేళ్ళే దారి. ఈదారిలోనే TV9 వారి ఆఫీస్ ఉంది.

ప్రస్తావించ దగిన విషయం:

దారి గురించి ప్రస్తావించే ముందుగా కొన్ని విషయలు.

వివరణ : ఎర్ర గీతలో ఉన్న దారి పుట ప్రస్తావన
వివరణ : నీలం గీతలో ఉన్న దారి వెడల్పుని ఎర్ర గీతలో ఉన్న దారి వెడల్పుని గమనించండి
వివరణ : బూడిద రంగు ఉన్నవి భవన సుదాయం
వివరణ : తెలుపు రంగు దారిగుండా ట్రాఫిక్ పయనిస్తూ ఉంటుంది
వివరణ : అంకె 1 వేసిన చోట, ఒక బేకరి ఉంది
వివరణ : అంకె 2 వేసిన చోట, ఒక మెకానిక్ షెడ్డు ఉంది
వివరణ : అంకె 3 వేసిన చోట, ఎంత వరకూ ఉందో తెలియదు గానీ అక్కడ ఒక మసీదు ఉంది
వివరణ : ఇక్కడ 3 అంకె వేసిన చోట గీతని గమనించారు కదా.. లోపల ఎలా ఉందో నాకు తెలియదు ..కానీ ఆగీతకి కుడివైపున అంతా ఖాళీ స్థలమే..
వివరణ : పైగా ఎర్రని వృత్తాకారం ఉన్న చోటు.. ఎత్తుగా ఉంటుంది. దారిలో ఒక బస్సు ఎక్కిందంటే.. అంతే సంగతులు .. చిన్నపిల్లవాడే వేగంగా పాకుతాడెమో అనిపిస్తుంది..

ఇక అసలు విషయానికొద్దాం..

పైన చెప్పిన దారిలో ఉదయం వేళ్ళల్లో ట్రాఫిక్ చాలా దారూణంగా ఉంటుంది. అందునా TV9 ఆఫీస్ దగ్గర నరకమే అనుకోండి. దారంతా ఎత్తుగా ఉండటమే కాకూండా.. కూడలి దాటిన తరువాత, ఎర్ర వృత్తాకారాం చుట్టున చోటు ఇరుకైన రోడ్డు. ద్విచక్ర వాహనం చోదకులైతే గానీ.. కార్లూ గానీ.. బసస్సు వాళైతే గానీ.. ఎవ్వరేళినా.. First Gearలో వెళుతూ ఎంత కాలూష్యాన్ని విడుస్తున్నారో అటుగా వెళ్ళే వాళ్లని అడిగితే తెలుస్తుంది. ఎప్పుడూ అటుగా వెళ్లుతున్నప్పుడల్లా.. క్రింద విధంగా అనిపిస్తుంది.

ఎన్నో ఫ్లై ఓవర్లు వేసిన పలు ప్రభుత్వాల అధికారులు దారి గుండా ఎప్పుడూ సాగినట్లు లేరు .. ఒక వేళ సాగినా.. వారి దృష్టికి ఇక్కడి ఇబ్బంది వచ్చినట్లు లేదు.. పోనీ ఎవ్వరైనా వారి దృష్టికి తీసుకొద్దాం అని ప్రయత్నం చేసినా.. వారు దానిని చూడదలుచు కున్నట్లు లేరు .. ఎందుకని?

ఇక్కడ ముస్లింలకు సంభందించిన మసీదు ఉన్నందున మత్రమేనా?? ఏం.. ప్రభుత్వాధికారులు మసీదు పెద్దలతో చర్చలు జరిపి ప్రజాపయోగార్దం ఖాళిగా ఉన్న స్థలాన్ని ఎందుకు రోడ్డుగా మరల్చ లేక పోతున్నారు? రోడ్డుకు అడ్డంగా ఉందన్న ఒకే ఒక కారణం చేత.. ఆనంద్ థియేటర్ దగ్గర మూడంతస్తుల భవనాన్ని, అందులో ఉన్న వ్యాపార కార్య కలాపాల్ని కూల్చేసిన ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఒక చిన్న బేకరీని దానిని ఆనుకుని ఉన్న మెకానిక్ షెడ్ని తొలగించ లేక పోవడం వెనుక ఉన్న రహస్య మేమి? ఇదంతా ముస్లింల ఆస్తి అన్న ఒకే ఒక కారాణమా..

ముస్లింలు అంటే అర్దం చేసుకునే మనుషులు కారా?? వారికి వారి మతమే ముఖ్యమా?? వారికి "లోక కళ్యాణం" అనే పదానికి అర్ధం తెలియదా?? వారు పరోపకరార్థం ఏమీ చెయ్యరా?? లేక మన ప్రభుత్వాధికారులు వారితో చెర్చించ లేదా?? (లేదా) ముస్లింలు అంతా దుర్మార్గులు వారు ఎవ్వరి మాట వినరు, వారితో ఎంతైనా దూరంగా ఉండాలి అనేటటు వంటి ఆలోచనేమైనా ఉందా.. ఎందుకని విషయంలో ఎటువంటి ప్రయత్నమూ జరిగినట్లు కనబడటం లేదు..

నా వరకూ నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు.. వారంతా స్వతహాగా నిదానస్తులు.. ఎంతో సహృదయులు.. స్వతహగా చాలా మంచి వారు .. అంత ఎందుకు.. ఒకప్పటి మన ప్రధమ పౌరుడు, గౌరవనీయూడు, డాక్టర్ Abdul Kalam ఒక ముస్లిం కాదా.. మరి ఇలాంటి వారు నాకు కనబడుతున్నప్పుడు.. ఎందుకు పైన చెప్పిన మసీదు ఆవరణాన్ని రోడ్దుగా మలచ లేకపోతున్నం? నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానా??

మొత్తం కధలో విలన్లు ఎవ్వరు? మసీదు స్వంతదారులా? మన ప్రభుత్వ అధికారులా? గోరంత విషయాన్ని కొండంతలుగా చూస్తున్న నాదా??

ఏది ఏమైనా.. ముస్లిం సోదరులూ నేను మిమ్మలను ఉద్దేశించి పుట వ్రాసానని మీరు భావిస్తే.. అన్యధా క్షమించండి.. నా ప్రచురణ మిమ్ములను వ్యతిరేకించడం కాదు గానీ.. మిమ్ములను ఆశ్రయించని ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కలిగించే ప్రయత్నమే అని గమనించ గలరు. ఆఖరుగా మరొక్క సారిగా.. మీ అభిమతాన్ని గాన్నీ.. మీముల్లను ఏవిధంగా నైనా కించ పరచానని మీ కనిపిస్తే.. దయచేసి క్షమించ గలరు..

దుష్టులకు దూరంగా ఉండాలి - The same side of the coin

 

క్రిందటి పుట ఒక దేవాలయానికి సంభందించినది, ఇవాళ ప్రస్తావించే మిషయం శ్మసానానికి సంభందీంచినది

నా ఈ భావన ఏ ఒక్క వ్యక్తి గురించి కాకపోయినా.. కొంత మంది ఉన్న ఒక మత చాందస్సులను ఉద్దేశించి వ్రాసేదే అని గమనించ గలరు. విషయం మతానిది కాదుకానీ .. దుష్టులది.. మత ఛాందస్సులది.. మానవతా దృక్పధం లోపించిన వారిది.. ఎందుకు ఒక్క హిందువులే అన్ని సార్లూ రాజీ పడాలి అన్న ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటె.. ఎవ్వరిని అడగాలో తెలియక .. హిందువుల సహనాన్ని చేతకాని తనంగా భావించే ఇతర వర్ణాల వారికి బదులు చెప్పలేక.. నేను అనుభవించే భాధలోంచి వచ్చేటటు వంటి మాటల సమూహమే ఈ రేండవ పుట

గమనించాల్సిన విషయం - ౨

స్థలం : నాగార్జునా సర్కిల్‍కు ఆనుకుని ఉన్న హిందూ శ్మసాన వాటిక, పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వేళ్ళే దారి

ప్రస్తావించ దగిన విషయం:

ఈ శ్మసానం ఎప్పుటి నుంచి వాడుకలో ఉందో నాకైతే తెలియదు గానీ, ఎప్పుడైనా ఆదారీలో ఫోతూ అటువైపు ఓ లుక్ వేస్తే, అక్కడ కనబడే కొన్ని సమాధులు చాలా ఫురాతానంగా కనబడుతూ ఉంటాయి. పైన చెప్పిన దారిలో చాలాసార్లు వెళ్ళి ఉంటాను. అలా సాగిన ఒక్కొక్క సారీ అటువైపుగా తీసుకు వెళ్ళే శవాలను.. వాటితోపాటు సాగే జన సమూహాన్నిచూసి అనుకుంటూనే ఉంటాను, ఇంత బిజీగా ఉండే రోడ్డులో శ్మసానాన్ని ఎందుకు కట్టారా అని .. అది కట్టిన వారు, ఆ కాలంలో ఊహించి ఉండరు, ఇలా .. ఈ కాలంలో నాలాంటి వాడు ఆలోచిస్తాడనిన్నీ.. ఆ త్రోవలో సాగే వారికి ఆ శ్మసానం ఒక అడ్డంకిగా మారుంతుందనిన్నీ.. తాము తీసుకు పోయే నిర్జీవాలు మిగితా వారికి ఒక విధమైన అసౌకర్యాన్ని కలిగిస్తుందని.

ఏది ఏమైనా.. ఈమధ్య కాలంలో అటు వైపుగా సాగే వాళ్ళు గమనించ దగ్గ మరో విషయమేమిటంటే.. ఆ మధ్య కూలిపోయిన ఫ్లై ఓవర్ .. అదేనండి.. పాంజాగుట్ట ఫ్లై ఓవర్ ఇక్కడనే దిగుతుంది. అంటే, మన CM, వైయస్స్ ఇంటి దగ్గర మొదలైన ఫ్లై ఓవర్ యొక్కకుడి వైపు రోడ్దు ఈ శ్మసానం మొదట్లో కలుస్తుంది. అలాగే ఎడమ వైపు వేళ్లె రోడ్దు జలగం వెంగళరావు గారి పేరుం ఈద నిర్మించిన ఉధ్యాన వనం దగ్గర కలుస్తుంది. ఈ ఫ్లై ఓవర్ ఈ మధ్య కాలంలోనే వాడుక లోకి తీసుకు రాబడింది. దాని మీదనుంచి వెళుతుంటే.. నాసామి రంగా.. కేక అనుకోండి.. దీని గురించి మరోసారి ..

ఇంక విషయానికి వస్తే.. ఈ ఫ్లై ఓవర్ కి ఏడమ ప్రక్కగా ఉన్న శ్మసాన ద్వారం దగ్గర రేండు దారులు కలవడం వల్ల.. (అదేనండి.. ఒకటి ఫ్లై ఓవర్ నుంచి దిగేది.. మరొకటి క్రిందనుంచి వచ్చేది..) అటుగా సాగే వాహన చోదకులకు కొంచచం ఇరుకగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం, రోడ్డు విస్తరణకై ఓ ఇరవై ఐదు అడుగులు శ్మసాన స్థలాన్ని రోడ్డుగా మార్చ దలిచి, అందుకు అనువుగా మార్కింగ్ కూడా చేసుకున్నారు..

ఇంత జరుగుతున్నా హిందువులు ఎలాంటి ప్రతిఘటన తెలియ జేయటం లేదు .. ఎందువల్ల?.. హిందువులకు ఆ హక్కు లేదా.. హిందువులకు హింసించడం రాదా.. హిందువుల సంపదను వేరే వారు దోచుకుంటూ / ఆక్రమించు కూంటూ ఉంటె, వీరేమీ చెయ్య లేరా..

పోనీ.. పరోపకార్ధం లైట్ తీసుకుంటున్నారను కుంటూ ఉంటే.. అదే పరోప కారార్ధం ప్రపంచంలోని ఒక మత ఛాందస్సులు ఎందుకు అర్దాం చేసుకోరూ అనే నా భాధ. ఇదంతా నాణానికి అదే వైపు అన్నమాట. మరో వైపు.. మరో పుటతో..

------------

తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును, ఖలునకు నిలువెల్ల విషము గదురా సుమతీ

దుష్టులకు దూరంగా ఉండాలి - One side of a coin

ఈ విషయం మన పాలిత ప్రస్తుత ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని నా అభిప్రాయం. ఇది ప్రస్తుతం పాలిస్తున్న ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్రాసింది మాత్రం కాదు. ఇంతవరకూ పరిపాలన సాగించిన అన్ని ప్రభుత్వాల ప్రభుద్దులను ఉద్దేశించి వ్రాసేదే అని గమనించ గలరు. విశయం ప్రభుత్వాలది కాదుకానీ .. దుష్టులది.. మత ఛాందస్సులది.. మానవతా దృక్పధం లోపించిన వారిది..

గమనించాల్సిన విషయం - ౧

స్థలం : సికింద్రాబాద్, ఆనంద్ సినిమా థియేటర్ రోడ్డు మీద ఉన్న రక్త మైసమ్మ గుడి

ప్రస్తావించ దగిన విషయం:

ఈ గుడి ఎప్పుడు కట్టారో నాకైతే తెలియదు గానీ, నాకు 1996 నుంచి రాజధానితో పరిచయాలున్నాయి. అప్పటినుంచి రాజధానికి రాక పోకలు ఇబ్బడి ముబ్బడిగా చేసుంటాను. పైన చెప్పిన దారిలో చాలాసార్లు వెళ్ళి ఉంటాను. అలా సాగిన ప్రతీ సారీ అనుకుంటూనే ఉంటాను, రోడ్డుకు అడ్డంగా ఎవ్వరు కట్టారా అని .. అది కట్టిన వారు, ఆ కాలంలో ఊహించి ఉండరు, ఇలా .. ఈ కాలంలో నాలాంటి వాడు ఆలోచిస్తాడనిన్నీ.. ఆ త్రోవలో సాగే వారికి ఆ దేవాలయం ఒక అడ్డంకిగా మారుంతుందనిన్నీ..

ఏది ఏమైనా.. ఈమధ్య కాలంలో అటు వైపుగా సాగే వాళ్ళు గమనించ దగ్గ విషయమేమిటంటే.. ఆ గుడిని, రోడ్డు మధ్యనుంచి తీసి, రోడ్డుకు ప్రక్కగా ఉన్న కాలేజీ గ్రౌండు లోకి వెళ్ళేటట్టుగా పునర్‍నిర్మించారు. ఈ కదలిక వెనకాల ఉన్న వృత్తాంతం ఒక్క సారి పరికిద్దాం. ofcourse, దీని గురించి నాకేమీ తెలియదు కానీ ఊహిస్తున్నాను..

ఈ గుడిని కదల్చడానికి  ఎవ్వరైనా Govt officials ముందుగా గుడిని ప్రారంభించిన వారితో చర్చలు జరిపి ఉంటారు .. ఆ తరువాత కళాశాల యాజమాన్యాన్ని కలిసి, ఈ గుడిని నిర్మించడానికి అవసరమయిన స్థలాన్ని వారినుంచి అనుమతి పొంది ఉంటారు.. ఇక్కడ గమనించ వలసిన మరో విషయంఏమిటంటే.. ఆ కళాశాల క్రైస్థవ మత పెద్ద పేరుమీద నడపబడు చున్నది. క్రైస్థవ మత పెద్ద పేరు మీద ప్రాధ్యాన్యంగా సాగే అట్టి కళాశాల యాజమాన్యం మరో మతానికి సంభందీంచిన గుడిని కట్టు కోవడనికి.. అదీ వారి స్థలంలో .. అనుమతి నిచ్చారంటే.. వారి దయా గుణానికి సిరస్సు వంచి నమస్కరించ వచ్చు..

ఇదంతా నాణానికి ఒక వైపు అన్నమాట. మరో వైపు.. మరో పుటతో..

------------

తల నుండు విషము ఫణికిని, వెలయంగ దొరకును వృశ్చికమునకున్,
తల తోక యనక నుండును, ఖలునకు నిలువెల్ల కదరా సుమతి

తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును, ఖలునకు నిలువెల్ల విషము గదురా సుమతీ

తనదాకా వస్తే గానీ .. రెండవ భాగం

క్రిందటి పుట, తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ.. జరిగిన తరువాత కొద్ది రోజులకు జరిగింది.. ప్రస్తుత కధాంశం. అస్సలు కధలోకి వచ్చేటప్పుడు కొంత ఉపోధ్ఘాతం.

ఇది జరిగిన ముందు రోజు కార్యాలయం నుంచి అధికారి చేత తిట్లు తిని, ఆలస్యంగా ఇంటికి చేరుకున్నా. తెల్లవారి ఝామున వేళ్ళలో అనుకుంటా అప్పటి మా క్లైంట్ ఫోన్ చేసి మేము ఇచ్చిన ప్రాజెక్ట్ పని చెయ్యటం లేదు కాస్త చూడమనగానే, సగంలో ఉన్న నిద్రకాస్తా ఎగిరిపోయింది. కొద్దిగా కష్ట పడగానే, ప్రాజక్టు మళ్ళీ మామూలు స్తితికి వచ్చేసింది. ’ఈ మాత్రం దానికే.. మాంఛి నిద్రలో ఉన్న నాన్ను మేలుకొలపాలా .. ’ అనుకుంటూ నిద్రకు ఉపక్రమించా. నిద్రకైతే ఉపక్రమించా గానీ, ఉదయం కార్యాలయానికి వెళ్ళి ఎంత మందిని తిట్టాలా.. ఎలా అస్సలు విషయాన్ని టీంలో ఉన్నవాళ్ళకు తెలియ జేయాలా.. మనం చేసే ప్రతీ పనికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి ఎలా తెలియజేయ్యాలా అనుకుంటూ కాలక్షేపం చేసా.

ఇంతలో ఎప్పుడు తెల్ల వారిందో తెలియదు, తీరా చూద్దునుకదా ఎనిమిదిన్నర. ఇంత లేటయినా లేపనందుకు పెళ్ళాన్ని తిట్టుకుంటూ, గబా గబా కాల కృత్యాలు తీర్చుకునే దిశగా ఉపక్రమించాను. ఎంత గబా గబా చేసినా తొమ్మిది పది అయ్యింది. ఇంతలో భార్య, తన ఆఫీస్‍కు లేటవుతోందని, టిఫిన్ చేసి హాట్ పాక్ లో పెట్టానని చెప్పడం లీలగా వినిపించింది. లఘు పూజ, ఫలహారం అయ్యేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటి, రాహు కాలం అయ్యింది. ఇంతకీ ఈ రాహు కాలమేమిటనుకుంటున్నారా..

మా ఇంటి దగ్గర నుంచి 9:20 లోపుల బయలు దేరితే, ట్రాఫిక్ జామ్ ఉండదు. కొంచం దాటిందా, ఇంతే సంగతులు. ఇప్పుడర్దమయ్యిందనుకుంటా.. పుణ్య కాలం అంటే, 9:20 లోపుల.. రాహు కాలమంటే.. 9:30 దగ్గరనుంచి అన్నమాట. ఆరోజు నా దురదృష్టవశాత్తు, నేను రాహు కాలంలో బయలు దేరవలసి వచ్చింది.

అయినా, వెయ్యి దేవుళ్ళను ప్రార్దిస్తూ బయట పడ్డా..

పైన చెప్పిన ప్రదేశం గుర్తు కొచ్చిందను కుంటా. నా ప్రయాణం పైన చెప్పిన U turn మొదటి దాకా బాగానే సాగింది. అదిగో అప్పుడు మొదలైంది నా కష్టకాలం.

నాకన్నా ముందు ఉన్న ఇద్దరు వాహన చోదకులు నాకు దారి ఇవ్వరు, వాళ్ళు వెళ్ళరు. తీరా కుడి చేతి వైపు చూడ బోతే, ట్రాఫిక్ పలచగా ఉంది. ఎదో విధంగా వీళ్ళని దాటుకుని ప్రక్క రోడ్డులోకి చేరుకుందా మనుకుంటూ ఉంటే, నాకోసమే పుట్టి నట్లుగా, వాళ్ళు కావాలని నాకు ఆడ్డం వస్తూ ముందుకు సాగి పోయ్యారు. నేను U turn, దగ్గర కి వచ్చే సరికి, నాకు ముందు ఒక ఆటో వాడు, కావలని ఇరికించెసాడు. ఒక్క నిమిషం కనక వీలు కలిగితే, దాటి పోయ్యేవాడిని. ఇంతలో అక్కడున్న రక్షక భటుడు, అందరినీ ఆపేశాడు. ఎవ్వరో మినిష్టర్ ఆ వైపుగా పోతున్నాడంట.

వాడి కోసం ముందున్న ట్రాఫిక్ అంతా కదిలించి రోడ్డు కాస్తా ఖాళీ చేయించారు. హమ్మయ్య.. పోతే.. పోయింది, కాస్త రోడ్డంతా విశాలంగా ఉంది .. ఝూయ్.. మంటూ పోవచ్చు అనుకుంటూ wait చెస్తున్నా.. ఇంతలో ఏమైందో ఎమో, ఉన్న ఫళ్ళంగా మయూరి పిలిమ్స్ ప్రక్కనుంచి జనం పలో మంటూ రావడం, అప్పటి దాకా మన మినిష్టరు గారికోసం ఎదురు చూస్తు దారి వదిలిన వాహన చోదకులు, ఉన్న జనంతో పాటుగా ఒక్కసారిగా ముందుకు దూకేసారు. ఇది అక్కడి పోలీసళ్ళకు మింగుడు పడలేదు. ఈ ఘటనని ఉపయోగించు కుంటూ నాముందున్న ఆటో వాడు, జనం మధ్యనుంచి ముందుకు దూకడానికి చేసిన ప్రయత్నంలో అడ్డుగా ఉన్న కానిష్టేబులు ని గుద్దేశాడు. ఇంకే ముంది, జనం మాకు ఆడ్డు పడ్డారు. నానా తతంగం..

సీను కట్ చేస్తే.. పది గంటల పది నిమిషాలు.. సిచ్యుయేషన్ సేమ్.. అదే స్తలం, అదే ట్రాఫిక్, చిన్న తేడా.. నేను బండి మీద.

ఒక వైపు లేటవుతోందన్న చికాకు.. మరోవైపు చెయ్యని తప్పుకు జనాల చేత మాటలు పడ్డ భాధ.. వీటన్నింటికీ మించి చిందర వందరగా ట్రాఫిక్. క్రిందటి పుటలో చెప్పినట్లు, ఫుట్ పాత్‍లు ఎక్కి పోయే వాహన ఛోదకులు.. అంతా కలసి గజిబిజి గందర గోళంగా తయారయ్యాయి. వీటన్నింటినీ మించి, క్రిందటి పుటలో నేను వహించిన పాత్ర ఒక ముసలాయన వహిస్తున్నారు.

వయస్సులో ఉన్న వాళ్ళంతా ఆయనను గేలి చేస్తూ, సాగి పోతున్నారు. ఎంత ఎక్క వద్దనుకున్నా, ప్రక్కనున్న వాళ్ళు నన్ను కూడా అటు వైపు పొమ్మంటూ వొత్తిడి చేస్తున్నారు. ఇంతలో ఒక యువకుడు, నన్ను తిట్టడం కూడా జరిగి పోయింది..

’బండి తోలడం చేతగాక పోతే ఎలా.. అటు చూడు, ఎంత మంది పోతున్నారో.. జర ప్రక్కకి తప్పుకో రాదే.. నేను గూడా పోతా..’

సరే కదా అని, అతనికి చోటిచ్చా.. అంతే సంగతులు, చీమ తలకాయ దూర్చేంత చోట్టిచ్చామంటే, ఏనుగునే దూర్చేసే రకం మన ద్విచక్ర వాహకులు. ఇరికించు కుంటూ మరో పది మంది దూరేశారు. వీళ్ళలో ఒకడు దాదాపు ముందు చెప్పిన ముశలాయనను గుద్దేంత పని చేశాడు. ఆ పెద్దాయన, ఈ కుర్రాడితో తగువుకు దిగాడు.

కుర్రాడు: ఏం.. అలా అడ్డంగా నిలబడక పోతే.. కొంచం జరగరాదే..

పెద్దాయన: కళ్ళు కనబడటంలే.. ఇది ఫుట్ పాత్ అనుకున్నావా.. లేక రోడ్డనుకున్నావా..

కుర్రాడు: కళ్ళు కనబడ పట్టే, బ్రేకు వేసా.. లేకుంటే.. ఈ పాటికి ఎగ్గిరి అక్కడ పడేవాడివి..

పెద్దాయన: గుద్దుతావురా.. బొత్తిగా క్రమశిషణ లేకుండా పెరిగితే.. ఇలాగే తయారవుతారు..

కుర్రాడు: ఏంది వయ్యా .. ఎదో ఎదో వాగుతున్నావ్..

ఇంక చూడడం నావల్ల కాలేదు. కొంచం ప్రక్కగా చేరి, బండి మీద ఉన్న కుర్రాడితో... ఎదో చెప్ప జూసా.. ఇంతలో వెనకనుంచి ఎవ్వడో మరో డ్రైవర్ మెల్లగా వచ్చి నా బండిని గుద్దాడు..

మీరెందుకు సారు ఆగుతారు.. వాళ్ళ భాధ వాళ్ళేదో పడతారుగా.. మీరు కానీయ్యండి

ఇక చేసేది ఏమీ లేక, నాకు అప్పటికే ఆలస్యం అయ్యేటప్పటికి, స్వకార్యం .. స్వామి కార్యం (పెద్దాయనని రక్షించే పని) గా పనికొస్తుందని, ఫుట్ పాత్ ఎక్కించి, ముందున్న కుర్రాడి బండికి ఒక చిన్న డాష్ ఇచ్చా.. వాడికన్నా నేను పెద్దగా కనబడ్డానేమో.. గుర్రుగా చూస్తూ ఒక లుక్కేసాడు..

నేను: కానీ .. పద.. పద..

కుర్రాడు: ఏంది సార్.. ఈయన చూడండీ..

నేను: ఏందయ్యా చూసేది.. పెద్దాయన్ని పట్టుకుని..

కుర్రాడు: పెద్దాయన..!!! (ఎదో ఆశ్చర్యం ప్రకటిస్తున్నట్లు..) అలా మాట్లాడు తున్నాడా..

నేను: ఆయన విషయం ప్రక్కన పెట్టు.. నువ్వు మాకు అడ్డంగా తయారయావు.. నీ సంగతి చూసుకో.. లేదా.. ప్రక్కకి తప్పుకో.. అంటూ ఒక్కసారి నా బండి ఎక్సలరేటర్ రైజ్ చేసా..

ఏమనుకున్నాడో ఏమో.. వెంటనే, ముందుకు లాగించేసాడు.. ప్రక్కనున్న పెద్దాయన ఇవేమీ గమనించనట్లు నన్ను కూడా ఓ రెండు తిట్టి ’క్రిందకి ఫో..’ అన్నట్లు ఓ లుక్కేశారు. అలా ఫుట్ పాతు ఎక్కిన నేను, ఆరోజు అనుకున్నా, మనం ఎంత వద్దనుకున్నా ..

ఈట్రాఫిక్ మనచేత తప్పుడు పనులు చెయ్యాలనుకోకుండానే చేయిస్తుందని

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

తనదాకా వస్తే గానీ తెలియదంటారే.. అలాగే.. నాకూనూ..

మొదటి సన్నివేశం:

ప్రస్తుత సన్నివేశ స్థలం

సమయం: ఉదయం పది గంటలు

ప్రదేశం: ప్రబుత్వ మహిళా కాలేజి, బేగంపేట, హైదరాబాదు

పాత్రలు పాత్రధారులు : నేను మరియు ఆఫీసులకు పోయ్యే హైదరాబాదీ జనం. పైన చిత్రంలో పసుపురంగు నేను

పరిస్తితి: ట్రాఫిక్ చాలా బాగా ఉంది, ఆంగ్లంలో crawling అనే పదానికి, తెలుగులో పాకుతోంది అనే పదానికి సరిపోయే విధంగా, ఆరోడ్డుపై నిలచి ఉన్న కార్లు మెల్లగా .. అతి మెల్లగా కదులుతున్నాయి

అసలు కధ:

హీరో : ఇంకెవ్వరో కాదు నేనే

నా ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‍కి ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తుండటంతో, ఆ రోజు ఉదయానే రాహుల్ బజాజ్ సర్వోసింగ్ షోరూమ్‍లో ఇచ్చి, ఇంటికి వచ్చా. అర్దాంగి వేడి వేడిగా ఇడ్లీలు వేసి ఇస్తే.. గుటుక్కు మంటూ లాగించేస్తుండగా మెరుపులా మెదిలింది ఓ ఆలోచన. మేము ఉండేది, బ్రాహ్మణవాడ, బేగంపేట రైల్వేస్టేషన్ దగ్గర. ఆఫీసేమో జూబ్లీహిల్స్. రోజూ ఆఫీసుకు వెళ్ళాలంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గుండా U టర్న్ కొట్టి, మహిళా కళాశాల మీదుగా, లైఫ్ స్టైల్ దగ్గరి ఫ్లైఓవర్ మీదుగా సోమాజీగూడ చేరుకుంటా. ప్రతినిత్యం ద్విచక్ర వాహనం ఉండడం వలన అందునా తొందరగా బయలు దేరుతానేమో, ట్రాఫిక్ సమస్య అంతగా చికాకుగా అనిపించదు. ఆరోజు బండి లేకపోవడంతో ఆటోలో వెళదాం అనుకున్నా. కానీ పైన చెప్పినట్లు మెరుపులా ఒక ఆలోచన మదిలో మెదిలింది.

 

నాతో పనిచేసే మరో సహ ఉద్యోగిని సికింద్రాబాద్ నుంచి వస్తారు. ఆవిడ కారులో వస్తారు. ఎలాగో ఇటునుంచేకదా వెళ్ళేది అని తలంచి వెంటనే ఒక తంతి తగిలించా. అదేనండీ, ఫోను కొట్టా. ఎప్పుడు అడక పోవడం వల్ల, అడగంగానే ఒప్పుకున్నదామె. కాకపోతే ఒక చిన్న మెలిక పెట్టింది. ఆవిడ ఇంటి దగ్గరే కొంచం లేటుగా బయలు దేరుతాను కాబట్టి, ’నేను మహిళా కాలేజీ దగ్గరకు చేరుకునేటప్పటికి దాదాపు పావుతక్కువ పదకొండవుతుంది.. ఫరవాలేదా..’ అంది. ’ దానిదేముంది.. ఒక్క రోజు ఆఫీసుకి లేటుగా పోతే నన్నెవరూ అడగరు .. మెల్లగానే రండీ..’ అంటూ సమాధానమైతే ఇచ్చాగానీ. ఆఫీసుకి లేటుగా వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. ఎదైతే ఎంటి, ఎలాగో అడిగేశాం .. ఇక ఆవిడకోసం వెయిట్ చెయ్యకపోతే బాగుండ దనుకుని ఇంట్లోనే పది నలభై వరకూ కాలక్షేమం చేసా.

 

ఇక చాల్లే అనుకుని మెల్లగా స్కూల్ బ్యాగ్ భుజానేసుకుని.. అదేనండీ ల్యాప్ టాప్.. మెల్లగా మైన్ రోడ్డుకి చేరుకున్నా. ఇదిగో ఇక్కడ అస్సలైన కధ మొదలైంది. చూడబోతే, ట్రాఫిక్ చాల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఎదోలే అనుకుంటూ మెల్లగా ఫుట్ పాత్ మీదుగా నడుచుకుంటూ మేమిద్దరం అనుకున్న చోటుకి చేరుకున్నా. ఇదిగో ఇప్పుడు మొదలైంది అస్సలు సీను.. కష్టాల సీను. ట్రాఫిక్ బాగాఉండటం వల్ల, ద్విచక్ర వాహనాలు మెల్లగా రోడ్డు మీదనుంచి, ఫుట్ పాత్ ఎక్కుతున్నాయి. నేనేమో అక్కడే అడ్డంగా నించున్నానాయే. ఇంక చేసేదేమీ లేక వాహన చోదకులు అడగలేక మెల్లగా నా ప్రక్కనుంచి ఫుట్ పాత్ ఎక్కేస్తున్నారు. నాకేమో ఈ తతంగం అంతా చాలా చికాకుగా ఇబ్బందిగా ఉంది. ఇక లాభం లేదనుకుని. ఫుట్ పాత్‍కి అడ్డంగా నిల్చొని వచ్చే వాళ్ళందరినీ పోలీసులా గదమాయించడం మొదలుపెట్టా..

’ఏందిది.. ఇదేమన్నా రోడనుకున్నారా.. ఫుట్‍పాత్.. అటునుంచి వెళ్ళండి..’ నా స్వరంలో కోపం కొట్టొచ్చినట్లుగా అనిపించగానే..

’కొంచం తపుకో అన్నా.. ట్రాఫిక్ చూసావుగా.. ఆఫీసుకి లేటైతోందే..’ అంటున్నాడు ఓ మొటరిస్టు

’ఫుట్ పాత్‍లు ఉన్నవి.. మనుష్యులు నడవడానికి బాసూ.. బండ్లు నడపడానికి కాదు .. అర్ద మైందా..’ అంటూ.. ’పోలీసోళ్ళు ఇక్కడ నిలబడి, ఫుట్‍పాత్‍లు ఎక్కి నడిపించే వీళ్ళందరికీ ఫైన్ వెయ్యచ్చు కదా..’ అని మనసులో అనుకుంటూ ఉండగానే .. జూయ్యి మంటూ మరో మోటరిస్టు అమాంతం వచ్చి గుద్దినంత పని చేసాడు..

’ఏం బాసూ కనబడటంలే.. అలా అడ్డం నిలబడక పోతే తప్పుకోవచ్చుగా ..’ డబాయిస్తున్నాడు. ’ఎదో పెద్ద ఈ ఫుట్ పాత్‍లన్నీ వీళ్ళే కట్టించినట్లు.. చూడండి ఎలా అడ్డం నుంచున్నాడో..’ ప్రక్కనున్న మరో మొటరిస్టుతో అనగానే..

అప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా ఒక్క దూటున నా మీద విరుచు పడ్డారు. ’ఏందయ్య.. ఇందాకణ్ణించి చూస్తున్నాం .. ఎవ్వరినీ ఫుట్ పాత్ ఎక్కనివ్వటం లేదు .. ఇదేమన్నా నీ బాబు జాగీరనుకున్నావా...’ మరో గొంతుకు ..

’జరగవయ్యా.. జరగమంటూంటే వినబడటం లేదా..’ ఇంకొడడు.. ఎక్కడ లేని ఐక్యత వీళ్ళందిరిలో ఒక్క సారిగా పుంజుకుంది.

ఇలా ఒకరొకరుగా నామీద యుధానికి దిగటంతో, అలవి కాని చోట అధికుల మన రాదన్నట్లు.. ప్రక్కకి జరిగి వాహన చోదకులకు త్రోవనిచ్చా.. దొరికిందే తడవుగా, ఒకళ్ళు తరువాత మరొకళ్ళు దూసుకుంటూ ఫుట్‍పాత్ పైకి పోనిచ్చేసారు..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

మరో పుటలో తరువాతి సన్నివేశం.. అంత వరకూ ’ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహిస్తూ ఉండకండే.. ’. ఈ పుటకి స్పందిస్తూ తరువాత situation ఎమై ఉంటుందో మీఊహకి ఎలా తోచిందో.. నేను ఈ పుటకి శీర్షికగా ’తనదాక వస్తే కానీ..’ అంటూ ఎందుకు పెట్టానో చెప్పకోండి చూద్దాం



ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన, నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా, విశ్వదాభిరామ! వినురవేమ!

 
Clicky Web Analytics