ప్రతిపాదన - విన్నపం : హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

చదివే ప్రతీ ఒక్కరూ విధ్యాధికులే అని నేను నమ్ముతాను. విజయవాడలోని ఒక పుస్తక విక్రయశాల యందు ఉంచిన వాక్యం నా మనో ఫలకంపై చెరగని ముద్ర వేశాయి. వాటి ప్రేరణే ఈ పుటకు మూలం. ముందుగా ఆ పదాలు ఒక్క సారి మననం చేసుకుంటాను.

 

చిరిగి పోయిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఓ పుస్తకం కొనుక్కో..

 

పైన ప్రస్తావించిన మాటల్లో మంచిగా చూస్తే చదువే గుణాన్ని ప్రోత్సహిస్తున్నట్లుంటుంది. అదే వ్యాపారాత్మక దృష్టితో గమనిస్తే, బట్టలు కొనవద్దు అంటూ పుస్తకాల వ్యాపారాన్ని

ప్రోత్సహిస్తున్నట్లుంటుంది. ఏది ఏమైనా నా విషయంలో రెండూ జరిగాయి. ఎలా అంటారా.. ఇదిగో ఇలా.

 

చదవే తృష్ణ కలిగి కొనే స్తోమత నుంచి వచ్చిన నాకు, కొత్త చొక్కా కొన్నుక్కునే అవకాశం కలిగినప్పుడల్లా, లెనిన్ సెంటర్‍లో సెకెండ్ హాండ్ చొక్కా కొనుక్కుని మిగిలిన డబ్బులతో అలంకార్ దగ్గర ప్రతీ ఆదివారం జరిగే పాత పుస్తకాల ప్రదర్శనలో ఒక పుస్తకం కొనుక్కునే వాడిని.

 

ఇంతకీ అసలు విషయమేమిటంటే, ఇలా నాదగ్గర చాలా పుస్తకాలు ప్రోగయ్యాయి. చదివే ఆశక్తి కలిగిన ప్రతీ వ్యక్తి ఎదురైనప్పుడల్లా నేను చదివేసిన పుస్తకాలలో ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ వచ్చే వాడిని. ఇదేమీ కొత్తగాదు. పుస్తకాల పురుగులందరికీ ఈ అలవాటు ఉంటుంది. (చదివరులందరినీ కలిపి "పుస్తకాల పురుగులు" అని సంభోదించడం సబబు కాదని భావించిన యడల మన్నించగలరు)

 

అలా ప్రోగైన పుస్తకాలని మనం ఈ పుస్తక ప్రదర్శనలో ఉచితంగా పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా పంపిణీ చేసే పుస్తకాలలో ఏరంగానికి చెందినవైనా ఉండవచ్చు. నా వరకూ అయితే, ప్రస్తుతానికి చాలా సాంకేతిక పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. (తెలుగు) బ్లాగర్లు అందరూ ఈ విషయంపై స్పందిస్తే, ఈ విన్నపాన్ని మన్నిస్తే, వారి వారి వద్ద ఉన్న పుస్తకాలను మన ఈ తెలుగు స్టాలు వద్ద ఉచితంగా పంపిణీ చేస్తే బాగుంటుందని ప్రతిపాదన.

 

మనకి ఇంకా పది రోజులు వ్యవధి ఉన్నందున, ఈ ప్రతి పాదనపై ఒక అవగాహనకు వచ్చే విషయమై అందరి అభిప్రాయాములు కావలెను.

 

నలుగురికి నచ్చి ఈ ఆలోచన ఒక ప్రతి పాదనకు వచ్చి.. కార్య రూపం దాల్చాలంటే, అందరి స్పందనలు వారి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఇతరాతర కోణంలో ఈ ఆలోచన ఎలా ఉంటుందో తెలియజేయగలరని విన్నపం

2 స్పందనలు:

కత్తి మహేష్ కుమార్ said...

బ్లాగుల గురించి పుస్తకాలున్నాయా? అని కూడా కొందరు అడిగారట. ఆదిశగాకూడా ప్రయత్నాలు చెయ్యొచ్చు.

Another side of coin! said...

చక్రవర్తి గారు
ఈ ఆదివారం సాయంత్రం ఎమి తోచక ఇంటెర్నెట్ లొ తెలుగు భాషకి సంభందించిన విషయాలు తెలుసుకొవాలని అలా కొన్ని సైట్లు వెదికె సరికి గూగ్ల్ లొ ఈ విషయం అగుపించింది, ఇది బహుశా యాద్రుచిఖం ఎమో మీ బ్లాగు చూచి ఎందుకొ నాకు చాలా సంతొషంగా అనిపించింది.

చాల బాగుంది మీ 'ఉబుసు పొకా కబుర్లు... ఇంక రాయండి, నేను మరి కొన్ని మొదలుపెడతాను ...

 
Clicky Web Analytics