పురుష రాగములు

ఏదైనా పాటగానీ కీర్తనగానీ విన్నామనుకోండి ఒక్కొక్కరికీ ఒక్కొక్క ఆలోచన కలుగుతుంది. అలాంటిది ఓ సంగీత విధ్వాంశునికి ఏదైనా రాగమును వినిపించామనుకోండి, ముందుగా వారు ఆలోచించేది ఏమిటో తెలుసా??

బహుసా నేను అనుకునేది తప్పు అవ్వవచ్చు, కానీ నేను ఊహించినంత వరకూ, నా శ్రుతార్ధమేమిటంటే.. వీరు విన్న పాట యొక్క రాగమేమిటి? ఆ రాగ లక్షణాలు ఎమిటి? ఆరోహణ అవరోహణ ఏమై ఉంటుంది? వంటి వివరాల గురించి ఆలోచిస్తారని అనుకుంటాను. కాబట్టి ప్రతీ పాట ఏదో ఒక రాగయుక్తమై ఉంటుంది. ప్రతీ రాగానికి ఒక్కొరకమైన తాళగతి ఉంటుంది. ప్రతీ తాళగతికీ ఒక్కొక రీతి ఉంటుంది.

రాగములన్నింటినీ రెండు విధములుగా చెప్పుకోవచ్చు. వాటి స్వభావాన్ని ప్రాతిపదికగా చేసుకుని వాటిని లాలిత్యము / సాత్వికమైన స్వభావము కలిగిన రాగములు మరియు గంభీర / ఉదృతమైన స్వభావములు కలిగినవిగా మనము అనుకోవచ్చు. ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి.  సంగీత ప్రపంచలో విద్వత్ ఉన్న వాళ్ళలో కొంతమంది ఇలాంటి క్లాసిఫికేషన్ మంచి పద్దతి కాదు అని చెబుతూ కొంతమంది చరిత్రకారులు ముప్పది రెండు నపుంశక రాగాలు కూడా ఉన్నాయని చెప్పినట్టు ప్రస్థావిస్తారు. మరి కొంత మంది నారుదుని రాగావిభాగం ప్రకారం కూడా ఇలాంటి మూడు విభజనల ప్రస్థావన ఉంది అని ఘంటా పధంగా చెబుతారు. ఇలా విభజించడం అనే విషయమై మరోసారి ఆలోచిస్తాను అప్పటిదాకా గంభీర / ఉదృతమైన స్వభావము కలిగినటు వంటి రాగములను పురుష రాగములు అని అంటారు అనే ప్రాతిపాధికను నేను అంగీకరిస్తూ...

ఇలాంటి పురుష రాగాలు ఎన్ని అంటే.. అవి ఎనిమిది రకాలని ఈ మధ్య చదువుకున్నాను. అవి ఈ క్రింద చెప్పినట్టు..

భైరవి మాళవి బంగాళ హిందోళ రాజమంజరియు శ్రీరాగగౌళభూపాల లెన్మిది పురుషరాగంబులు

అంటే అవి ఈ క్రింది చెప్పిన క్రమంలో

భైరవి రాగం -

మాళవి రాగం -

బంగాళ రాగం -

హిందోళ రాగం – సామజ వరగమన ..

రాజ మంజరి రాగం -

శ్రీరాగం – ఎందరో మహాను భావులు ..

గౌళ రాగం – దుడుకూ గల నిన్నే జేరి..

ఇలాంటివి కాకుండా వీటికి భార్యారాగాలు కూడా ఉంటాయి. అంతే కాకుండా వీటికి అనునయంగా పుత్ర రాగాలు కూడా ఉన్నాయని గ్రంధాలు చెబుతాయి. వీటి గురించి మరోసారి ఆలోచిస్తాను .. అంతవరకూ ఇంతే సంగతులు

 
Clicky Web Analytics