ఏదో పరధ్యానంలో ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. చూసిన తరువాత నమ్మలేక పోయ్యాను. మళ్ళీ మళ్ళి చూసాను. ఒక వేళ ఇందులో కల్పితం ఏమైనా ఉందేమో అని. ఎక్కడా అలాంటి అవకాశం కూడా లేకుండా ఒరిజినల్‍గా ఉంది.
కధలోకి వెళితే, అప్పుడెప్పుడో అమెరికాలోని ఒక సింహాం పిల్ల బేరానికి పెట్టారు. ఈ విషయం ఆనోట ఆనోట ఓ పెద్దాయన చెవిన పడింది. తీరా అక్కడకు వెళ్ళి చూడాపోతే, ఇరుకైన బోనులో బక్క చిక్కిన ఓ సింహం పిల్ల బేలగా ఈయ్యననే చూస్తూ కనబడిందంట. ఇదేదో బాగానే ఉంది అని ఆ పెద్దాయన ఈ సింహం పిల్లని తనతో పాటుగా ఇంటికి తీసుకు పోయాడంట. వీరి ఇంటికి దగ్గర్లోని ఒక చర్చి ప్రాంగణంలో ఈ పులి పిల్లని ఆడుకోనిచ్చారట ఆ చర్చి నిర్వాహకులు. ఈ సింహం పిల్ల అనుకున్న దానికన్నా వేగంగా, త్వర త్వరగా పెరిగి పెద్దదవుతూ ఉన్నంతలో కొంత కాలం తరువాత ఆ పెద్దాయనకు ఓ ఆలోచన వచ్చింది..
ఛా!! సింహం ఏంటీ.. వేటాడక పోవడ మేమిటి!! దాని రాజసమేమైంది.. దాని రాజరికమేమైంది. స్వతహాగా స్వతంత్రంగా అడవిలో తిరగ వలసిన జంతువును, సాధు జంతువుగా మిగిలి పోవలసిందేనా!! పుట్టుకతో వచ్చిన స్వభావం పెంపకంతో మారి వాటి స్వగుణాన్ని, వాటి గుర్తింపును కోల్పోవాలా!!
అన్నదే తడవుగా, ఈ సింహం పిల్లని చక్కగా తీసుకు వెళ్ళి ఆఫ్రికాలో వదిలి వచ్చారు. ఆ తరువాత కొంత కాలానికి, బహుశా దాదాపుగా ఓ సంవత్సర కాలం తరువాత ఆ సింహం పిల్ల ఎలా ఉందో చూద్దాం అనిపించి ఈ పెద్దాయన వెళ్ళారు. అదిగో అప్పుడు తీసిన చిత్రమే ఇది. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠతో చూసాను. చూస్తున్నంత గుండె దిటవు చేసుకుని గమనించాను. కధ అంతా ఆంగ్లంలో ఉన్నా ఎందుకో వ్రాయాలని అనిపించింది.
మమతానురాగాలు ఒక్క మనుష్యులకే స్వంతం అనుకుని విర్రవీగే నాకు, నోరు లేని జీవాలు అందునా వేటాడడమే తత్వంగా, జన్మ హక్కుగా భావించే కౄర జంతువులకు కూడా మనసనేది ఉంటుందనీ, అవి కూడా ప్రేమిస్తాయనీ.. వాటికి కూడా స్నేహం అనేది ఒకటి ఉందనీ, స్నేహితుల విలువ ఏమిటో వాటికి తెలుసనీ.. మనుష్యులు మరియూ వారి సాంగత్యం లోని ప్రేమాప్యాయతలు మాకు అవగతమే అనే భావనను ఈ వీడియో ద్వారా తెలిసింది. మీరేమంటారు?
ప్రస్తుతానికి ఈ వీడియో తొలగించినట్లున్నారు. మీరు యౌతుబే.కం లో "christian the lion" అని గానీ.. "lion reunion" అనిగానీ వెతకండి