Showing posts with label డిసెంబర్. Show all posts
Showing posts with label డిసెంబర్. Show all posts

ఇది కూడా నిజమే ..

నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని పూరిద్దాం కదా అని చేసిన నా ప్రయత్నంలో నేను బొటా బొటిన పాస్ అయ్యాను అని చెప్పుకోవచ్చు. మేము చదువుకునే రోజుల్లో బొటా బొటి అంటే వందకు పాస్ మార్క్ అన్నమాట. హిందిలో అయితే వందకు పదిహేను మార్కులు వస్తే పాస్ అన్న మాట అలాగే మిగిలిన సభక్ట్ లలో అయితే ముప్పై ఐదు వస్తే పాస్ అన్న మాట. ఆ లెక్కలో నాకు వందకు నలభై మార్కులు వచ్చాయి.

సమస్యలో వాడు ఇచ్చింది ఐదు ఖాళీలు పూరించమని. నాకు ఙ్ఞప్తికి వచ్చినవి రెండు. అంటే పాస్ అన్న మాట. వాడు ఇచ్చినవి వాటిల్లో నాకు వచ్చినవి ఇక్కడ ఉంచుతా.

వరుస తెలుగు పదం మొదటి అక్షరం రెండొవ అక్షరం మూడవ అక్షరం నాల్గవ అక్షరం ఐదవ అక్షరం
బ్రతికిన       V E
ధైర్యము B R A V E
నడువు       V E
నదులు       V E
బానిస S L A V E

మిగిలిన తెలుగు పదాలకు ఆంగ్ల పదాలు ఏమై ఉంటుందబ్బా!!

మీరేమవ్వాలనుకుంటున్నారు / ఏమి చెయ్యాలనుకుంటున్నారు

WorstNew

పేజీ తిప్పితే ..

ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది.

ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ మించి కధాగమనంలోని మాటల విషయంలో ఆ రచయితని మెచ్చుకోకుండా ఉండలేను. దీనినే క్రియాత్మకత అని అంటారు.

ఎవ్వరైనా ఏదైనా ఫొటో మోడల్ గా చేద్దాం అని అనుకునేవారు ఈ చిత్రాన్ని చూస్తే చాలా ఆనందిస్తారు అని వ్రాయటం కన్నా ఆస్వాదిస్తారు అని వ్రాయటం భేషుగా ఉంటుందేమో. ఒక్క సారి ఆలోచిస్తే పుస్తకంలో ఉండే ప్రకటనలలోని పాత్రలు నిజంగా ఇలాగే ఆలోచిస్తాయా అనేటటువంటి ఊహ ఎంత విచిత్రంగా ఉందో కదా. ప్రకటనలలోని పాత్రలు కనుక నిజంగా ప్రాణం వస్తే ఇలాగే ఆలోచిస్తాయేమో!!

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన వారికి మరింత విపులంగా eతెలుగు చేసే పనులు వివరించడం కుదిరింది. రెహ్మాన్ గారు ఈ నాటి స్టాల్ తెరచి చాలా సేపు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించినా వారికి వెసలు బాటుగా సాయం వేళకి కబుర్లు చెబుతానంటూ బ్లాగుతున్న మన కృపాల్ కశ్యప్ చేరుకుని రెహ్మాన్ గారి భాద్యతను పంచుకున్నారు. ఇదిగో అంతలో నేను చేరుకోవడం జరిగింది. నేను చేరుకునే సరికి కశ్యప్ గారు చక్కగా తన డెల్ అంకోపరిని తెఱచి ఉంచి అందులో తెలుగు ఉబంటుని కనిపించే విధంగా ఉంచడం బాగుంది.

మరికొద్ది సేపటికి ఊసులు చెప్పుకునే స్వాతి ముత్యం అనే ఉప శీర్షికన బ్లాగే స్వాతిగారు చేరుకోవడం వారి వెనకాలే అభ్యాస్ అనే సంస్థ నడుపుతున్న యెనమండ్ర సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. వీరితో కాసేపు eతెలుగు స్టాల్ కళకళలాడింది. అంతలో కొంచంగా సందర్శకుల తాకిడి కనబడంటంతో ఎవ్వరికి వారు అంతర్జాలంలో తెలుగు వెలుగుకై వారి వారి ఙ్ఞానానికి పరిధిలో ఉన్న సమాచారాన్ని సందర్శకులకు తెలియజేయడంలో మునిగిపోవటం చూడ ముచ్చటవేసింది. ఇలా అటుగా పోతూ వచ్చిన కొందరు eతెలుగు కార్యక్రమాలను మెచ్చుకోవడం మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది.

వీరి వెనకాలే కినిగే స్టాల్ వారి చావా కిరణ్ గారు వారికి తోడుగా మరో ఇద్దరు సాహితీ వేత్తలు వచ్చి చర్చించడం ఈనాటి విశేషాలకి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. అలా సాగిన ఈ నాటి కార్యక్రమంలో జయప్రదంగా ఆఖరి వరకూ ఉండి ఆ రాత్రి వేళ చక్కటి కాఫీ త్రాగి రెండొవ రోజు కార్యక్రమాన్ని ముగించాము.

రేపు ఎల్లుండి వారాంతాలవ్వడం మూలాన పుస్తక ప్రదర్శనను ఉదయం పదకొండు గంటలనుంచి తెరిచి ఉంచుతున్నారు. ఈ రెండు రోజులలో భాగ్యనగరంలో ఉన్న తెలుగు బ్లాగర్లు / ఔత్సాహికులు అందరూ వచ్చి జాలంలో తెలుగుకై మీకు తెలిసిన విషయాలను నలుగురితో eతెలుగు స్టాల్ నందు పంచుకోండి.

కుక్కలుంటాయ్ జాగ్రత్త


నిన్న రాత్రి పని ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే వేళలో ఒ కుక్క నా దారికి అడ్డంగా నిలచి నన్నీ స్థితికి తెచ్చింది.

 

అందువల్ల్ల చెప్పేదేమిటంటే, రాత్రి వేళ్ళల్లో ద్వి చక్ర వాహానలపై ప్రయాణించే వారందరూ కాస్తంత జాగ్రత్త గా వెళుతూ ఉండండి.

 

ఒకప్పుడు పగటివేళ్ళల్లో పందులు మాత్రమే అడ్డుపడేవి. అంతే కాకుండా ఎద్దులు (వీటిల్ని వాకింగ్ స్పీడ్ బ్రేకర్స్ అని నిక్  నేమ్ చేసా) మన వేగాన్ని పరిక్షిస్తుంటాయి. కాని ఇవి రాత్రి వేళల్లో చక్కగాఒక  చోట నిద్దరోతుంటాయి. ఎటొచ్చి వచ్చిన చిక్కల్లా రోడ్డు మీద తిరిగే కుక్కల వల్లనే. అందుకని రాత్రి వేళల్లో తిరిగే అందరికీ ఇదేనా విన్నపం. తస్మాత్ కుక్కలతో జాగ్రత్త.

నాకు తెలిసినంత వరకూ మనుష్యులలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు స్వతహాగా అనుభవించి తెలుసుకునే వారు, మరొకరు ఎదుటి వాళ్ళ అనుభవాలనుంచి తెలుసుకునే వారు. కాబట్తి ఈవిషయంలో మీకు ఈ అనుభవం అవ్వకూడదనే .. నా ఈ ప్రయత్నం

సోమవారం .. ఎందుకొద్దు?

 

జైల్ సూపరింటెండ్ : ఇదిగో 486 .. నిన్ను వచ్చే సోమవారమే ఉరి తీసేది.. సిద్దంగా ఉండు..

ఖైదీ : ఓ.. Please not on a monday!!

జైల్ సూపరింటెండ్ : .. ఏం.. ఏమైంది?

.

.

.

.

.

ఖైదీ : It is such a bad way to start a week

 
Clicky Web Analytics