అల్లూ అర్జున్ అభిమానులకు / అల్లూ అరవింద్ ల కోసం

మొన్నామధ్య విడుదలైన “బద్రీనాద్” పాటల విడుదల కార్యక్రమాన్ని నిన్న చూసాను. అందులో జనాలంతా అర్జున్ని అలాగే వివివిని ఎత్తేస్తుంటే, చాలా చికాకేసింది. అంతే కాకుండా, అంగ్లంలోని ఓ పాత సామెత గుర్తుకు వచ్చింది. అదేనండి నాకు దురద వచ్చినప్పుడు నా వీపు నువ్వు గోకు నీవీపు నేను గోకుతాను అంటూ సాగుతుందే, అదే సామెత. అక్కడ కనబడ్డ ప్రతీ వ్యక్తీ ఈ సినిమా బాగుండటమే కాకుండా, తెగ ఆడేస్తుందని డాంబికాలు కొడుతుంటే, ఇంతటి సొంత డబ్బా అవసరమా అనిపించింది.

సరే ఇక విషయానికి వస్తే, ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆడియన్స్ లోంచి చాలా మంది పవన్ కళ్యాణ్ గురించి గోల చేసారు. పవన్ గారి గురించి మరోసారి వ్రాస్తాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. “బద్రీనాద్” అనే పుణ్యస్థాలాన్ని ప్రాతి పధికగా తీసుకుని తీస్తున్న చిత్రం కావున ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీయార్ తీసిన శక్తి సినిమాలాగే ఉంటుందని ఊహించుకోగలను. కాకపోతే, కధని ఓ ఇంత అటు ఇటు చేసి కాస్తంత మషాలాలు జొప్పించి ఉంటారు అనుకుంటూ, మూల కధమాత్రం “శక్తి” లాంటిదే అయ్యుంటుందని నా ఊహ.

ఇక్కడ ఈ పుటకు అవసరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో కత్తి యుద్దం మరియు మార్షల్ ఆర్ట్స్ ప్రధాన పాత్ర వహించాయని పలువురు పలకడం. ఈ విషయం నాకు నచ్చింది, అంతే కాకుండా, వీరు చూపిన విజ్యువల్స్ కొన్నింటిలో మన అర్జున్ గారు కత్తిని చాలా చాక చక్యంగా త్రిప్పడం కూడా బాగుంది. అందువలన్ ఇందు మూలంగా నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ సినిమాని చూడదలిచాను. అంటే, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అన్నమాట.

ఇంతకు ముందు ఇలాగే పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చూద్దాం అనుకుంటే, అది ధియేటర్ల వద్ద డింకీ కొట్టి నేను చూద్దం అనుకునేటప్పటి మా ఊరినుంచి ఎత్తేసారు. అందువల్లన అల్లూల్లకు మరియు అల్లూల అభిమానులకు ఇదే నా హెచ్చరిక. నేను చూద్దాం అనుకున్న ఏ సినిమా ఆడినట్లు చరిత్రలో లేదు. ఆపై మీ ఇష్టం.

 
Clicky Web Analytics