తెరాసా వారి దృష్టిలో బతుకమ్మ బొమ్మ మాత్రమేనా

ఈ మధ్య తెరాసా వారు కొటి బతుకమ్మ పూజలు చెసినట్టు మా అఫీసులో ఓ ఇద్దరు మాటాడుకుంటుంటే ఏమిటదా అని ఆసక్తికలిగి అటువైపు చెవ్వి సారించి ఆలకించిన పిదప నా భావనని ఇదిగో ఇక్కడ యధాతధంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది తెరాసా వారికి నచ్చకపోతే అది వారి దురదృష్టం.

ఎవ్వరో ఏదో చేసారని మనం కూడా చేద్దాం అని ప్రయత్నిస్తే అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంటుంది. అదే విధంగా తెరాసా వారు మేము ఉన్నాం అని తెలియ జేయ్యాలన్నట్టు ఏమి చెయ్యాలో తెలియక ఏదో చేద్దాం అని పూనుకుని మొదలు పెట్టినదే ఈ కోటి బతుకమ్మల పూజలు. నాకు వీరి ప్రయత్నం అసందర్బంగాను అనుచితంగాను అనిపించింది.

నేను బేగంపేటలో దాదాపు ఓ పదేళ్ళకు పైగా నివశిస్తున్నాను. ప్రతీ సంవత్సరం ఇక్కడ ఉన్న బస్తీ వాసులు బతుకమ్మ పండుగ దినాలలో ఎన్నెన్ని కలశాలు నెత్తిన పెట్టుకుని ఫ్లైఓవర్ ప్రక్కనే ఉన్న గుడికి వెళతారో నాకు బాగా తెలుసు. కానీ ఈ సారి తెరాసా వారికి భయపడ్డారా అన్నట్లుగా చాలా తక్కువమంది బహిరంగంగా గుడికి వెళ్ళి వచ్చారు. ఈ పదేళ్ళలో ఇంత తక్కువ మొత్తంలో జనాలు బతుకమ్మని జరుపుకున్న వైనం అక్కడి పూజారులకు కూడా మింగుడు పడలేదు. దీనంతటికీ తెరాసా వారు ఈ పండుగని రాజకీయ్యం చెయ్యడమే కాకుండా వారే భాద్యులని మరోలా చెప్పనక్కర లేదు.

అంతే కాకుండా, పెద్దపెద్ద రహ దారుల కూడలిలో పెద్ద గంపని బోర్లా పెట్టి దాని చుట్టూ ప్లాస్టిక్ పూలు తగిలించి మేము కోటి బతుకమ్మలు జరిపాం అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా చెయ్యడం ఎంతో భక్తితో మరెంతో శ్రద్దతో బతుకమ్మ పూజలు చేసే వారి మర్యాదని మంట కలిపిన్నట్టైంది. రాజకీయనాయకుల విగ్రహాలకు కనీసం ఒక్కసారైనా పూజాదికార్యక్రమాలు చెయ్యక పోయినా కనీసం పూల దండ అయినా వేస్తారు, కానీ తెరాసా వారు స్థాపించిన బతుకమ్మ రూపాలను పట్టించుకున్న నాధుడు లేడు. ఇలా ప్రవర్తించడం వీరు బతుకమ్మని ఒఠి బొమ్మగా మాత్రమే భావిస్తున్నారని చెప్పకనే చెబుతున్నారు, మన తెరాసా నాయకులు.

శవరాజకీయ్యాలను చూసాం కానీ దేవుడితో రాజకీయ్యం చెయ్యడం ఒక్క తెరాసా వారికి మాత్రమే చెల్లింది. నా దృష్టిలో తెరాసా వారికి గౌరవించడం ఎలాగూ చేతకాదు దానికి తోడు అగౌరవపరచడం మాత్రం బ్రహ్మాండం బద్దలైయ్యేటట్టు తెలుసు.

ఆఖరిగా తెలంగాణా వారికి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి తలచుకోండి..

 
Clicky Web Analytics