ప్రస్థానం – నా అభిప్రాయం

ఈ సినిమా గురించి నేను ఇండియాలో (ఛ!! ఇండియా ఏంటి, చక్కగా భారతావనిలో .. అనొచ్చు కదా!! వెధవది.. వెధవది.. తెల్లోళ్ళు పెట్టిన పేరు మాత్రం మర్చిపోమే!!) ఉండగా ఒకరిద్దరు నాతో చర్చిస్తూ సినిమా బాగుంది నువ్వు చూడు అని సలహాలిచ్చారు.. అప్పట్లో ఆ సినిమా చూడటం కుదరలేదు.. ఇదిగో ఇక్కడికి వచ్చిన తరువాత కొంచం ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొంచం కొంచం చూస్తూ.. ఆఖరికి నిన్న రాత్రి పూర్తికానిచ్చా..

విజయవాడ నైపద్యంలో సాగిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు జుగుప్త్సా కరంగా ఉన్నాయి మరికొన్ని సరళంగా సౌమ్యంగా సాగాయి. ఇలా చెప్పడం ద్వారా ఈ సినిమా ఉగాది పచ్చడిలా అన్ని రుచుల సమ్మేళనం అని నేను చెప్పను.. అయినా ఇందులో నాకు నచ్చిన అంశాలు అలాగే నచ్చని అంశాలు ఇదిగో ఈ క్రింద విధంగా..


నచ్చనివి ..


౧) ఏదో తొందరపాటులో చేసేస్తున్నా.. అంటూ చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడం ఏ మాత్రం బాగోలేదు.. యధాః తండ్రి తధాః పుత్ర .. అన్నట్లు, నాన్నగా సాయ్ కుమార్ హీరో తండ్రిని చంపితే, కొడుకు మరో అమ్మాయిని చంపడం.. ఛ!! వెధవ కధ..


౨) చేసేదేమో వెధవ పని.. అదే ఈ సినిమా వాల్ పోస్టర్ గురించి.. ఇక్కడ చూసారుగా.. హీరో గారు ఇస్ట్లైల్ గా ధూమపానం ఎలా చేసేస్తున్నారో.. మళ్ళీ దానిని త్రాగొద్దు అంటూ చెప్పడమా.. అంతే కాకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలసి మరీ సిగిరెట్టు పైన సిగిరెట్టు కాల్చేయ్యడం.. దీనికి తోడు, మంచి మర్యాద అంటే, వయస్సు మర్యాద తొక్క తోలు అంటూ డైలాగులు .. నాకైతే ఈ వ్యవహారం అంతా ఏడిసినట్టుంది. వయస్సులో ఉన్న కుర్రకారుకి .. ఒరేయ్ అబ్బాయిలు సిగిరెట్ త్రాగకండ్రా అని చెప్పాల్సింది పోయి.. ఇదిగో మా వీరో ఎంత ఇస్టైల్ గా గుప్ గుప్ మనిపిస్తున్నాడో అని చూపించడమా!!


౩) ఇద్దరు పిల్లలున్న మహిళకు మరో పెళ్ళి చెయ్యడం, ఆ వివాహం ద్వారా మరో కొడుకు పుట్టడం.. తొక్కలో స్టోరి. వయసొచ్చిన కూతురు అంగీకరించలేని విషయాన్ని వయస్సు మీరిన తల్లి పాత్ర మరో వివాహానికి అంగీకరించడమా.. అసహ్యమేసింది !!


౪) సినిమా అన్న తరువాత కొద్దో గొప్పో వైలెన్స్ ఉండాలి.. అన్నంత మాత్రాన వావి వరుస మర్చిపోయి, సొంత అక్కని చంపేంత ఆలోచన చేసిన రచయతననాలి.. వాడెంత సాడిస్టో..


ఇలా వ్రాసుకుంటూ పోతే, ఎన్నో కారణాలు.. వాటి గురించి ఇక ఇక్కడితో ఆపేస్తాను..


నచ్చిన అంశాలు ..


౧) హీరో పాత్రలోని అమాయకత్వం.. నిజం తెలిసిన తరువాత సాయ్ కుమార్ తో హీరో చెప్పిన డైలాగు..



..నువ్వే నిజం అని నీచేయి పట్టుకుని నడిచానే, కానీ నువ్వే ఒక అబద్దం అని తెలిసిన తరువాత ..


నిజంగా చిన్న పిల్లలు వారి తల్లి తండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తారు. తల్లి తండ్రులుగా ఉండే వాళ్ళు ఎంత హుందాతనంగా ఉండాలో.. వారు ఎంతటి గొప్ప వారుగా ఉండాలో చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు..


౨) కొట్టుకోవడాలు నరుక్కోవడాలు సహజం అయినా.. అంత కౄరత్వం చూపకుండా కొన్ని కొన్ని చోట్ల చాలా సహజంగా తీయ్యడం దర్శకుని ప్రతిభ అని చెప్పొచ్చు


౩) డబ్బున్న వాళ్ళ కొడుకులు ఎంత దిగజారి పోతారో అని చూపించిన విధానం.. కేక..


౪) మైనింగ్ కు సంభందించిన ఫైల్ విషయంలో కలక్టర్ తో హీరో చెప్పే డైలాగ్ ..



ఇక చాలు..


మొత్తం మీద, నేనైతే ఈ సినిమాని చూడమని చెప్పను.. చూడకపోతే మరీ మంచిది..

 
Clicky Web Analytics