నచ్చింది

ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదు. ఎందుకని అంటే, ఏవేవో కారణాలు కనబడుతున్నాయి. కానీ ఈ విషయం వ్రాయడానికి ఎందుకో వెనకాడకుండా అనుకున్నదే తడవుగా వ్రాసేస్తున్నాను. దాని కారణం సంగీతం. నా పెళ్ళికి ముందు నేను నా భార్యని అడిగిన మొట్ట మొదటి పని ఏమిటో తెలిస్తే మీరు నవ్వు కుంటారు. అప్పట్లో నేను బెంగళూర్ నగరంలో పని చేసే వాడిని. సెలవలకి విజయవాడ వస్తున్నానని అందునా నాకు విజయవాడలో చాలా పనులున్నాయి కావున వీలైతే పంచ రత్న కీర్తలన సీడీ దొరుకుతుందేమో అని వెతక మని చెప్పాను. అలా నా భార్యనుంచి నేను అందుకున్న మొట్ట మొదటి కానుక పంచ రత్న కీర్తనల సీడి.

నాకు ఉన్న కొన్ని బల హీనతలలో ఒకటి సంగీతం. దీనియందు నన్ను నేను కోల్పోతుంటాను. ఇప్పుడే ఓ సన్నిహితుడు నాకు ఈ క్రింద చూపబడిన వీడియో గురించి తెలియ జేసారు. ఈ సంగీతంలో చివ్వరలో వచ్చే గమకాలు, ఉదృతంగా సాగుతూ ఆఖరికి ప్రశాంతంగా అంతం అయ్యే విధానం భలే నచ్చిందనుకోండి.

ఇలాంటి సంగీతాన్నిచ్చిన ఈ సంగీత కారుల గురించి వ్రాయకుండా అలాగే వారిని మెచ్చుకోలేకుండా ఉండలేను. ఈ సంగీత సరస్వతీ పుతృలు ఇలాగే మరికొన్ని అభుత కీర్తనకు సమకూర్చి ఇంతకింతకు ఎదిగి సంగీత ప్రపంచంలో కీర్తిని పొందాలని మనసారా కోరుకుంటున్నాను.

 
Clicky Web Analytics