ఓ చెత్త పోస్ట్ - ఎడ్వర్‍టైజ్‍మెంట్స్

ఇవ్వాళ Z సినిమా వారి ఛానెల్లో అష్టాచమ్మా సినిమా వస్తుంటే, అప్పుడెప్పుడో ఈ సినిమా బాగుంది అన్న మాటపై ఈ సినిమాని చూడటానికి సిద్దమైయ్యాను. ఇంతకు ముందు ఇలాగే ఓ సారి మంగతాయారు అనే సీరియల్ మధ్యలో వచ్చే ప్రకటనల గురించి వ్రాసుకున్నాను. ఇప్పుడు సినిమా మధ్యలో వచ్చే ప్రకటనల గురించి.

ఇక సినిమా బ్రేకుల మధ్య వచ్చే ప్రకటనలగురించి వ్రాసే ముందుగా ఓ పచ్చి నిజం. ప్రకటనలు దాదాపు ఎనిమిది నిమిషాలకు అటూ ఇటూగా సాగుతాయి. సరాసరిన అవి ఎనిమిదిన్నర నిమిషాలు ఉంటాయన్నమాట. దానికి తోడు సినిమాని అధికపక్షం పధ్నాలుగు నిమిషాలుగా సాగిస్తూ అధమ పక్షం పది నిమిషాల వ్యవధిలో ప్రకటనల కొరకు బ్రేక్ ఇస్తారన్నమాట. అంటే దాదాపుగా ఓ ఇరవై నుంచి పాతిక ప్రకటనలు ప్రసారం చేస్తున్నారు.

ప్రధానంగా ఎక్కువ ప్రకటనలు దాదాపు ఇరవై సెకన్ల వ్యవధిలో సాగుతాయి. ఆ తరువాత స్థాయిలో ముప్పై నిమిషాల వ్యవధిలో సాగే ప్రకటనలు ఉంటే, ఇరవై ఐదు సెకన్ల వ్యవధి కలిగిన మరియు పదిహేను సెకన్ల వ్యవధిలో కలిగిన ప్రకటనలు అటూ ఇటూగా మూడు నాలుగు స్థానాలను ఆక్యుపై చేస్తాయి.

image ఇదిగో ఇక్కడ చూపినట్లుగా ఎనిమిదిన్నర నిమిషాల సరాసరి సమయాన్నిముక్కలు చేస్తే వచ్చే భాగాలు ఇలా ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం, అంటే ముప్పై సెకన్ల ప్రకటనలు రెండొవ స్థానంలో ఉన్నా ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకుని ఉండటమే కాక ఎక్కువ నిడివి కలిగి ప్రతీ ఇతర ప్రకటనలకు అనువుగా ఉంటాయి. అలాగే రెండొవస్థానంలో ఉన్న ఇరవై సెకన్ల ప్రకటనలు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఆదాయాని ఆర్జించడానికి ఇవి మొదటి స్థానంలో ఉంటాయి. ఇక్కడ నాకు చికాకు పెట్టిన విషయం ఏమిటంటే, బాడీ స్ప్రే అయిన యాక్స్ కంపెనీ వారి ప్రకటన ఒక్కోసారి అన్ని స్లాట్లు ఆక్రమించి పాడిందే పాట పాచి పళ్ళ రోత అన్నట్లు ఉంటుంది.

వీటన్నింటికీ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని ఫలానా ఫలానా వారు సమర్పింస్తున్నారు అంటూ ప్రకటనలకు ముందు మఱియు చివర ఓ పదిహేను సెకన్ల పాటు విసిగించడమే కాక, Z ఛానాల్లో వచ్చే సీరియల్స్ గురించి ఓ పది పది సెకన్ల పాటు ఊదర కొట్టేయ్యడమే చికాకు పెట్టే విషయం. ఈ విషయాలను నమ్మని వారి కోసం ఓ చిన్న వివరణ ఈ క్రింద విధంగా..

ప్రకటన
వరుస నిడివి
1 10
2 15
3 20
4 20
5 30
6 25
7 30
8 30
9 20
10 30
11 20
12 25
13 20
14 25
15 20
16 20
17 30
18 25
19 25
20 30
21 15
22 10

 
Clicky Web Analytics