ప్రస్తుత రాజకీయాలను ప్రతిపాదికగా తీసుకుని ఓ స్నేహితురాలు నాకు ఈ క్రిందటి వాక్యాన్ని హాస్యాస్పదంగా చెప్పారు. అది చదివిన తరువాత నాకు అనిపించిన భావనే ఈ పుట శీర్షిక. ఇచ్చిన వాక్యంలో మన దేశ ప్రధాని మన్ మోహన్ గారు, కర్ణాటక ముఖ్య మంత్రి అయిన యెడ్యీరప్పగారు, మాయావతి వంటి వారికి తోడుగా కోట్ల రూపాయల కుంభకోణంలో జైల్ పాలైన కల్మాడీ కూడా చేరితే ఈ వాక్యానికి పూర్ణత్వం వచ్చినట్లైంది. తెలుగులో ఆ వాక్య భావనను విశ్లేషిస్తే..
మొదటగా మన మన్ మోహన్ గారు నోరు తెఱచి మాట్లాడరు. ఎందుకంటే, కళ్ళెం జన్ పధ్ రోడ్డులో ఉంది కదా.
కరుణానిధిగారు కనరు, అందుకే ఎప్పుడూ నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు.
యెడ్యూరప్పగారు వినరు. ఎందుకంటే, భాజాపా అధిష్టానం ఎన్ని సార్లు ఆదేశించినా తన మాత్రం పదవి నొదిలేది లేదని ఏటికి ఎదురీది రాష్ట్ర గవర్నర్ ప్రతిపాదించిన ప్రతిపాదనను కూడా వెనక్కు తెప్పించే సత్తా ఉన్నందున వీరు ఎవ్వరి మాట వినరు
మాయావతి గారికీ ఏ విషయమూ పట్టదు. ఎందుకంటే, తాను పట్టిన ఏనుగుల స్థంబాలే అన్ని చోట్ల ఉండాలి అనేది వీరి తీరు
అన్నింటికీ మించి భలే విషయం ఏమిటంటే, మన సురేష్ కల్మాడీగారు. కామన్ వెల్త్ గేమ్స్ ద్వారా కోట్ల రూపాయలు నొక్కేసిన వీరికి ఈ మధ్య మన బాలయ్యకు వచ్చినటువంటి జబ్బేదో వచ్చిందంట. మన బాలయ్య గారికేమో కత్తిని చూస్తే పొడవాలని పిస్తే, కల్మాడీ గారికి పాత ఙ్ఞాపకాలు నశించి పోతున్నాయంట. అలా నశించి పోవడం ద్వారా వీరి గుర్తు పెట్టుకునే సామర్ద్యం సన్నగిల్లి వీరేమి చేసారో మఱచి పోతారంట. సింపుల్ గా చెప్పాలంటే, మన కల్మాడీ మఱో గజనీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న వీరిని ఎవ్వరైనా ఇంటరాగేషన్ చేసారనుకోండి, చక్కగా తప్పించుకోవడానికి బాగా పనికి వచ్చే ఒకే ఒక రోగమే ఈ మతి మఱపు జబ్బన్నమాట.
ఇదంటి మన భారతీయ రాజకీయ మఱియు నాన్ రాజకీయ ప్రముఖ నాయకులపై వచ్చిన వివరణ. ఆంగ్లంలో వచ్చిన వాక్యాన్ని ఆంగ్లంలో చదువుకుంటే, అదో ఆనందం అనుకునే వారికోసం, ఇదిగో ఈ క్రింద
Manmohan doesn't speak, Yeddyurappa doesn't listen. Karunanidhi does'nt see. Mayawati doesn't care, And now Kalmadi doesn't remember... some DemoCRAZY in India...!
ఇప్పుడు నాకు కూడా ఏదో కొత్త రకమైన జబ్బు వస్తోంది. ఇంత చదివి స్పందించ కుండా పోయేవారిని చితక బాదాలని. నా చేత తన్నులు తింటారా, లేక స్పందిస్తారా అనేది మీ అభిమతానికే వదిలేస్తున్నాను.