ఇవాళ ఉదయం సప్తగిరి స్టూడియోకి వెళ్ళి వస్తూ ఉంటే దారిలో ఇవిగో ఇవి కనబడ్డాయి. మేము వీటిల్ని శీమ సింత కాయలు అంటాము. ఇంతకీ ఇవి “సింతకాయలా” లేక “చింతకాయలా”!!
ఏదో ప్రజల నోట్లో పడి వ్యవహారిక భాషలో అవి సింతకాయలయ్యాయా??
ఏది ఏమైనా నేను వీటిల్ని చాలా రోజుల తరువాత!!! కాదు కాదు చాలా సంవత్సరాల తరువాత తింటున్నాను. అందునా కొనుక్కుని మరీ తింటున్నాను. ఈ మాట వ్రాసినప్పుడు చాలా బాధ వేసింది. అంటే నా ఉద్దేశ్యం డబ్బులు ఖర్చు పెట్టాను అని కాదు కానీ, ఊరికే దొరికె వస్తువుని అందునా.. ఎటువంటి శ్రధ లేకపొయినా చెట్టుకు కాసేదానిని కొనుక్కుని తినె పరిస్థితి వచ్చినందులకు.
నాకు ఇప్పటికీ గుర్తు, విజయవాడలో ఏకేటీపీ హైస్కూల్ ఆవరణలో ఈ చెట్టు ఇరగ కాసేది. సాయాంత్రం వేళ్ళల్లొ బడి నుంచి తిరిగి వస్తూ.. ఎంచక్కా మేము ఆ గ్రౌండులో కబడ్డి ఆడుకుని పోతు పొతూ చేతికి చిక్కినన్ని కోసుకుని జేబులొ పట్టినన్ని కుక్కుకుని గ్రంధాలయం ఎదురుగా ఉన్న పార్కు పంపులో మంచి నీళ్ళు త్రాగి ఇంటికీ చేరుకునే వాళ్ళం. ఇదిగొ సరిగ్గా అప్పుడే మా అమ్మ ఓ గుడ్డు పెద్ద గ్లాసు నిండా బోర్నవీటా ఇచ్చేది. అప్పటికే కడుపు నీండి ఉండడం వల్ల ఏవేవో సాకులుచె ప్పి తప్పీంచు కునే ప్రయత్నంలో మా వీపులు రామకిర్తనలు పాడేవి.
ఎలా కని పెట్టేదొ ఏమో కానీ మా అమ్మ అసలు విషయాన్ని కనిపెట్టెది. అంతే “అబద్దం చెబుతార్రా!!” అంటూ మరో విడత మ్రోగించెది. ఇంతకీ ఇవి తినడం వలనఏ వైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటె.. ఏమో.. నా దగ్గర సమాధానం లేదు.
చదివే చదువరులలో ఎవ్వరికైనా వీటి ఉపయోగాలు ఏవైనా తెలిసి ఉన్నట్లైతే తెలియ జెయగలరు.