ఎంతటి చిత్రమో కదా!!
ప్రస్తుత రాజకీయాలను ప్రతిపాదికగా తీసుకుని ఓ స్నేహితురాలు నాకు ఈ క్రిందటి వాక్యాన్ని హాస్యాస్పదంగా చెప్పారు. అది చదివిన తరువాత నాకు అనిపించిన భావనే ఈ పుట శీర్షిక. ఇచ్చిన వాక్యంలో మన దేశ ప్రధాని మన్ మోహన్ గారు, కర్ణాటక ముఖ్య మంత్రి అయిన యెడ్యీరప్పగారు, మాయావతి వంటి వారికి తోడుగా కోట్ల రూపాయల కుంభకోణంలో జైల్ పాలైన కల్మాడీ కూడా చేరితే ఈ వాక్యానికి పూర్ణత్వం వచ్చినట్లైంది. తెలుగులో ఆ వాక్య భావనను విశ్లేషిస్తే..
మొదటగా మన మన్ మోహన్ గారు నోరు తెఱచి మాట్లాడరు. ఎందుకంటే, కళ్ళెం జన్ పధ్ రోడ్డులో ఉంది కదా.
కరుణానిధిగారు కనరు, అందుకే ఎప్పుడూ నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు.
యెడ్యూరప్పగారు వినరు. ఎందుకంటే, భాజాపా అధిష్టానం ఎన్ని సార్లు ఆదేశించినా తన మాత్రం పదవి నొదిలేది లేదని ఏటికి ఎదురీది రాష్ట్ర గవర్నర్ ప్రతిపాదించిన ప్రతిపాదనను కూడా వెనక్కు తెప్పించే సత్తా ఉన్నందున వీరు ఎవ్వరి మాట వినరు
మాయావతి గారికీ ఏ విషయమూ పట్టదు. ఎందుకంటే, తాను పట్టిన ఏనుగుల స్థంబాలే అన్ని చోట్ల ఉండాలి అనేది వీరి తీరు
అన్నింటికీ మించి భలే విషయం ఏమిటంటే, మన సురేష్ కల్మాడీగారు. కామన్ వెల్త్ గేమ్స్ ద్వారా కోట్ల రూపాయలు నొక్కేసిన వీరికి ఈ మధ్య మన బాలయ్యకు వచ్చినటువంటి జబ్బేదో వచ్చిందంట. మన బాలయ్య గారికేమో కత్తిని చూస్తే పొడవాలని పిస్తే, కల్మాడీ గారికి పాత ఙ్ఞాపకాలు నశించి పోతున్నాయంట. అలా నశించి పోవడం ద్వారా వీరి గుర్తు పెట్టుకునే సామర్ద్యం సన్నగిల్లి వీరేమి చేసారో మఱచి పోతారంట. సింపుల్ గా చెప్పాలంటే, మన కల్మాడీ మఱో గజనీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న వీరిని ఎవ్వరైనా ఇంటరాగేషన్ చేసారనుకోండి, చక్కగా తప్పించుకోవడానికి బాగా పనికి వచ్చే ఒకే ఒక రోగమే ఈ మతి మఱపు జబ్బన్నమాట.
ఇదంటి మన భారతీయ రాజకీయ మఱియు నాన్ రాజకీయ ప్రముఖ నాయకులపై వచ్చిన వివరణ. ఆంగ్లంలో వచ్చిన వాక్యాన్ని ఆంగ్లంలో చదువుకుంటే, అదో ఆనందం అనుకునే వారికోసం, ఇదిగో ఈ క్రింద
Manmohan doesn't speak, Yeddyurappa doesn't listen. Karunanidhi does'nt see. Mayawati doesn't care, And now Kalmadi doesn't remember... some DemoCRAZY in India...!
ఇప్పుడు నాకు కూడా ఏదో కొత్త రకమైన జబ్బు వస్తోంది. ఇంత చదివి స్పందించ కుండా పోయేవారిని చితక బాదాలని. నా చేత తన్నులు తింటారా, లేక స్పందిస్తారా అనేది మీ అభిమతానికే వదిలేస్తున్నాను.
ఆహా .. ఏమి పరిణామము, ఎంతటి శుభవార్త
గూగుల్ గుంపులలో ఉద్యోగ వార్తల నిమిత్తం it-consulting-us-staffing అనే పేరుతో ఓ గుంపు నడుస్తోంది. ఈ గుంపు నందు ఎక్కువగా ఉద్యోగ అవకాశాల గురించి వివరిస్తూ ఉంటారు. దాదాపుగా ఎక్కువశాతం అవకాశాలు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉండే సంస్థలకు సంబందించినవై ఉంటాయి. అలాంటి చోట ఇవ్వాళ్ళ నాకు ఆశ్చర్యపరచే విధంగా ఓ ప్రకటన కనబడింది. అదేమిటంటే..
Topic: Requirements for SQL Server Developer,Teradata Developer :Vijayawada
ఇలాంటి ప్రకటన ఇలాంటి చోట ఇవ్వడం ముందుగా కొంచం అతి చేసినట్లు అనిపించవచ్చు. కానీ ఈ ప్రకటన ఇచ్చిన వారి వెబ్ సైట్ మరియు వారి వివరాలు చూసిన తరువాత ఈ ప్రకటన వెనకాల ఎంతో కొంత నిజాయతీ ఉండకపోదు అనిపించింది. ఇక్కడ నన్ను ఆశ్చర్య పరచిన మరియు సంతోషానికి గురిచేసిన విషయాలు..
మొదటిది, విజయవాడ కూడా సాఫ్ట్ వేరు నిపుణలకు అవకాశాలనిస్తున్నది అని.
రెండవది, విజయవాడ లాంటి చిన్నపట్టణంలోని ఓ సంస్థ అంతర్జాతీయ స్థాయికెదిగి ఆ స్థాయిలోని నిపుణలకు అవకాశాలిస్తామంటూ ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడం. ఇవన్నీ చూడబోతే సాప్ట్ వేరు రంగం తొందరలో విజయవాడలో ఓ వెలుగు వెలగబోతున్నట్లు కనబడుతోంది. ఆహా, ఆలోచనే ఎంతటి హాయినిస్తోంది. ఇవన్నీ కనుక జరిగితే, చక్కగా నాలాంటి వాడు జీతం తక్కువైనా మావూరు చేరుకుంటారు.
ముంగించే ముందు ESS సంస్థ వారికి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నందులకు ధన్యవాదములు తెలియజేసుకుంటూ వీరు మరింతగా అభివృద్ది చెంది మరింత ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలిస్తే భారతదేశంలో విద్వత్తు ఉన్న యువత పరదేశ మోజులో పడి మాతృదేశానికి దూరం కాకుండా చేసిన వారౌతారని ఆశిస్తున్నాను.
ప్రస్థానం – నా అభిప్రాయం
ఈ సినిమా గురించి నేను ఇండియాలో (ఛ!! ఇండియా ఏంటి, చక్కగా భారతావనిలో .. అనొచ్చు కదా!! వెధవది.. వెధవది.. తెల్లోళ్ళు పెట్టిన పేరు మాత్రం మర్చిపోమే!!) ఉండగా ఒకరిద్దరు నాతో చర్చిస్తూ సినిమా బాగుంది నువ్వు చూడు అని సలహాలిచ్చారు.. అప్పట్లో ఆ సినిమా చూడటం కుదరలేదు.. ఇదిగో ఇక్కడికి వచ్చిన తరువాత కొంచం ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొంచం కొంచం చూస్తూ.. ఆఖరికి నిన్న రాత్రి పూర్తికానిచ్చా.. 
విజయవాడ నైపద్యంలో సాగిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు జుగుప్త్సా కరంగా ఉన్నాయి మరికొన్ని సరళంగా సౌమ్యంగా సాగాయి. ఇలా చెప్పడం ద్వారా ఈ సినిమా ఉగాది పచ్చడిలా అన్ని రుచుల సమ్మేళనం అని నేను చెప్పను.. అయినా ఇందులో నాకు నచ్చిన అంశాలు అలాగే నచ్చని అంశాలు ఇదిగో ఈ క్రింద విధంగా..
నచ్చనివి ..
౧) ఏదో తొందరపాటులో చేసేస్తున్నా.. అంటూ చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడం ఏ మాత్రం బాగోలేదు.. యధాః తండ్రి తధాః పుత్ర .. అన్నట్లు, నాన్నగా సాయ్ కుమార్ హీరో తండ్రిని చంపితే, కొడుకు మరో అమ్మాయిని చంపడం.. ఛ!! వెధవ కధ..
౨) చేసేదేమో వెధవ పని.. అదే ఈ సినిమా వాల్ పోస్టర్ గురించి.. ఇక్కడ చూసారుగా.. హీరో గారు ఇస్ట్లైల్ గా ధూమపానం ఎలా చేసేస్తున్నారో.. మళ్ళీ దానిని త్రాగొద్దు అంటూ చెప్పడమా.. అంతే కాకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ కలసి మరీ సిగిరెట్టు పైన సిగిరెట్టు కాల్చేయ్యడం.. దీనికి తోడు, మంచి మర్యాద అంటే, వయస్సు మర్యాద తొక్క తోలు అంటూ డైలాగులు .. నాకైతే ఈ వ్యవహారం అంతా ఏడిసినట్టుంది. వయస్సులో ఉన్న కుర్రకారుకి .. ఒరేయ్ అబ్బాయిలు సిగిరెట్ త్రాగకండ్రా అని చెప్పాల్సింది పోయి.. ఇదిగో మా వీరో ఎంత ఇస్టైల్ గా గుప్ గుప్ మనిపిస్తున్నాడో అని చూపించడమా!!
౩) ఇద్దరు పిల్లలున్న మహిళకు మరో పెళ్ళి చెయ్యడం, ఆ వివాహం ద్వారా మరో కొడుకు పుట్టడం.. తొక్కలో స్టోరి. వయసొచ్చిన కూతురు అంగీకరించలేని విషయాన్ని వయస్సు మీరిన తల్లి పాత్ర మరో వివాహానికి అంగీకరించడమా.. అసహ్యమేసింది !!
౪) సినిమా అన్న తరువాత కొద్దో గొప్పో వైలెన్స్ ఉండాలి.. అన్నంత మాత్రాన వావి వరుస మర్చిపోయి, సొంత అక్కని చంపేంత ఆలోచన చేసిన రచయతననాలి.. వాడెంత సాడిస్టో..
ఇలా వ్రాసుకుంటూ పోతే, ఎన్నో కారణాలు.. వాటి గురించి ఇక ఇక్కడితో ఆపేస్తాను..
నచ్చిన అంశాలు ..
౧) హీరో పాత్రలోని అమాయకత్వం.. నిజం తెలిసిన తరువాత సాయ్ కుమార్ తో హీరో చెప్పిన డైలాగు..
..నువ్వే నిజం అని నీచేయి పట్టుకుని నడిచానే, కానీ నువ్వే ఒక అబద్దం అని తెలిసిన తరువాత ..
నిజంగా చిన్న పిల్లలు వారి తల్లి తండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తారు. తల్లి తండ్రులుగా ఉండే వాళ్ళు ఎంత హుందాతనంగా ఉండాలో.. వారు ఎంతటి గొప్ప వారుగా ఉండాలో చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు..
౨) కొట్టుకోవడాలు నరుక్కోవడాలు సహజం అయినా.. అంత కౄరత్వం చూపకుండా కొన్ని కొన్ని చోట్ల చాలా సహజంగా తీయ్యడం దర్శకుని ప్రతిభ అని చెప్పొచ్చు
౩) డబ్బున్న వాళ్ళ కొడుకులు ఎంత దిగజారి పోతారో అని చూపించిన విధానం.. కేక..
౪) మైనింగ్ కు సంభందించిన ఫైల్ విషయంలో కలక్టర్ తో హీరో చెప్పే డైలాగ్ ..
ఇక చాలు..
మొత్తం మీద, నేనైతే ఈ సినిమాని చూడమని చెప్పను.. చూడకపోతే మరీ మంచిది..
బ్లాగు ప్రపంచం లోకి మరో విశిష్ట వ్యక్తి
ఇదిగో ఈ మధ్యనే మరో రాజకీయ నాయకుడు, "ఒక్క రోజైనా ప్రధాన మంత్రి కావాలన్నదే ధ్యేయంగా రాజకీయ్యాని నడుపుతున్నారు.." అని పిలవబడే మరో విశిష్టమైన వ్యక్తి బ్లాగు ప్రపంచం లోకి ప్రవేశించారు. ఎవ్వరో అనుకుంటున్నారా.. అదేనండీ మన భారతీయ జనతా పార్టీ ప్రముఖులు, గౌరవనీయులైన లాల్ కృష్ణ అద్వాని. ఆయన మొదటి పుటలోని పలుకులు నాకు బాగా నచ్చాయి. మీరందరూ చదవ వలసిన కొన్ని మంచి మాటలు అందులో ఉన్నాయి. అయన ఏది చేసినా నిర్మొహమాటంగా.. నిర్దయగా.. నిస్పక్షపాతంగా.. తనదైన ముద్ర కలిగి ఉండేలా చేస్తారు. నాకు పుట్టి బుద్దెదిగినప్పటి నుంచి ఈయన చేసిన లేదా పాల్గొన్న చాలా కార్యక్రమాలలో స్వలాభం ఏమీ కనబడలేదు. దేశభక్తికి ఉదాహరణ ఎవరు అని అడిగితే, ఓ రకంగా వీరే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.
ఇంతా చెప్పి వీరి బ్లాగు లంకె ఇవ్వలేదను కుంటున్నారా.. ఇదిగో .. http://blog.lkadvani.in/ ఈయన మాటలని కొంచం తర్జుమా చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే, ఎలాగో అక్కడ చదువుతారు కదా అని, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కాకపోతే, వారి ఇప్పటి వరకూ బ్లాగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని స్పందిస్తే, అచ్చంగా నాలుగే నాలుగు పుటలు ప్రచురణకు వచ్చాయి. వాటిల్లో రెండు పుస్తకాల గురించే. కొంతలో కొంత చక్కగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమిటంటారా.. అదేనండి.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. దాని గురించి. నిజమే, జీవితం అంటే ఎన్నికలు మాత్రమే కాదు కదా అంటూ జీవితానికి పరమార్దం spiritual life, (ఆత్మ .. ఏమనాలో పాలు పోలేదు).
ఏది ఏమైనా, విఙ్ఞాన విషయానికి వస్తే చాలా విషయాలు తెలిసి అనర్గళంగా చర్చించే చాలా కొద్ది మంది రాజికీయ నాయకులలో వీరు ఒక్కరు. అంతే కాకుండా బ్లాగు పరంగా సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకున్న మొదటి రాజకీయ నాయకుడని నా అభిప్రాయం. చాలా మంది రాజకీయ నాయకులు కంప్యూటర్‍లను వాడగా చూసాము, కానీ ఇంత బాహాటంగా వ్రాయడం మొదలు పెట్టిన వారు వీరేనని నేననుకోవడం. అమితాబ్ బచ్చన్ గారు కూడ బ్లాగుతున్నారు, కానీ వారి ఎంతైనా ఇప్పుడు వితంతువే కదా.. ఏమిటి!!! అమితాబచ్చన్ వితంతువా అని అనుకుంటున్నారా.. నిజమేనండి.. రాజకీయ్యాలు నాకు పడవు, చేసింది చాలు అని ఉద్వాసన పుచ్చుకున్నారు కదా. నాకు తెలిసి ఆయన తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనుకోను.
ఇంతకీ మీరేమంటారు?
ఏమిటీ ఈ తరహా వర్క్ సంస్కృతి
నేను ఈ మధ్య వృత్తి రీత్యా అమెరికాలో ఉన్నాను కదా.. కొన్ని కొన్ని విషయాలు అసహ్యాన్ని కంపరాన్ని కలిగిస్తున్నాయి. వాటిల్లో ఇవిగో కొన్ని.
శుచి సుబ్రం - భారత దేశంలో మాకు నేరిన అలవాటు
ఉదయానే లేవంగానే పళ్ళు తోముకోవడం అలవాటు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే.. దాదాపుగా చిన్నప్పటి నుంచి పళ్ళు తోము కోందే మాట్లాడ వద్దేనేవారు. ఉదయానే పళ్ళు తోము కోవడం .. కళ్ళల్లో పుసులు తీసు కోవడం .. నాలుక గీకడం వంటివి .. ఎప్పుడైనా మర్చి పోయ్యాము అనుకోండి, పోలీస్ కుక్క వాసన పసిగట్టినట్లు ఎవరో ఒకరు పసిగట్టేశే వారు. అంతే, ఓ పది నిమిషాలు ఏక బీకిన తిట్లు చీవాట్ల దండకం. వాళ్ళ దండకం పడలేక చట్టుక్కున బాత్ రూమ్ లోకి దూరేశి ఓ పది నిమిషాలు బ్రష్ తో కుస్తీ పడి, అంతా అయ్యింన తరువాత తిట్టిన వాళ్ళ దగ్గర కెళ్ళి .. ఈ.. అంటూ పళ్ళన్నీ కనబడేటట్టు చూపించేత వరకూ వదిలే వారు కాదు.
ఇలా అలవాటై .. ఇక్కడికి వచ్చాక.. ఇక్కడ నాతో పని చేసే వాళ్ళ ప్రవర్తన చూసాక. మన సాంప్రదాయమే వీరి కన్నా కోటి రెట్లు మెరుగు అనిపిస్తోంది.
శుచి సుబ్రం - అమెరికాలో నేను గమనించిన అలవాటు
పనిలో తీవ్రంగా మునిగి ఉండగా ఏదో దుర్గంధం ముక్కు పుటాలకు తాకింది. ఏమిటా అని ఒక తల పక్కకు త్రిప్పితే, నాతో పనిచేసే సహ ఉద్యోగి. ఏదో పని పడింది. అడగడానికి వచ్చాడు. వాడు నోరు తెరిచినప్పుడల్లా దుర్ఘంధం ముక్కు పుటాల్ని చీల్చి చెండాడుతోంది. చికాకుగానే సమాధానమిచ్చి, వాడితో వేగే ఓపిక లేక, ఏవైనా సంధేహాలుంటే మెయిల్ చెయ్యమన్నాను. అదికాదూ .. అంటూ ఏదో చెప్పబోయాడు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో చూడలేదు, మరో అమెరికన్. వీడు వాడు కలిసి మెల్లిగా జారుకున్నారు. కడుపులో దేవుతూ ఉన్నట్లు ఉన్నందు వల్ల మెల్లిగా రెస్టు రూమ్.. అదేనండీ .. టాయిలెట్.. వైపు వడి వడిగా .. (ఇందులో మొహమాట పడవలసినది ఏమీ లేదు..) పరిగెత్తా.. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది. ఇందాకటి ఇద్దరూ అక్కడ తీరికగా నించొని పళ్ళు తోముకుంటున్నారు.
ఇంతకీ విషయమేమిటంటే.. వీళ్ళు రాత్రి పీకలదాకా బాగా తాగి తెల్లారిదాకా చిందులేసి.. ఉదయాన ఇంటికెళ్ళి ఓ రెండు గంటలు నిద్రపోయి.. పక్క మంచం మీదనుంచి నేరుగా ఆఫీస్ చేరుకున్నారన్న మాట. ఇదిగో ఇక్కడి కొచ్చి దంత ధావనం చేస్తున్నారన్న మాట
పెద్దలే ఇలా ఉంటే, ఇక పిల్లల్లు ఏ విధంగా తయారవుతారు?
మరో చికాకు విషయంతో మరలా మీ ముందుంటా..
భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧
పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..
ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి
ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (
) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..
- భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
- గ్రహాణాలు వాటి వివరణ
- సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..
రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు
ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.
కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త
ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.
నాగార్జున మహర్షి
రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.
మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.