మొదటి మైల్ ఐడీ వివరాలు

ఇవ్వాళ అనాలోచితంగా నా మైల్ ఐడీ ఎక్కౌంట్ వివరాలు వెతుకుతుంటే, ఓ విషయం నన్ను ఆశ్చర్యపరచింది. అది ఏమిటంటే, నా మొదటి మైల్ ఐడీ సృష్టించుకుని పుష్కరం దాటిందని. సరిగ్గా అదే సంవత్సరంలో అంటే, 1998లో అన్నమాట హాట్‍మైల్‍ని మైక్రోసాఫ్ట్ కొనేసింది. 1998 వ సంవత్సరం జనవరి ఒకటవ తారీకు నుంచి హాట్‍మైల్ మైక్రోసాఫ్ట్ వారి సొంతం అయ్యింది.

జాలాన్ని అప్పట్లో ఇంత బాగా వాడేవారు కాదు. ఒకవేళ వాడినా డైల్‍అప్ చేసుకుని కనక్షన్ చేసుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్లకు వెళితే, గంటకు అరవై రూపాయలు తీసుకుని మనకోసం డైల్‍అప్ చేసి ఇచ్చేవాడు. అలా అద్దెకు తీసుకున్న లైన్లోంచి మళ్ళీ కొంత బాండ్ విడ్త్ దొంగతనం జరిగేది. అదేనండి ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ కూడా వాడుకునే వాడు కదా, అలా అన్న మాట.

ఇదేదో హంబక్ అనుకుంటున్నారా.. అక్కడే పొరపడ్డారు. ఇదిగో సాక్ష్యం. మరి మీ మొట్టమొదటి మైల్ ఐడీ ఎప్పటిది అని ఒక్కసారి చూసుకోండి.

image

దీనికి తోడుగా మరో మైల్ ఐడీ ఉండేది. అది ఫస్ట్ క్లాస్ మైల్ అనేటాగ్ లైన్‍తో మైల్ ఎక్కౌంట్స్ ఇచ్చిన FCMail వారి వద్ద. ఇప్పుడు ఆ డొమైన్ తీసేసారు. మరి మీ మొదటి మైల్ ఐడీ ఎప్పటిదో నాకు తెలియజేయండి లేదా మీ బ్లాగులో పెట్టుకొండి

 
Clicky Web Analytics