హైదరాబాద్ వాసులు సలహా ఇవ్వండి

అమెరికా ప్రయాణం నాకు అచ్చి రాలేదు. ఇప్పటికి రెండు సార్లు వెళాను. రెండు సార్లు నాకు హార్ట్ ఏటాక్ ఇచ్చింది. నా అమెరికా ప్రయాణ ఫలితాలగురించి మరోసారి వ్రాస్తాను. అప్పటిదాకా నా ప్రస్తుత భాధని పంచుకోండి.

నాకు పెళ్ళైన తరువాత మొదటిసారిగా మా మామగారు నా భార్యని కాపురానికి పంపించేటప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నందు అక్కడికే తీసుకు రమ్మన్నాను. అలా కాపురం పెట్టినప్పుడు మొట్ట మొదటి సారిగా విడిగా ఇల్లు తీసుకోవడం అవసరం అయ్యింది. అప్పటిదాకా బాచ్‍లర్లమే కదా అందుకని నలుగురు స్నేహితులు కలసి ఉండే వాళ్ళం. ఆ విషయాలు ఇప్పుడు అనవసరం. సరే పెళ్ళైంది కదా అని కాపురం నిమిత్తం ఇళ్ళు వెతకగా బేగంపేటలోని బ్రాహ్మణ వాడలోని ప్రస్తుతం ఉంటున్న అపార్ట్‍మెంట్ ఖాళీగా ఉన్నట్టు తెలిసి చూడాటానికి వెళ్ళగా.. అదిగో అప్పుడు తగిలింది మొదటి దెబ్బ.

అద్దె ఇళ్ళు చూపించే బ్రోకర్ వెధవేమో అద్దే ఐదువేలు రెండు నెలల అడ్వాన్స్ అని ఇల్లు చూపించాడు. ఓనరేమో అద్దె అయిదు వేల ఐదు వందలు మూడు నెలల అడ్వాన్స్ అలాగే అయిదువందల యాభై మైంటెనన్స్ అని చెప్పాడు. పరస్పర చర్చల తరువాత ఓనర్ చెప్పినట్టే చెయ్యాల్సి వచ్చింది. ఇక 2006 వ సంవత్సరంలో అక్టోబర్ రెండో తారీఖు రానే వచ్చింది. వస్తూ వస్తూ భార్యని తెచ్చింది. అలా మొదలైంది మా కాపురం.

అయిదు వేల అయిదు వందల అద్దెతో మొదలైన మా కాపురం ఈనాడు ఎనిమిదివేల అయిదు వందలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వచ్చే సమస్య ఏముంది. ఇదిగో అనుకోకుండా రెండోసారి అమెరికా ప్రయాణం. తిరిగి వచ్చిన తరువాత మా ఓనర్ చావు కబురు చల్లగా చెప్పాడు. మీరు అమెరికా వెళ్ళి వచ్చారుగా ఓ రెండు వేలు అద్దె పెంచండి. అలాగే ఏప్రియల్ నెల నుంచి ఎరియర్స్ కూడా ఇవ్వండి అని. అప్పుడు తెలిసింది ఇంటి అద్దె పెంచడానికి ఉన్న కారణం నేను అమెరికా వెళ్ళి రావడం అన్న మాట.

ఈ నెలాఖరులోగా నేను మరో ఇల్లు చూసుకోవాలి అన్న ప్రయత్నంలో మొదటగా మా సహోద్యోగులు ఉండే ప్రాంతం అయిన నిజాంపేట్ విలేజికి వెళ్ళి మొన్న శనివారం చూసి వచ్చాను. నిజాం పేట విలేజి రోడ్డు మీదకి దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కూడా అద్దెలు చుక్కలనంటుతున్నాయి. అలా ఈ వారాంతం అంతా రోడ్లు సర్వే చెయ్యడమే సరిపోయింది. అన్నట్లు చెప్పడం మరిచా.. రోడ్డుకి ఒకవైపున ఉన్న కూకట్ పల్లిలో చూడడమే కాకుండా మరో ప్రక్కన కూడా చూడడం జరిగింది. మలేషియా టౌన్‍షిప్ వెనకాల ప్రాంతం కూడా వెతకాను. ఎవ్వరూ తొమ్మిది వేలకు తక్కువ చెప్పటం లేదు.

అలాగే నిన్న కూకట్ పల్లి ప్రాంతలో తిరిగాను. అక్కడ కొన్ని పాత అపార్ట్‍మెంట్స్ ఎనిమిది వేలకు దరిదాపుల్లో ఉన్నా రోడ్డుకి కొంచం దూరంగా ఉన్నాయి. నాకు హితులైన మరో తెలుగు బ్లాగరు నాకు ఓ సలహ ఇచ్చారు. ప్రస్తుతం మీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ అంటున్నావు కాబట్టి, ఒకవేళ నువ్వు కనుక కూకట్ పల్లి లో ఇల్లు తీసుకుంటే ప్రయాణ భారం నీకు ఎక్కువౌతుంది. కాబట్టి నీకు యూసఫ్ గుడా కానీ, వెంగళరావు నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, మోతీ నగర్ పరిసర ప్రాంతాలైతే బాగుంటుంది అని విశ్లేషించారు. వారి విశ్లేషన కొంతవరకూ నాకు సబబుగానే అనిపించింది

అందు వల్లన హైదరాబాద్ లో ఉన్న సహ తెలుగు బ్లాగర్లకు మనవి. మీకు తెలిసిన ఏరియాలో ఏవైనా ఖాళీలు ఉన్న యెడల నాకు తెలియ జేయండి. నాకు ఉన్న ఒకే ఒక రిక్వైర్ మెంట్ ఏమిటంటే, జూబ్లిహిల్స్ లో ఉన్న మా ఆఫీస్ కు కొంచం దగ్గరా ఉంటే కొంచం సులువౌతుంది. అలాగే ఖర్చు ఎక్కువగా లేకుంటే బాగుంటుంది. ఈ పోస్టు ద్వారా మీ అమ్యూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసానని మీకు అనిపిస్తే, మన్నించండి. వీలైతే సమాచారాన్ని తెలియ జేయమనవి.

నన్ను మీరు 944 14 18 139 నందైనా సంప్రదించ వచ్చు లేదా varthy@gmail.com కు ఓ జాబు వ్రాయండి. భవదీయుడు వెంఠనే స్పందిస్తాడు. అంతవరకూ ఓపికగా చదివినందులకు నెనరులు.

 
Clicky Web Analytics