సౌర కుటుంబం లోని రెండు గ్రహాలు

చాలా రోజుల తరువాత తెలుగు పేపరు చదవడం తిరిగి మొదలు పెట్టాను. అందులో భాగంగా, ఆంద్రజ్యోతి తెచ్చుకుంటున్నాను. అంద్రజ్యోతే ఎందుకు అంటే.. దానికి వేరే కారణాలు ఏమీ లేవు గానీ.. ఎదో అలా యాదృశ్చికంగా జరిగిపోతోంది. ఇవాల్టి పత్రికలోని ఐదో పేజీలో "టుడే స్పెషల్" అంటూ.. ఆకాశంలో ముగ్గురు చెంద్రులు!! అన్న వార్త చదివిన తరువాత, తప్పని సరిగా ఇవ్వాళ సాయంత్రం ఇది మిస్ అవ్వకూడదనుకున్నాను.

First

కానీ .. తలచినదే జరిగినదా దైవం ఎందులకు .. అన్న పాట ఈ క్షణంలో బాగా సూట్ అవుతుంది. అన్నట్లుగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయ్యాను. ఇంతలో మా అన్నయ్య ఫోన్ చేసి, ఈ విషయాన్ని గుర్తుచేసాడు. అలాగే ఈ మధ్య కొన్న కెమెరా గురించి కూడా ప్రస్తావించాడు. అంతే, అనుకున్నదే తడవుగా మా అపార్ట్‍మెంట్ ఐదో అంతస్తుకు చేరుకుని చిత్రాలు తియ్యడం మొదలు పెట్టాను. ఇదిగో ఈ క్రింద ఉన్నవి అవే.

Third

మన పాల పుంతలో మన కంటికి కనిపించేటంతటి వరకూ చంద్రుని తరువాత అత్యంత ప్రకాశ వంతమైన గ్రహాలు బృహస్పతి మరియూ శుక్రగ్రహాలు మాత్రమే. అవిగో ఇవి అవే.

Sec

3 స్పందనలు:

bujji said...

ఇందాక ఆఫీసు నుండి వచ్చేటప్పుడే చూసాను.కానీ అవి గ్రహాలనుకోలెదు, నక్షత్రాలనుకున్నా. ఎంటబ్బా ఇంత వెలిగిపోతున్నయి చుక్కలు ఇవ్వాళ అనుకున్నాను. చంద్రుడు కొంచెం పక్కకి జరిగితే స్మైలీ లాగా ఉండేది అనిపించింది.

Sujata said...

ayyayyo ! I missed it.

chala bavundi.

durgeswara said...

చక్రవర్తి గారూ

మీరు మమ్మల్ని మరచిపోయారు. మరలా మా బ్లాగ్ వైపుకు రాలేదు. హనుమదుపాసనా కుటుంబసభ్యులుగా మీరు నాకు బంధువ్ర్గములోనివారు. మీరు మల్లీ కనపడతారేమోనని చూసానుకాని ఇన్నిరోజులకు కనపడ్దారు సమ్తోషము. ఒకసారి నా బ్లాగ్లు చూడగలరు. మీతో పనివున్నది.

http://durgeswara.blogspot.com

http://daivaleelalu.blogspot.com

 
Clicky Web Analytics