నాగార్జున కొడుకు నాగ చైతన్య చేసిన రెండొవ సినిమా “ఏమాయ చేసావే ..” సినిమాపై నా అభిప్రాయం ఎక్కువమందికి నచ్చక పోవచ్చు, ఎందుకంటే, నేను ఆ సినిమాలోని అమ్మాయి ఒకే రకంగా ఆలోచిస్తాము. ఏ విషయంలో అంటే, సినిమాల విషయంలో .. ఆ చీకటీ.. జనాలు .. రొద.. నాకు అస్సలు నచ్చదు. నా ఉద్ధేశ్యంలో సినిమాలు చూడటం అంటే టైమ్ వేస్ట్.
కానీ కొంతమందికి అవే ప్రాణం. మరి కొంత మందికి అవి జీవితం. అంతే కాకుండా ఎంతో మందికి అవి జీవనాధారం. అలాంటి సినిమాల గురించి మనం మాట్లాడుకోకుండా, అచ్చంగా నా అభిప్రాయానికి వచేస్తాను.
మూడు ముక్కల్లో చెప్పాలంటే, నాకు నచ్చలేదు.
నాకు నచ్చిన విషయమల్లా మాటలు మాత్రమే.. ఎక్కడ హైపిచ్ వాడకుండా చాలా సాప్ట్ గా నిదానంగా మృదువుగా మాట్లాడించిన తీరు మాత్రం నాకు నచ్చింది. కాకపోతే, అందరు అబ్బాయిలలాగా చొంగ కార్చుకుంటూ హీరోయిన్ ని చూసే కొన్ని సీన్లు అసహ్యాన్ని మరియు జుగుప్సని కలిగించాయి. ఏది ఏమైనా, అంత బాగాలేకపోయినా, ఈ రోజుల్లో వస్తున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న సినిమాలతో పోలిస్తే ఇది వందరెట్లు నయం. కుటుంబం మొత్తం చక్కగా హాయిగా వెళ్ళి చూడొచ్చు.
అఖరుగా మరో ముక్క చెప్పి ముంగిస్తాను. పెద్ద పెద్ద హీరోల కొడుకులు పయనిస్తున్న రూటు గాక మన చైతన్య రెండొవ సినిమాని కొంచం తొందరగానే ముగించి మంచి పనిచేసాడు