కోలుకోవడం ఎంత కష్టమో!!

ఈ మధ్య రెండు వార్తలు నన్ను చాలా భాధకి గురిచేసాయి. వాటిలో ఒకటి రోజుల పసిగొడ్డుని చెత్తబుట్టలో వేసి పోయిన తల్లి తండ్రుల వార్తలు మనకి అను నిత్యం కనబడుతుంటాయి కానీ ఈ నాటి ఈ వార్తలో విషయం నన్ను మరింత భాద పెట్టింది. అది ఆ పసి గొడ్డు ప్రాణాలతో మాత్రం లేదు. అది నన్ను మరింత భాదలోకి నెట్టేసింది. తేరుకోవడానికి కొంచం టైం పట్టింది.

మరో విషయం పూర్తిగా స్వవిషయం. స్వవిషయాన్ని నలుగురితో పంచుకునేంత మహాత్ముడిని కాలేదు కాబట్టి ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించాలి. భాధ పడటం నాకు క్రొత్తేం కాదు గానీ పడ్డ భాధలోంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు. ఎందుకంటే నన్ను నేను ఓదార్చుకునే వాడిని. ఈ సారి నన్ను నేను ఓదార్చుకోవడానికి కూడా శక్తి చాలలేదు.

నేను శక్తిని కూడకట్టుకుని నన్ను నేను నిభాళించుకునేంత వరకూ మౌనంగా ఎదురుచూడటం తప్పితే చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. మనసులో కలిగిన గాయాన్ని కాలం పరిష్కరించేంత వరకూ ఎదురు చూడటమే అని ఎదురుచూస్తున్నంతలో కొత్త బంగారులోకం సినిమాలోని ఓ డైలాగ్ నాకు మంచి ఆయింట్ మెంట్ లాగా అనిపించింది. ప్రకాష్ రాజ్ కి పిల్లల విషయం తెలిసి ఒకటే డైలాగ్ కొడతాడు..

నాకు తెలిసిందల్లా ఒక్కటే.. ఇంకా ఎక్కువగా ప్రేమించడమే ..

 
Clicky Web Analytics