మొదటి సన్నివేశం:
సమయం: ఉదయం పది గంటలు
ప్రదేశం: ప్రబుత్వ మహిళా కాలేజి, బేగంపేట, హైదరాబాదు
పాత్రలు పాత్రధారులు : నేను మరియు ఆఫీసులకు పోయ్యే హైదరాబాదీ జనం. పైన చిత్రంలో పసుపురంగు నేను
పరిస్తితి: ట్రాఫిక్ చాలా బాగా ఉంది, ఆంగ్లంలో crawling అనే పదానికి, తెలుగులో పాకుతోంది అనే పదానికి సరిపోయే విధంగా, ఆరోడ్డుపై నిలచి ఉన్న కార్లు మెల్లగా .. అతి మెల్లగా కదులుతున్నాయి
అసలు కధ:
హీరో : ఇంకెవ్వరో కాదు నేనే
నా ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‍కి ఇచ్చి దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తుండటంతో, ఆ రోజు ఉదయానే రాహుల్ బజాజ్ సర్వోసింగ్ షోరూమ్‍లో ఇచ్చి, ఇంటికి వచ్చా. అర్దాంగి వేడి వేడిగా ఇడ్లీలు వేసి ఇస్తే.. గుటుక్కు మంటూ లాగించేస్తుండగా మెరుపులా మెదిలింది ఓ ఆలోచన. మేము ఉండేది, బ్రాహ్మణవాడ, బేగంపేట రైల్వేస్టేషన్ దగ్గర. ఆఫీసేమో జూబ్లీహిల్స్. రోజూ ఆఫీసుకు వెళ్ళాలంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గుండా U టర్న్ కొట్టి, మహిళా కళాశాల మీదుగా, లైఫ్ స్టైల్ దగ్గరి ఫ్లైఓవర్ మీదుగా సోమాజీగూడ చేరుకుంటా. ప్రతినిత్యం ద్విచక్ర వాహనం ఉండడం వలన అందునా తొందరగా బయలు దేరుతానేమో, ట్రాఫిక్ సమస్య అంతగా చికాకుగా అనిపించదు. ఆరోజు బండి లేకపోవడంతో ఆటోలో వెళదాం అనుకున్నా. కానీ పైన చెప్పినట్లు మెరుపులా ఒక ఆలోచన మదిలో మెదిలింది.
నాతో పనిచేసే మరో సహ ఉద్యోగిని సికింద్రాబాద్ నుంచి వస్తారు. ఆవిడ కారులో వస్తారు. ఎలాగో ఇటునుంచేకదా వెళ్ళేది అని తలంచి వెంటనే ఒక తంతి తగిలించా. అదేనండీ, ఫోను కొట్టా. ఎప్పుడు అడక పోవడం వల్ల, అడగంగానే ఒప్పుకున్నదామె. కాకపోతే ఒక చిన్న మెలిక పెట్టింది. ఆవిడ ఇంటి దగ్గరే కొంచం లేటుగా బయలు దేరుతాను కాబట్టి, ’నేను మహిళా కాలేజీ దగ్గరకు చేరుకునేటప్పటికి దాదాపు పావుతక్కువ పదకొండవుతుంది.. ఫరవాలేదా..’ అంది. ’ దానిదేముంది.. ఒక్క రోజు ఆఫీసుకి లేటుగా పోతే నన్నెవరూ అడగరు .. మెల్లగానే రండీ..’ అంటూ సమాధానమైతే ఇచ్చాగానీ. ఆఫీసుకి లేటుగా వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. ఎదైతే ఎంటి, ఎలాగో అడిగేశాం .. ఇక ఆవిడకోసం వెయిట్ చెయ్యకపోతే బాగుండ దనుకుని ఇంట్లోనే పది నలభై వరకూ కాలక్షేమం చేసా.
ఇక చాల్లే అనుకుని మెల్లగా స్కూల్ బ్యాగ్ భుజానేసుకుని.. అదేనండీ ల్యాప్ టాప్.. మెల్లగా మైన్ రోడ్డుకి చేరుకున్నా. ఇదిగో ఇక్కడ అస్సలైన కధ మొదలైంది. చూడబోతే, ట్రాఫిక్ చాల ఇబ్బడి ముబ్బడిగా ఉంది. ఎదోలే అనుకుంటూ మెల్లగా ఫుట్ పాత్ మీదుగా నడుచుకుంటూ మేమిద్దరం అనుకున్న చోటుకి చేరుకున్నా. ఇదిగో ఇప్పుడు మొదలైంది అస్సలు సీను.. కష్టాల సీను. ట్రాఫిక్ బాగాఉండటం వల్ల, ద్విచక్ర వాహనాలు మెల్లగా రోడ్డు మీదనుంచి, ఫుట్ పాత్ ఎక్కుతున్నాయి. నేనేమో అక్కడే అడ్డంగా నించున్నానాయే. ఇంక చేసేదేమీ లేక వాహన చోదకులు అడగలేక మెల్లగా నా ప్రక్కనుంచి ఫుట్ పాత్ ఎక్కేస్తున్నారు. నాకేమో ఈ తతంగం అంతా చాలా చికాకుగా ఇబ్బందిగా ఉంది. ఇక లాభం లేదనుకుని. ఫుట్ పాత్‍కి అడ్డంగా నిల్చొని వచ్చే వాళ్ళందరినీ పోలీసులా గదమాయించడం మొదలుపెట్టా..
’ఏందిది.. ఇదేమన్నా రోడనుకున్నారా.. ఫుట్‍పాత్.. అటునుంచి వెళ్ళండి..’ నా స్వరంలో కోపం కొట్టొచ్చినట్లుగా అనిపించగానే..
’కొంచం తపుకో అన్నా.. ట్రాఫిక్ చూసావుగా.. ఆఫీసుకి లేటైతోందే..’ అంటున్నాడు ఓ మొటరిస్టు
’ఫుట్ పాత్‍లు ఉన్నవి.. మనుష్యులు నడవడానికి బాసూ.. బండ్లు నడపడానికి కాదు .. అర్ద మైందా..’ అంటూ.. ’పోలీసోళ్ళు ఇక్కడ నిలబడి, ఫుట్‍పాత్‍లు ఎక్కి నడిపించే వీళ్ళందరికీ ఫైన్ వెయ్యచ్చు కదా..’ అని మనసులో అనుకుంటూ ఉండగానే .. జూయ్యి మంటూ మరో మోటరిస్టు అమాంతం వచ్చి గుద్దినంత పని చేసాడు..
’ఏం బాసూ కనబడటంలే.. అలా అడ్డం నిలబడక పోతే తప్పుకోవచ్చుగా ..’ డబాయిస్తున్నాడు. ’ఎదో పెద్ద ఈ ఫుట్ పాత్‍లన్నీ వీళ్ళే కట్టించినట్లు.. చూడండి ఎలా అడ్డం నుంచున్నాడో..’ ప్రక్కనున్న మరో మొటరిస్టుతో అనగానే..
అప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా ఒక్క దూటున నా మీద విరుచు పడ్డారు. ’ఏందయ్య.. ఇందాకణ్ణించి చూస్తున్నాం .. ఎవ్వరినీ ఫుట్ పాత్ ఎక్కనివ్వటం లేదు .. ఇదేమన్నా నీ బాబు జాగీరనుకున్నావా...’ మరో గొంతుకు ..
’జరగవయ్యా.. జరగమంటూంటే వినబడటం లేదా..’ ఇంకొడడు.. ఎక్కడ లేని ఐక్యత వీళ్ళందిరిలో ఒక్క సారిగా పుంజుకుంది.
ఇలా ఒకరొకరుగా నామీద యుధానికి దిగటంతో, అలవి కాని చోట అధికుల మన రాదన్నట్లు.. ప్రక్కకి జరిగి వాహన చోదకులకు త్రోవనిచ్చా.. దొరికిందే తడవుగా, ఒకళ్ళు తరువాత మరొకళ్ళు దూసుకుంటూ ఫుట్‍పాత్ పైకి పోనిచ్చేసారు..
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
మరో పుటలో తరువాతి సన్నివేశం.. అంత వరకూ ’ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహిస్తూ ఉండకండే.. ’. ఈ పుటకి స్పందిస్తూ తరువాత situation ఎమై ఉంటుందో మీఊహకి ఎలా తోచిందో.. నేను ఈ పుటకి శీర్షికగా ’తనదాక వస్తే కానీ..’ అంటూ ఎందుకు పెట్టానో చెప్పకోండి చూద్దాం
ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన, నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా, విశ్వదాభిరామ! వినురవేమ!
3 స్పందనలు:
మీరు నిన్నో మొన్నో ఆ పుట్పాతు మీద బండి తోలి ఉంటారు ...
లేక రెపటి నుంచి నేర్చుకుంటున్నారు ...
నాకు పచ్చగా ఐథె వాకొవెర్ బ్రిడ్జి కనిపిస్తొంది
మరి అంత చిన్న చుక్క పెడితె ఎలా అండి ;)
మీ సహ ఉద్యోగిని కూడ అలానే వచ్చి ఉంటారు.
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site manalati bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Post a Comment