రక్షించండి .. మమ్మల్ని కాపాడండి

ముందుగా మన ముఖ్యమంత్రి డా. వై. ఏస్. ఆర్ మృతికి రెండులైన్ల సంతాపం
.
.
ఇక విషయానికి వస్తా.

ఇదిగో ఇక్కడ చూస్తున్న చిత్రం మేముండే ప్రదేశం. పేరంటారా!! బ్రాహ్మణవాడ. ఇది నాలుగు వైపులా మూసేసి ఉన్న ఒక ప్రదేశం. ఎక్కడ ఉందంటారా!! అదేనండి, బాగ్యనగరంలో బేగం పేటలో ఉంది. మా వాడకి ఒక వైపు ఎప్పుడూ పారే మురికి కాలువ మరోవైపు లోకల్ రైళ్ళు వెళ్ళడానికి అనువుగా ఏర్పరచిన రైల్వే లైన్. కనబడుతోంది కదా. మరి మేము బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే మాకు ఉన్నవి రెండే రెండు దార్లు. అవే మీకు చిత్రంలో ఎర్ర రంగులో వేసిన బాణం గుర్తుతో సూచించ బడ్డాయి. మీరెప్పుడైనా లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళారా.. అయితే మీకు ఓ ప్రక్కగా వరుణ్ మోటర్స్ వారి బోర్డు తపని సరిగా కనబడి ఉంటుంది అలాగే మరోప్రక్కగా అమ్మవారి గుడి కూడా చూసే ఉంటారు. వీటిల్లో రెండు వన్ వే దార్లే.

ఇంత సోదెందుకు అంటారా!! అదిగో అక్కడికే వస్తున్నా. మన ముఖ్యమంత్రి పార్దివ శరీరం ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉంది. అలాగే వీరికి శ్రధ్ధాంజలి ఇవ్వడానికి వచ్చే మంత్రులు, ప్రముఖులు అందరూ చక్కగా బేగం పేట విమానశ్రయంలో దిగి వీరింటికి వెళుతున్నారు. ఇలా వచ్చిన వాళ్ళలో ప్రధాని మన్ మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గార్లు ఉన్నారు. వీరందరికీ ఉన్న ఒకే ఒక దారి సదురు లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. అందువల్ల చాలా టైట్ సెక్యూరిటి. అంతే కాకుండా మా దార్లు రెండూ పోలీసోళ్ళ కభ్జా. మేము బాహ్య ప్రపంచాన్ని చేరుకోవాలంటే ఈ పోలీసోళ్ళను దాటుకుని వెళ్ళాలి. ఏమైనా అంటే లాఠీ ఛార్జీ చెయ్యడమే కాకుండా కాల్పులు కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ చేతుల్లోని రివాల్వర్లను చూసిన జనాలకి మాట పడిపోయి మూగోళ్ళై పోయారు. ఏమైనా అంటే టప్పుక్కున కాల్చేసి విధ్వంసానికి కారణమౌతున్నాడు అందుకే కాల్చేసాం అంటే, అడిగే వాడెవ్వడూ ఉండడు.

పైగా అందరూ z కాటగిరీ ప్రముఖులే. అన్నంత మాత్రాన మా రోజువారి కార్యక్రమాల పరిస్థితేమిటి? మేము బాహ్య ప్రపంచానికి అకర్లేదా .. మాకు బయటి ప్రపంచంతో సంబందాలు అక్కర్లేదా.. మేము ఎక్కడికీ వెళ్ళకూడదా.. మాయింటికి ఎవ్వరు రావాలన్నా వారి పరిస్థితేమిటి? సామాన్య జనం ఈ దారిన వెళ్ళకూడదా?? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?? చెప్పే నాధుడెవ్వడు?

 

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics