సినిమా పాటలంటే పదికాలాల పాటు వినడానికి సొంపుగా ఉండాలి, అంతె కానీ కొత్తల్లో కొత్తగా, పాతబడె కొద్దీ చత్తగా ఉంటే, జల్సా పాటల లాగే ఉంటాయి. ఈ మధ్య విడుదలైన జల్సా చిత్రం ఎన్ని చిత్ర-విచిత్రాలు చేసిందో మీకందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆ సినిమా ఇంకా చూడలేదు కానీ, చాలా మంది వ్రాసిన రివ్యూలు పుల్లుగా వారి వారి బ్లాగులలో చదవడమైనది. ఏమో, నేను స్వతహాగా సినిమాలు తక్కువగా చూస్తా కాబట్టి, ఆ సినిమా గురించి వ్యాఖ్యానించే అనుభవం లేదనుకోవచ్చు. ఇక అస్సలు విషయానికొస్తే.. అదేనండీ జల్సా పాటల విషయానికి వస్తే..
నాకు తెలిసినంత వరకూ రేండు రేడియే స్టేషన్ వాళ్ళు ఈ పాటల ప్రసార హక్కులు మాకే సొంతమంటే, మాకే సొంతం అన్న రీతిలో యడా పెడా వాయించేస్తున్నారు. ఇంతకీ ఎవ్వరు అధికారిక ( అఫీషియల్ పార్ట్‍నర్స్) హక్కుదారులో ఆ సినిమా వాళ్ళకే తెలియాలి. మీకేమైనా తెలుసా. తెలిస్తే, మరచి పోకుండా చెప్పండీ. చెప్పారనుకోండి మీకో పెద్ద -- పెడతా.
రోజూ ఆఫీస్‍కు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, నా నోకియా 3310 లోని రేడియో వింటూ హైదరాబాదు ట్రాఫిక్ భాధల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటాను. జల్సా విడుదలవ్వడానికి ముందు రెండు రోజుల నుంచి ఈ రోజు వరకూ ’పాడిందే పాటరా పాత పళ్ళ దోసరా..’ అంటూ అరిగి పోయిన గ్రామ పంచాయితీ రేడియోల్లో పందుల పెంపకం గురించి పాత రోజుల్లో వినిపించిన సొదలా.. ఏ కార్యక్రమానికి పడితే ఆ కార్యక్రమానికి.. జల్సా పాటలతో సంభందం ఉన్నా లేకపోయినా.. ఈ రేడియో జాకీలకి పిచ్చి పట్టినట్లు ఎన్ని సార్లు వినిపిస్తారో తెలియదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేసిందే వేసి, చికాకు పెట్టేస్తునారనుకోండి.
వీళ భాధ భరించలేక, ఫోన్ హేడ్‍సెట్ కాస్తా తీసేసి, చక్కగా నా మ్యూజిక్ ప్లేయర్‍ని బయటకు తీసా. ఆఫీస్‍కు వచ్చే వేళ్ళల్లో ఎదైనా కాల్ కనుక మిస్ అయితే, ఆఫీస్‍కు చేరుకున్నాకో లేక ఇంటికి చేరుకున్నాకో వాళకి తిరిగి మిస్ కాల్ చేస్తే, అవసరమైన వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తారు. లేకపోతే లేదు. కానీ ఈ జల్సా పాటలు, మొదట్లో బాగానే ఉన్నాయి, ఎందుకో ఇప్పుడిప్పుడే వెగటు పుడుతున్నాయి. కానీ ఎదో పద్యంలో చెప్పినట్లు..
అనగ అనగ రాగ మతిశయిల్లుచుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విస్వధా అభిరామ వినురవేమ
వినగా వినగా పాటలు వినసొంపవ్వాలి.. అలాగే తినగా తినగా.. వేప కాయలు కూడా తియ్యగా అవ్వాలి, ఏమిటో మరి నాకు ఈ పాటలు వినగా.. వినగా.. చెవులు తుప్పు పడుతున్నాయి. ఎవ్వరైనా పాటలు వింటే తుప్పు వదిలిందంటారు. ఏంటో కొత్తగా నాకు తుప్పు పడుతోంది. ఏమి చేతురా లింగా .. ఏమీ చేతురా..