నైతిక విలువలు పుష్కలంగా ఉన్న టాటా కాపిటల్ వారి ప్రకటన

ఈ మధ్య అనుకోకుండా ఓ చెత్త ప్రకటన చూచిన తరువాత అనుకోకుండా ఈ ప్రకటన నా కంట పడింది. చెడ్డదానిని చెత్తగా ఉంది అని చెప్పినప్పుడు బాగున్నదానిని బాగుంది అని చెప్పడానికి నేనెందుకు వెనకాడాలని ఆలోచించిన తరువాత ఇదిగో మఱో ప్రకటన గురించి నా అభిప్రాయం. ఈ ప్రకటనలో చక్కగా ఇద్దరు పిల్లలనే వాడుకోవడంలో అశ్లీలానికి చోటు లేకుండా పోయింది.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ ప్రకటన వెనకాల దాగిఉన్న మూలాంశము. నాకు అది త్యాగంగా అనిపించింది. వ్యాపార పరంగా వీరు త్యాగం చేస్తారని అనుకోను, కానీ జనాలను నమ్మించే ప్రయత్నంలో ఈ మంచి ఆలోచనను చూపించిన విధం బాగుంది. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అసభ్యంగా హుందాగా చెప్పవచ్చో ఈ ప్రకటనలో చాలా బాగా చూపించారు.

 
Clicky Web Analytics