నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని పూరిద్దాం కదా అని చేసిన నా ప్రయత్నంలో నేను బొటా బొటిన పాస్ అయ్యాను అని చెప్పుకోవచ్చు. మేము చదువుకునే రోజుల్లో బొటా బొటి అంటే వందకు పాస్ మార్క్ అన్నమాట. హిందిలో అయితే వందకు పదిహేను మార్కులు వస్తే పాస్ అన్న మాట అలాగే మిగిలిన సభక్ట్ లలో అయితే ముప్పై ఐదు వస్తే పాస్ అన్న మాట. ఆ లెక్కలో నాకు వందకు నలభై మార్కులు వచ్చాయి.
సమస్యలో వాడు ఇచ్చింది ఐదు ఖాళీలు పూరించమని. నాకు ఙ్ఞప్తికి వచ్చినవి రెండు. అంటే పాస్ అన్న మాట. వాడు ఇచ్చినవి వాటిల్లో నాకు వచ్చినవి ఇక్కడ ఉంచుతా.
వరుస | తెలుగు పదం | మొదటి అక్షరం | రెండొవ అక్షరం | మూడవ అక్షరం | నాల్గవ అక్షరం | ఐదవ అక్షరం |
౧ | బ్రతికిన | V | E | |||
౨ | ధైర్యము | B | R | A | V | E |
౩ | నడువు | V | E | |||
౪ | నదులు | V | E | |||
౫ | బానిస | S | L | A | V | E |
మిగిలిన తెలుగు పదాలకు ఆంగ్ల పదాలు ఏమై ఉంటుందబ్బా!!