అమెరికాలో రిక్షాలు

అమెరికాలో కూడా రిక్షాలు ఉంటాయి అని నాకు నిన్ననే తెలిసింది. ఆశ్చర్యం కాక పోయినా వీళ్ళ విధానాలు కొన్ని బాగానే ఉన్నాయనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయే.. అవే రిక్షాలు ... వాళ్ళే ఈ రిక్షాలను లాగే వాళ్ళు. వీళ్ళంతా ఈ రిక్షాలను సాయంత్రం వేళ్ళల్లో అద్దెకు తెచ్చుకుంటారు. తెచ్చుకుని, ఎక్కువగా యాత్రికులు వచ్చే యాత్ర స్థలాలో ఈ విధంగా నిలబడి పిచ్చాపాటి వేసుకుంటూ ఎవ్వరైనా బకరాలు దొరుకుతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు.


ఆడవాసన తగలగానే చొంగ కార్చుకునే వారు అన్ని చోట్ల ఉంటారు అనడం అతిశయోక్తి కాదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాలలో జనాలు ఎదో పెద్ద సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళ జోలికి పోరు అని చాలా మంది నాకు ఙ్ఞాన భోధ చేసారు. ఏది ఏమైనా, త్యాగరాజు అన్నట్లు.. "ఎంత నేర్చిన ఎంత జూచినఎంత వారలైన కాంత దాసులే.. సంతతంబు ..", కొప్పు చూస్తే చాలు కొట్టుకు చచ్చే వాళ్ళు అన్ని చోట్లా ఉంటారనేది జగద్వితం అని మరొక సారి రుజువు అయ్యింది



అలాగే ఈ క్రింది చిత్రంలో రిక్షాల వెనకాల గుఱ్రం బగ్గీ కూడా కనబడుతోంది కదా. అది కూడా ఇలాంటిదే. ఇవి ఇక్కడకు వచ్చే యాత్రికుల కోసం ప్రక్కనే ఉన్న హోటల్ వాడు ఏర్పాటు చేసాడు. వీటిల్ని అద్దెకు తీసుకునే వారు రోజుకు 40 డాలర్లు చెల్లిస్తారు. యాత్రికులను నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడకు తీసుకు వెళతారు. ఇందుకు ప్రతి ఫలంగా ఇంత కావాలని అడగకుండా.. భారత దేశంలో క్షురకుడు అడిగేటట్లుగా, ’మీ స్థోమతకు తగ్గట్లుగా’ అనో.. లేక .. ’తమ ఆనందం ఎంతిచ్చినా సరే..’ అనో చాక చక్యంగా అడుగుతారు.


ఇదిగో ఇలా విహారం చెయ్యవచ్చన్న మాట. వెలుగు ఉన్న వేళల్లో తిరిగే జంటలు ఎక్కువగా శృంగార చర్యల కొరకే పరిమిత మవ్వడం నాకెందుకో మింగుడు పడలేదు. నేను అనుకోవడం ఈ జంటలు ఙ్ఞాపాల నిధిని నిక్షిప్తం చేసుకోవడానికే అలా చేస్తున్నారని సర్దుకోవడం తప్ప మనం చేసేది ఏముంటుంది. కన్నులు పండగ చేసుకునే వారికి చేసుకున్నంత. ఏలా ఉంది నా ఈ అమెరికా రిక్షాల పుట?
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics