సంపాదన సలహా - GTLInfra

ఈ మధ్య నేను కొంత కాలం ఉధ్యోగం లేకుండా ఉండవలసి వచ్చింది. ఖాళీగా ఉండడం దేనికని, దాచుకున్న సొమ్ము లోంచి కొంత ధనాన్ని షేర్ మార్కెట్‍లో పెట్టుబడి (ఇన్వెస్ట్) చేసాను. అలాగే కొంత లోతుగా పరిశోధించిన తరువాత ధైర్యంగా కొనడం మొదలు పెట్టాను. నష్టపోతావ్ అని చాలా మంది హెచ్చరించిన శ్రేయోభిలాషుల మాటలు పెడచెవిన పెట్టకుండా లెక్కప్రకారం రిస్క్ తీసుకున్నాను. అలా పెట్టుబడి పెట్టిన వాటిల్లోని కొన్ని షేర్ల వివవరాలు ఇక్కడ ప్రస్తావించడం కన్నా, ఇక ముందు నేను కొనబోయే వాటి వివరాలు ఇక్కడ ఉంచితే, చదువరులలో ఎవ్వరైనా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తారనీ ఆశిస్తాను.

 

ఇది ఒకవిధంగా ఉభయ లాబదాయకం. నాకు ఆయా షేర్ల గురించి తెలుస్తుంది, అలాగే చదివే వారిలో ఎవ్వరైనా పెట్టుబడి పెట్టి కొనే ఆలోచన ఉందనుకోండి, వారికి ఉచితంగా కొంత సమాచారం ఇచ్చిన వాడినౌతాను. ఎలా ఉంది.. సరి సరి.. ఇవ్వాళ్టి చిట్కా విషయానికి కొస్తే.. GTL Infrastructure అనే సంస్థ షేరు ఇవాళ్టి ధర 29రూపాయల 80పైసలు వద్ద అమ్మకం జరుగుతోంది. కాబట్టి నేను 29 రూపాయల దగ్గర కొనవచ్చు అనుకుంటున్నాను. మరో నెల వ్యవధిలో ఈ షేర్ ధర 35రూపాయలొ అవ్వవచ్చు.

 

మరి మీరేమంటారు?

ప్రతిపాదన - విన్నపం : హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

చదివే ప్రతీ ఒక్కరూ విధ్యాధికులే అని నేను నమ్ముతాను. విజయవాడలోని ఒక పుస్తక విక్రయశాల యందు ఉంచిన వాక్యం నా మనో ఫలకంపై చెరగని ముద్ర వేశాయి. వాటి ప్రేరణే ఈ పుటకు మూలం. ముందుగా ఆ పదాలు ఒక్క సారి మననం చేసుకుంటాను.

 

చిరిగి పోయిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఓ పుస్తకం కొనుక్కో..

 

పైన ప్రస్తావించిన మాటల్లో మంచిగా చూస్తే చదువే గుణాన్ని ప్రోత్సహిస్తున్నట్లుంటుంది. అదే వ్యాపారాత్మక దృష్టితో గమనిస్తే, బట్టలు కొనవద్దు అంటూ పుస్తకాల వ్యాపారాన్ని

ప్రోత్సహిస్తున్నట్లుంటుంది. ఏది ఏమైనా నా విషయంలో రెండూ జరిగాయి. ఎలా అంటారా.. ఇదిగో ఇలా.

 

చదవే తృష్ణ కలిగి కొనే స్తోమత నుంచి వచ్చిన నాకు, కొత్త చొక్కా కొన్నుక్కునే అవకాశం కలిగినప్పుడల్లా, లెనిన్ సెంటర్‍లో సెకెండ్ హాండ్ చొక్కా కొనుక్కుని మిగిలిన డబ్బులతో అలంకార్ దగ్గర ప్రతీ ఆదివారం జరిగే పాత పుస్తకాల ప్రదర్శనలో ఒక పుస్తకం కొనుక్కునే వాడిని.

 

ఇంతకీ అసలు విషయమేమిటంటే, ఇలా నాదగ్గర చాలా పుస్తకాలు ప్రోగయ్యాయి. చదివే ఆశక్తి కలిగిన ప్రతీ వ్యక్తి ఎదురైనప్పుడల్లా నేను చదివేసిన పుస్తకాలలో ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ వచ్చే వాడిని. ఇదేమీ కొత్తగాదు. పుస్తకాల పురుగులందరికీ ఈ అలవాటు ఉంటుంది. (చదివరులందరినీ కలిపి "పుస్తకాల పురుగులు" అని సంభోదించడం సబబు కాదని భావించిన యడల మన్నించగలరు)

 

అలా ప్రోగైన పుస్తకాలని మనం ఈ పుస్తక ప్రదర్శనలో ఉచితంగా పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా పంపిణీ చేసే పుస్తకాలలో ఏరంగానికి చెందినవైనా ఉండవచ్చు. నా వరకూ అయితే, ప్రస్తుతానికి చాలా సాంకేతిక పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. (తెలుగు) బ్లాగర్లు అందరూ ఈ విషయంపై స్పందిస్తే, ఈ విన్నపాన్ని మన్నిస్తే, వారి వారి వద్ద ఉన్న పుస్తకాలను మన ఈ తెలుగు స్టాలు వద్ద ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని ప్రతిపాదన.

 

మనకి ఇంకా పది రోజులు వ్యవధి ఉన్నందున, ఈ ప్రతి పాదనపై ఒక అవగాహనకు వచ్చే విషయమై అందరి అభిప్రాయాములు కావలెను.

 

నలుగురికి నచ్చి ఈ ఆలోచన ఒక ప్రతి పాదనకు వచ్చి.. కార్య రూపం దాల్చాలంటే, అందరి స్పందనలు వారి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఇతరాతర కోణంలో ఈ ఆలోచన ఎలా ఉంటుందో తెలియజేయగలరని విన్నపం

సౌర కుటుంబం లోని రెండు గ్రహాలు

చాలా రోజుల తరువాత తెలుగు పేపరు చదవడం తిరిగి మొదలు పెట్టాను. అందులో భాగంగా, ఆంద్రజ్యోతి తెచ్చుకుంటున్నాను. అంద్రజ్యోతే ఎందుకు అంటే.. దానికి వేరే కారణాలు ఏమీ లేవు గానీ.. ఎదో అలా యాదృశ్చికంగా జరిగిపోతోంది. ఇవాల్టి పత్రికలోని ఐదో పేజీలో "టుడే స్పెషల్" అంటూ.. ఆకాశంలో ముగ్గురు చెంద్రులు!! అన్న వార్త చదివిన తరువాత, తప్పని సరిగా ఇవ్వాళ సాయంత్రం ఇది మిస్ అవ్వకూడదనుకున్నాను.

First

కానీ .. తలచినదే జరిగినదా దైవం ఎందులకు .. అన్న పాట ఈ క్షణంలో బాగా సూట్ అవుతుంది. అన్నట్లుగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయ్యాను. ఇంతలో మా అన్నయ్య ఫోన్ చేసి, ఈ విషయాన్ని గుర్తుచేసాడు. అలాగే ఈ మధ్య కొన్న కెమెరా గురించి కూడా ప్రస్తావించాడు. అంతే, అనుకున్నదే తడవుగా మా అపార్ట్‍మెంట్ ఐదో అంతస్తుకు చేరుకుని చిత్రాలు తియ్యడం మొదలు పెట్టాను. ఇదిగో ఈ క్రింద ఉన్నవి అవే.

Third

మన పాల పుంతలో మన కంటికి కనిపించేటంతటి వరకూ చంద్రుని తరువాత అత్యంత ప్రకాశ వంతమైన గ్రహాలు బృహస్పతి మరియూ శుక్రగ్రహాలు మాత్రమే. అవిగో ఇవి అవే.

Sec

 
Clicky Web Analytics